For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

China Sheep Mystery: 12 రోజులుగా వృత్తాకారంలో తిరుగుతున్న చైనా గొర్రెలు, వింత ప్రవర్తన వెనక కారణాలేంటి?

గొర్రెల మంద నవంబర్ మొదటి వారం నుండి ఇలా తిరుగుతూనే ఉన్నాయి. అలా ఎందుకు తిరుగుతున్నాయన్నది అతనికి కూడా పాలుపోవడం లేదు.

|

China Sheep Mystery: కొన్ని రోజులుగా చైనా గొర్రెల మంద వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంత వైరల్ అవుతోందంటే అందులో ఉన్న గొర్రెలు కొన్ని రోజులుగా వృత్తాకారంలో తిరుగుతున్నాయి. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా వారాల తరబడి ఆ గొర్రెలు అలాగే ఒక సర్కిల్ లో తిరుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి అనే సంబంధం లేకుండా అలసట లేకుండా ఇలా తిరుగుతూనే ఉన్నాయి. ఇలా వింతగా ప్రవర్తిస్తున్న గొర్రెల మంద వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చైనా అధికారిక మీడియా ట్విట్టర్ లో పోస్టు చేసింది.

What is the reason behind a mystery sheep walking in a circle for 12 days in China?

నార్త్ చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి వందలకొద్దీ గొర్రెలను పెంచుతున్నాడు. అతనికి చెందిన ఓ గొర్రెల మంద నవంబర్ మొదటి వారం నుండి ఇలా తిరుగుతూనే ఉన్నాయి. అలా ఎందుకు తిరుగుతున్నాయన్నది అతనికి కూడా పాలుపోవడం లేదు. నవంబర్ 4వ తేదీ నుండి ఈ గొర్రెలు ఇలా తిరుగుతూ ఉన్నాయని చైనా అధికారిక మీడియా పీపుల్స్ డైలీ చైనా నవంబర్ 16వ తేదీన ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసింది. అయితే ఆ గొర్రెలు ఇంకా అలా తిరుగుతున్నాయా.. లేదా.. అనే విషయాన్ని మాత్రం పీపుల్స్ డైలీ చైనా చెప్పలేదు. అలాగే రోజుల తరబడి తిరుగుతున్న ఆ గొర్రెలు మధ్యలో మేత మేస్తున్నాయా.. అలసట వచ్చినప్పుడు నిద్ర పోతున్నాయో లేదో అనే విషయాలు వెల్ల్డించలేదు.

గొర్రెలు చాలా కాలంగా ఒకే చోట ఉండిపోయాయని ఈ కారణంగానే వాటి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండిపోవడం వ ల్ల ఆ అసహనం, కోపంతో అలా గుండ్రంగా తిరుగుతున్నాయని చెబుతున్నారు. వలయాకార పెన్స్ లో ఉన్న గొర్రెలు తాము ఇంకా అక్కడే ఉన్నట్లుగా భావించి అలా గుండ్రంగా తిరుగుతున్నాయని, ఒక గొర్రె అలా తిరగడం చూసి మరో గొర్రె జత కలుస్తూ అలా గొర్రెల సహజ స్వభావంలో మందగా అలా తిరుగుతూ ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ గొర్రెల యజమాని చెప్పిన విషయం ఇక్కడ గమనించదగినది. తన వద్ద 34 పెన్స్ లు(గొర్రెలను ఉంచే ప్రాంతం) ఉన్నాయని, కానీ ఒక్క పెన్స్ లోని గొర్రెలు మాత్రమే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాయని అతడు పేర్కొంటున్నాడు.

లిస్టెరియోసిస్ కారణమా?

లిస్టెరియోసిస్ అనే బ్యాక్టీరియా సోకిన గొర్రెలు ఇలాగే వింతగా ప్రవర్తిస్తాయని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. దీనిని సర్క్లింగ్ వ్యాధి అని కూడా పిలుస్తారని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నేల, జంతువుల మలం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. లిస్టెరియోసిస్ బ్యాక్టీరియా సోకిన జంతువుల్లో కుంగుబాటు వస్తుంది. ఆకలి తగ్గుతుంది, జ్వరం, పాక్షిక పక్షవాతం కనిపిస్తాయి. అలాగే వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన జంతువులు 48 గంటల్లోపు మరణించే అవకాశాలు ఎక్కువ.

అయితే చైనాలోని గొర్రెలు మాత్రం వారాల తరబడి ఇలా తిరుగుతూనే ఉన్నాయి అంటే వాటికి ఈ బ్యాక్టీరియా సోకి ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

English summary

What is the reason behind a mystery sheep walking in a circle for 12 days in China?

read on to know What is the reason behind a mystery sheep walking in a circle for 12 days in China
Desktop Bottom Promotion