చనిపోయినవారు మీకు కలలో కనిపిస్తున్నారా..? దానికి కారణాలు ఇవే..!

మనకు రకరకాల కలలు వస్తాయ్. కానీ కొన్ని సార్లు వచ్చిన కలలు మనల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయ్. ఎప్పుడో మరణించిన మన తాత, అమ్మమ్మ లాంటి వారు కూడా కలలో కనిపిస్తారు. కల కంటున్నంత సేపు కలలో వారితో వుంటాము. వారు మరణించారని మనకు కలలో తెలుస్తుంది. అయినా కలలో వారితోనే వుంటాం. ఇలా మనకు అప్పుడప్పుడూ జరుగుతుంది. ఇది దేనికి సంకేతం. ఇలాంటి కలలు అసలు ఎందుకు వస్తాయ్. ఇలాంటి కలలు వస్తే భయపడాల్సిన అవసరం లేదు. హిందూ శాస్త్రంలో ఇలాంటి కలల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కలలపై ప్రత్యేకంగా ఒక శాస్త్రమే వుంది. అదే స్పప్ప శాస్త్రం. మరి మరణించిన వారు కలలో కనబడితే ఏమవుతుందో తెలుసుకుందాం.

ఎవరైనా నిజజీవితంలో చనిపోయి మనకు కలలో కనబడితే వారు వేరే చోట మంచి జన్మ పొందారని అర్ధం. దీన్ని అర్థం చేసుకొని మనము నిశ్చించగా వుండాలని స్వప్న శాస్త్రం మనకు చెబుతోంది.

what-is-the-sign-and-what-happens-if-dead-person-comes-in-dream

ఒక వ్యక్తి ఏదైనా కారణం చేత చనిపోయి తరువాత మీ కలలో కనబడితే, ఆ మరణించిన వ్యక్తి మీతో ఏదో చెప్పలనుకుంటున్నాడని అర్థం. మరణించిన వ్యక్తికి ఏదో తీరని కోరిక వుంటుంది. ఆ కోరికను మీరు అర్ధం చేసుకొని తీర్చే ప్రయత్నం చేయాలి. వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని ఆ కోరికను నెరవేర్చాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆత్మ శాంతించి మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. లేదంటే మీరు కష్టాలపాలవుతారు.

జీవించివున్న వారు మన కలలో కనబడితే మనము ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. స్వప్న శాస్త్రం ప్రకారం ఆ జీవించిన వ్యక్తి ఆయుష్షు మరింత పెరిగినట్లని మనము అర్థం చేసుకోవాలి. మరొక సందర్భంలో మరణించిన వ్యక్తి మన కలలోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా వుంటే ఆ వ్యక్తి మనము ఏదో పని చేయబోతుంటే అది మంచిది కాదని చెప్పడానికి సంకేతంగా భావించాలి. మనం చేయబోయే ఆ పనిని ఆపివేయాలని స్వప్న శాస్త్రం మనకు చెబుతోంది.

మరణించిన వ్యక్తి మనకు కలలో కనబడి చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తే మనం చేయబోయే పని అతనికి నచ్చదని అర్థం దీనిని మనం అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా చేయాలి. మరణించిన వ్యక్తులు తమకు ఆకలిగా వున్నట్టు, బట్టలు లేనట్టు, చొప్పులు లేనట్టు కనబడతారు. అలా కనబడితే వారికి లేని వస్తువులు ఏంటో తెలుసుకొని వాటిని దగ్గరలో వున్నవారికి మనస్పూర్తిగా దానం చేయాలి. అలా చేస్తే మనకు సుఖసంతోషాలు కలుగుతాయ్.

మరణించి వ్యక్తి ఇంకా ఇంట్లోనే వున్నారని, ఇంట్లోనే తిరుగుతున్నారని మీకు కల వస్తే వారి ఆత్మ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడ్డం లేదని అర్థం. అలాంటి సందర్భంలో మరణించిన వారిపేరుపై పిండప్రదానం చేయాలి. అమావాస్య రోజు ఆవుకు రొట్టె తినిపించాలి.

కలలో శవ యాత్రం కనిపిస్తే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. అలా కనిపిస్తే మీకు త్వరలో శుభం కలగబోతోందని, శుభవార్త వింటారని అర్థం చేసుకోవాలి. మరణించిన వ్యక్తి మన కలలోకి వచ్చి నవ్వుతూ వుంటే అది శుభానికి సంకేతం, ఒక వేల ఏడుస్తూ కనిపించినా మంచే జరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కాబట్టి మరణించిన వ్యక్తి కలలో కనిపిస్తే భయపడవద్దు.

Story first published: Thursday, June 6, 2024, 9:36 [IST]
Desktop Bottom Promotion