For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 రాశులవారు ఎప్పుడూ ప్రశాంతంగా..సంతోషంగా..ఉంటారని మీకు తెలుసా?

ఈ 5 రాశులవారు ఎప్పుడూ ప్రశాంతంగా..సంతోషంగా..ఉంటారని మీకు తెలుసా?

|

కొంతమంది ఎల్లప్పుడూ ఏదో ఆందోళన..సంఘర్షణలో ఉంటారు మరియు సంతోషంగా ఉండాలన్న ఆలోచనే వీరికి ఉండదు. కానీ కొంతమంది ఎప్పుడూ దీనికి వ్యతిరేకంగా శాంతిని కోరుకుంటారు. వారు ఆందోళన చెందరు మరియు అలా ఎప్పుడు ఆందోళన లేదా సంఘర్షణలో ఉండే వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారు కొట్లాటలు, గొడవలు, ద్వేషాలకు దూరంగా ఉంటారు.

అలా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే వారికి ఒక నిర్థిష్టమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వం అందరికీ రాదు. ఆస్ట్రాలజీ ప్రకారం అటువంటి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే కొన్ని రాశుల వారు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండాలని, గొడవలకు, అల్లర్లకు మరియు ఆందోళనలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు.

ప్రశాంత జీవితాన్ని కోరుకునే వారు కొన్ని ఆందోళనకర పరిస్థితుల్లో వైఖరిని మరియు నిగ్రహాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అయితే కొన్ని ఆందోళనరన పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండటమే ఉత్తమం. కొన్నిక్లిష్ట పరిస్థితుల్లో సైలెంట్గా ఉండటమే మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కావు. ఆ కాస్త సమయం సైలెంట్ గా ఉంటే ఆ తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పొందుతారు. ఆ విధంగా బందాలు దగ్గరవుతాయి. మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే ఆందోళకరమైన సంఘర్షణలు జరగకుండా నిరోధించాలి. అటువంటి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే కొన్ని రాశులవారు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

తులారాశి

తులారాశి

తులరాశి వారు అందరూ ఐక్యంగా ఉండాలని, ఎటువంటి విభేదాలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా గొడవపడుతున్నా..మాటలతోనే కావచ్చు అటువంటి వారి పట్ల ఈ రాశి వారు అసౌకర్యంగా ఉంటారు. ఈ తులరాశి వారు ఏ విషయమైనా వివిధ కోణాల్లో చూస్తారు. ప్రమాదంలో ఉన్నప్పుడు సమగ్రతతో తార్కికంగా ఆలోచించగలరు. వారు ఇతరులను నిందించడం లేదా బెదిరించడం చెయ్యరు. వారు కలిసి ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. న్యాయబద్దంగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం

కర్కాటక రాశి వారు అందరూ ఒకే కుటుంబంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వీరు కుటుంబం లేదా స్నేహతులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వారు సమస్యను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తారు. వారందరితో కమ్యూనికేట్ చేయడం మరియు నిజాయితీగా మాట్లాడటం ద్వారా స్నేహితుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య ఉన్నప్పుడు ఈ రాశి వారు రెండు వైపులా వారి వాదనను వింటారు. అవసరమైనప్పుడు మాత్రమే సలహా ఇస్తారు. అవసరం లేకుండా ఎప్పుడూ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు.

మీనరాశి

మీనరాశి

ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో వారిని అడగకుండానే వీరు అర్థం చేసుకోగలరు. ఎదుటి వారు నేరుగా వీరికి చెప్పలేకపోయినా సరే వీరు అర్థం చేసుకుంటారు. మీనరాశి వారు చాలా సున్నిత మనస్కులు. ఏవిషయంలో అయిన స్పష్టంగా ఉంటారు. గొప్ప సానుభూతిని కలిగి ఉంటారు. ఇదే వారిని కాపాడగలదు.

వీరు ఇతరులను నిందించరు, ఎవరినీ చెడుగా చేయడానికి ప్రయత్నించరు. వీరు పరిస్థితిని నియంత్రించగలరు మరియు పరిస్థితిని మరింత దిగజార్చకుండా నిర్వహించగలరు. వీరు సమస్య కంటే పరిష్కారం మార్గం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు.

మకరరాశి

మకరరాశి

మకరరాశి వారు విశ్వసనీయతను, నమ్మకాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు ఆచరణాత్మకంగా ఉంటారు, వీరు చెప్పే విషయాల పట్ల ఎల్లపుడు జాగ్రత్తగా ఉంటారు. వీరు సంఘర్షణను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రెండు వైపులా అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలను కనుగొనగలరు. మకరం అంటే మౌనంగా..ప్రశాంతంగా ఉంటారని అర్థం. అంతే కాదు, తన చుట్టు ఉన్న వారు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇతరులు వారిపై కోపం తెచ్చుకున్నా, వీరు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తారు.

కన్యరాశి:

కన్యరాశి:

కన్యరాశివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు ఆచరణాత్మక సలహాలను అందించడానికి ప్రసిద్ది చెంది ఉంటారు. గొడవ లేదా తగదాలు పడే వారిని మరింత ప్రోత్సహిస్తారు. ఆపై సమస్యను పూర్తిగా పరిష్కరించే మార్గం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు.

అతిగా స్పందించకపోవడం వీరి నైజం . సహోద్యోగుల మధ్య గొడవులు పరిష్కరించడానికి వీలుకాకపోతే ఇద్దరినీ తొలగించటానికి కారణం కావచ్చు,

కన్య రాశి వారు ఏదీ సామాన్యంగా ఒప్పుకోరు. వారి చెప్పే మాటలకు ఎదుటివారు కరిగిపోతారు. పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తారు.

English summary

Zodiac Signs Who Just Want To Keep The Peace

People who born in these zodiac signs want to keep peace always.
Story first published:Wednesday, August 28, 2019, 16:18 [IST]
Desktop Bottom Promotion