For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Tourism Day 2020 : టూరు... జోరు... అలా వెళ్తే వచ్చే కిక్కే వేరు...! రోజంతా మాంచి హుషారు..

మన హ్యుమన్ లైఫ్ లో ట్రావెల్ ఎందుకని ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం...

|

కొందరికి రోడ్డుపై ప్రయాణమంటే ఇష్టం.. మరి కొందరికి రైలు జర్నీ అంటే ఆనందం.. ఇంకొందరికీ గగనంలో విహరించడం అంటే సంతోషం.. ఇలా ఎవ్వరు ఎన్ని రకాలుగా అనుకున్నా విహారం అనేది అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

World Tourism Day : Why traveling is important for human life in telugu

ఇప్పుడిప్పుడే కరోనా లాక్ డౌన్ నుండి మినహాయింపులు దొరకడంతో ప్రతి ఒక్కరూ బయటకు అడుగు పెడుతున్నారు. ఇన్నిరోజులు నాలుగు గోడల మధ్య నలిగిపోయిన వారంతా.. ఇక ఈ జీవితం ఇంతే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అన్ లాక్ డౌన్ ప్రారంభమై దశలవారిగా అన్నింటికీ అనుమతులు లభిస్తున్నాయి.

World Tourism Day : Why traveling is important for human life in telugu

డైలీ సీరియల్ లా మారిపోయిన జీవితంలో కొంచెం విరామం కావాలి.. వినోదం పొందాలి అనుకుంటున్నారా? మనసుకు కాస్త ప్రశాంతత పొందాలనుకుంటే మాత్రం మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలి. అందుకోసం ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశమంతటా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. ఈ సందర్భంగా మన దేశంలో ఏ ప్రాంతంలో ఏ మూలకు వెళ్లినా మనకు పచ్చని అడవులు.. చెట్లు.. కొండల నడుమ జాలువారే అందమైన జలపాతాలు దర్శనమిస్తున్నాయి.

World Tourism Day : Why traveling is important for human life in telugu

నేడు (సెప్టెంబర్ 27వ తేదీ) ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day) సందర్భంగా మీకు దగ్గర్లోని ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి అందాలు చూడటమే కాదు.. మనం ఉత్సాహాన్ని పొందడమే కాదు.. ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు. కరోనా మహమ్మారి వంటి సమయంలో ఈ చిన్న ప్రయాణం మనపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ టూరిజం డేగా నిర్వహిస్తున్నారు. ఇలా మీరు నిత్యం ఆనంద ప్రపంచంలో విహరించడం వల్ల మీరు బోలెడంత ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడే చూసేయ్యండి...

ఒత్తిడిని తగ్గిస్తుంది...

ఒత్తిడిని తగ్గిస్తుంది...

మీరు కొత్త ప్రదేశానికి ప్రయాణం చేయడం వల్ల మీకు ఒత్తిడి అనేది కచ్చితంగా తగ్గుతుంది. అంతేకాదు మీలో సంతోషాన్ని పెంచి, మీ సమస్యలకు పరిష్కారం లభించేందుకు సహాయపడుతుంది. మీరు ఆ ప్రదేశానికి వెళ్లొచ్చిన అనంతరం కూడా అదే ఉత్సాహం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ మీకు నమ్మకం రాకపోతే.. మీరు ఒకసారి ట్రై చెయ్యండి... అందులోని మజా ఏంటో మీకే తెలుస్తుంది.

క్రియేటివిటీ పెరుగుతుంది..

క్రియేటివిటీ పెరుగుతుంది..

జర్నీ మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కారులో షికారు కెళ్లినా.. బైక్ రైడింగు చేసినా.. మన మనసుకు కచ్చితంగా ఉల్లాసం కలుగుతుంది. కొత్త వ్యక్తులు.. కొత్త ప్రదేశాలు.. కొత్త పరిచయాలు.. కొత్త భాష.. సరికొత్త అనుభవాలతో మాంచి అనుభూతి కలుగుతుంది. దీని వల్ల బ్రెయిన్ బాగా పని చేస్తుంది. ఎవరైతే ఎక్కువ జర్నీ చేస్తారో.. వారిలో క్రియేటివ్ ఆలోచనలు పెరుగుతాయని పలు సర్వేలు కూడా స్పష్టం చేశాయి.

హార్ట్ స్ట్రోక్ సమస్యకు చెక్...

హార్ట్ స్ట్రోక్ సమస్యకు చెక్...

మనం ఎక్కువగా జర్నీ చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే జర్నీ చేసిన సమయంలో మనకు ఒత్తిడి, ఉద్వేగం అనేది తగ్గుతుంది. జర్నీ చేయని వారితో పోల్చితే ఏడాదికి కనీసం ఒకసారైనా జర్నీ చేసే అమ్మాయిలు.. అబ్బాయిల్లో హార్ట్ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయన ఫ్రామింగ్ హమ్ స్టడీ కూడా పేర్కొంది.

ఇమ్యునిటీ పవర్ పెరుగుదల..

ఇమ్యునిటీ పవర్ పెరుగుదల..

మీరు ఎప్పుడైతే కొత్త కొత్త ప్రదేశాలకు.. సరికొత్త వాతావరణంలో అడుగుపెడతారో.. ఆ సమయంలో మీరు చేసిన జర్నీ వల్ల మీ శరీరంలో బలమైన యాంటి బయోటిక్స్ ఏర్పడతాయి.. దీని వల్ల మీ ఇమ్యునిటీ పవర్ కూడా పెరుగుతుంది.

బాడీ ఫిట్..

బాడీ ఫిట్..

మీరు ఎప్పుడైతే జర్నీ చేయాలనుకుంటారో అప్పుడు మీరు ముందుగా ఫిట్ గా ఉండాలని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు చేసే జర్నీ ద్వారా కూడా మీ బాడీని ఫిట్ గా మార్చుకోవచ్చు. మీరు కొత్త ప్రాంతాలను.. కొత్త వ్యక్తులను.. కొత్త వాతావరణాన్ని చూస్తూ ఎంత దూరం వెళ్తారో మీకే తేలీదు. అందుకనే మీకు తెలియకుండానే మీ బాడీని ఫిట్ మార్చుకుంటారు.

స్వచ్ఛమైన గాలి..

స్వచ్ఛమైన గాలి..

మీరు వెళ్లే ప్రదేశంలో పచ్చని చెట్లు.. అందమైన అడవులు.. అద్భుతమైన జలపాతాల వంటి ప్రాంతాల్లో విహరించి.. అక్కడే స్నానం చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా పెరుగుతుంది. పచ్చని ప్రాంతాల్లో కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో ఔషధ గుణాలు ఉండే మొక్కల నుండి వీచే స్వచ్ఛమైన గాలి, వాటి మీదుగా ప్రవహించే జలాలు మన బాడీకి ఎంతో మేలు చేస్తాయి.

ఆరోగ్యాన్ని మరింతగా..

ఆరోగ్యాన్ని మరింతగా..

చూశారు కదా.. ట్రా‘వెల్' వల్ల మీకు ఎన్ని ప్రయోజనాలున్నాయో.. కాబట్టి మీరు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా మీకు నచ్చిన ప్రదేశంలో పర్యటించేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని మరింతగా పెంచుకోండి...

English summary

World Tourism Day 2020 : Why travelling is important for human life in telugu

Here we talking about the World Tourism Day 2020 : Why traveling is important for human life in telugu. Read on
Desktop Bottom Promotion