For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు ఇతరుల ఐడియాలను దొంగిలిస్తారట...!

|

ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా ఐడియా కొంచెం కొత్తగా ఉంటే చాలు వెంటనే వైరల్ అయిపోతుంది. అయితే మనలో చాలా మందికి నిత్యం రకరకాల ఆలోచనలు వస్తుంటాయి.

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు.. లేదా నిద్రలో ఉన్నప్పుడు.. లేదా మనకు ఏదైనా ప్రేరణ కలిగే విషయాలను చూసినప్పుడు మనం కూడా అలాంటివి చేయాలనే ఐడియాలు వస్తుంటాయి. అయితే ఇలా ఆలోచించే గుణం చాలా తక్కువ మందికే ఉంటుంది. అతి తక్కువ మంది మాత్రమే సొంతంగా ఆలోచిస్తారు. చాలా మంది తరచుగా ఇతరుల నుండి ఆలోచనలను పొందుతారు.

అయితే వాటిని కొంచెం మార్పులు చేసి క్రియేటివ్ గా మార్చుకుంటారు. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇతరుల ఆలోచనలను దొంగిలించేసి.. మన సొంతం అంటూ ఉంటాం. ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువగా సినిమా కథలు, పాటలు లేదా రాజకీయాల్లో తరచుగా వింటూ ఉంటాం. కొందరు మాత్రం నిజాయితీగా, ప్రతి దాని నుండి వార్తలు, పుస్తకాలు, సంగీతం, వ్యక్తులు మరెన్నో అంశాలను శోధించి.. పరిశోధించి.. ఆలోచనలు చేస్తూ ఉంటారు.

కానీ కొందరు మాత్రం ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇతరుల ఐడియాలను కొట్టేస్తుంటారు. అలాంటి వారిని కనిపెట్టడం కొంచెం కష్టమైన పనే. అయితే అలాంటి వారెవరో తెలిపేందుకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. దీని ప్రకారం కొన్ని రాశుల వారు ఇతరుల ఐడియాలను దొంగిలిస్తారంట.. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా మీరు అప్రమత్తంగా ఉండండి...

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ఇతరులను చూసి, వారిలోని లక్షణాలు లేదా నైపుణ్యాలను నెర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీరి కంటే ఇతరుల ఐడియాలు బాగున్నాయని వీరు భావిస్తే, ఏ మాత్రం మొహమాటం లేకుండా చాలా సులభంగా ఐడియాలను దొంగిలిస్తారు. అంతేకాదు వాటినే కొంచెం క్రియేటివ్ గా మార్చి తమకే క్రెడిట్ దక్కేందుకు ఏ మాత్రం వెనుకాడరు. అయితే అలా చేయడం అనైతికమని మాత్రం గ్రహించరు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఎవరైనా ఐడియాలను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు వీరు నిపుణులను సంప్రదిస్తారు. అవి నిరాధరం అని నిరూపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇతరుల ఆలోచనలను సొంతంగా చెప్పుకోవడాన్ని చాలా తెలివైన పని అని భావిస్తారు. అంతేకాదు వీరు ఆ ఐడియాకు సంబంధించిన క్రెడిట్ ఎవ్వరికీ ఇవ్వరు. ఎందుకంటే వీరు ఇతరుల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోరు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఎల్లప్పుడూ అత్యంత ప్రాచుర్యం పొందిన రాశిచక్రాలలో ఒకటిగా ప్రశంసించబడతారు. వీరు ఇతరుల ఆలోచనలను దొంగిలించడమే కాదు.. అవి తమకొచ్చిన ఐడియాలుగా చెప్పుకుంటారు. అందులో ఏ మాత్రం తప్పు లేదనే అభిప్రాయంలో ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కువగా ఆరాధించబడతారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు సొంతంగా ఏదైనా చేయాలని.. అందరినీ ఆకట్టుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. అయితే వీరికి అలాంటి ఐడియాలు రావు. అందుకే వీరు ఐడియాల గురించి ఇతరులపై ఆధారపడతారు. వీరి ఆలోచనలు కూడా ఎల్లప్పుడూ అశాస్త్రీయంగా ఉంటాయి. అందుకే వీరి ఐడియాలు ఎక్కువగా ప్రజాదరణ పొందవు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు ఇతర వ్యక్తుల ఐడియాలను దొంగిలించడంలో కొంత నిజాయితీగా వ్యవహరిస్తారు. వీరు అలా చేయడం చాలా అరుదు. అంతేకాదు ఒకవేళ అలాంటి తప్పు జరిగితే, వీరు క్షమాపణ కూడా కోరతారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి వాటిని తోసిపుచ్చడానికి అలాంటి వ్యక్తులతో చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడతారు. అందుకే ఇలాంటి వ్యక్తులకు ఐడియాకు సంబంధించిన క్రెడిట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ప్రాధాన్యతను బట్టి మాత్రమే ఇతరుల ఆలోచనలను దొంగిలిస్తారు. అదే సమయంలో వీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. అయితే వీరు ఇతరుల ఆలోచనలను దొంగిలించేటప్పుడు ఎక్కువగా ఆర్థిక పరమైన అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారట. అంతేకాదు ఏవైనా ఐడియాలను దొంగిలిస్తే.. వాటి గురించి ఆలోచిస్తూ.. వాటిని మరింత క్రియెటివ్ గా మారుస్తూ ఉంటారట.

English summary

Zodaic signs who steal ideas from others in Telugu

Check out these zodiac signs who steal ideas from others in telugu. Read on.