For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...తెలంగాణ ముద్దుబిడ్డలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...తెలంగాణ ముద్దుబిడ్డలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

|

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగం చేశారు. 1952 సాధారణ ఎన్నికల జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మిలటరీ, సివిల్ అధికారుల పాలనలో ఉండటంతో ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్లకు స్థానిక ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆంధ్రా ప్రాంతంలో అప్పటికే బ్రిటీష్ వారి కింద శిక్షణ పొంది అనుభవం ఉన్న అధికారులను హైదరాబాద్ కు పిలిపించుకుని తెలంగాణలోని వివిధ చోట్ల కీలమైన ఉద్యోగాలు ఇచ్చేశారు. తరువాత అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నా ఆ ఉద్యమాలను కొందరు రాజకీయ నాయకుల తొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి.

Telangana Formation Day 2021: Wishes, Messages, Posters, Images, WhatsApp and Facebook Status in Telugu

పెద్మనుషుల ఒప్పందాలను గాలికి వదిలేశారని 1969లో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున మొదలైయ్యింది. ఖమ్మం జిల్లాలోని థర్మల్ స్టేషన్ లో పనిచేసే ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులు ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారని అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అప్పటి ఉద్యమానికి పాల్వంచానే పునాది వేసింది. జనవరి 10వ తేదీ నుంచి అక్కడ నిరాహారదీక్షలు మొదలైనాయి. అక్కడ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణాచారి నిరాహార దీక్ష చేశాడు. అప్పటి నుంచి ఉద్యమాలు ఖమ్మం జిల్లా కేంద్రం, అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి ఉద్యమాలు పాకిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం అయిన తరువాత తెలంగాణ ఉద్యమం జోరందుకుంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

*. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కే. చంద్రశేఖర్ రావ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

*. 2013 జులై 30వ తేదీన కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానం చేసింది.

*. 2013 అక్టోబర్ 3వ తేదీన కేంద్ర మంత్రిమండలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదముద్ర వేసింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

*. 2014 ఫిబ్రవరి 18వ తేదీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దుతుగా ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతుతో లోక్ సభలో, అదే ఏడాద ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది.

*. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ప్రవేశపెట్టింది.

*. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు 2014 మార్చి 1వ తేదీన రాష్ట్రపతి ఆమోదం పొందింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...

*. 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

*. 1969 నుంచి తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా

అవమానాలు, అసమానతలను అంతం చేస్తూ

60 ఏళ్ల కల సాకారం కావడంతో

తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన

అమరవీరులను స్మరిస్తూ

వారి అడుగుజాడాల్లో నడిచే ప్రతి ఒక్కరికి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఎందరో అమరవీరులు, విద్యార్థుల ప్రాణ త్యాగాలతో

ఆమరణ నిరాహార దీక్షలతో

ప్రాణాలు అర్పించగా వచ్చిన

బంగారు తెలంగాణలోని ప్రతి ముద్దుబిడ్డకు

తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఆరు ప్రగతి వసంతాలు పూర్తి చేసుకుని

ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా

ప్రతి తెలంగాణ పౌరుడికి

తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

జై తెలంగాణ..... జైజై తెలంగాణ

మీ హక్కుల కోసం పోరాటం చేసి

తెలంగాణను సాధించుకున్న

ప్రతి ఒక్క తెలంగాణ ముద్దుబిడ్డకు పేరుపేరునా..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

English summary

Telangana Formation Day 2021: Wishes, Messages, Posters, Images, WhatsApp and Facebook Status in Telugu

Every year on June 2 is observed as Telangana Formation Day Here are the Telangana Formation Day 2021: Wishes, Messages, Posters, Images, WhatsApp and Facebook Status in Telugu. Take a look.
Desktop Bottom Promotion