For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో వాస్తు పిరమిడ్ ఎక్కడ పెట్టాలి? ఈ చోట్ల పెడితేనే లాభం, శ్రేయస్సు

అసలు వాస్తు పిరమిడ్ అంటే ఏంటి, ఇంట్లో ఏ దిక్కులో వాస్తు పిరమిడ్ ఉంచాలి, ఏ చోట ఉంచితే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వాస్తు.. విశ్వం యొక్క శక్తిని సైన్స్ జ్ఞానంతో అనుసంధానించే ఏకీకృత శాస్త్రంగా పరిగణించబడుతోంది. మన చుట్టూ సానుకూల శక్తులు, ప్రతికూల శక్తులు ఉంటాయి. సానుకూల శక్తులు మనకు మంచి చేస్తే, ప్రతికూల శక్తులు కష్టాలను, సమస్యలను తెచ్చిపెడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో, పని చేసే చోట ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోవాలంటే వాస్తు శాస్త్రంలోని నివారణలు పాటించాలి. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించడానికి కొన్ని నియమాలు, జాగ్రత్తలకు రూపొందించబడ్డాయి. అలాంటి వాటిలో వాస్తు పిరమిడ్ ఒకటి.

Where to keep vastu pyramid at home in Telugu

ఇంట్లో సరైన దిశలో వాస్తు పిరమిడ్ ఉంచితే అది ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అసలు వాస్తు పిరమిడ్ అంటే ఏంటి, ఇంట్లో ఏ దిక్కులో వాస్తు పిరమిడ్ ఉంచాలి, ఏ చోట ఉంచితే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు పిరమిడ్ అంటే ఏంటి?

వాస్తు పిరమిడ్ అంటే ఏంటి?

పరిసరాల నుండి ప్రతికూలతను తొలగించడానికి ఇల్లు, వ్యాపారం ప్రాంతం, కార్యాలయంలో వాస్తు ప్రకారం ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఇల్లు ప్రధానం కాబట్టి ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడం చాలా ముఖ్యం. ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి వాస్తు పిరమిడ్‌ను శక్తివంతమైన యంత్రంగా పరిగణిస్తారు.

వాస్తు ప్రకారం ఇంట్లో వాస్తు పిరమిడ్ ఉంటే సానుకూల శక్తిని పెంచడంలో, ప్రతికూల శక్తిని తటస్థీకరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని నమ్ముతారు. ఇది అన్ని శక్తుల మధ్య సామరస్యాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని విశ్వాసం.

ఇంట్లో వాస్తు పిరమిడ్ ఎక్కడ ఉంచాలి?

ఇంట్లో వాస్తు పిరమిడ్ ఎక్కడ ఉంచాలి?

వాస్తు పిరమిడ్ ప్రతికూల శక్తులను తొలగించడంతో పాటు వాస్తు దోషాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. వాస్తు పిరమిడ్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంటి సభ్యులు ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతారో ఆ ప్రదేశంలో వాస్తు పిరమిడ్ ఉంచాలని శాస్త్రం చెబుతోంది. దాని వల్ల పిరమిడ్ నుండి సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతారు.

వాస్తు పిరమిడ్‌ను ఏ దిశలో ఉంచాలి?

వాస్తు పిరమిడ్‌ను ఏ దిశలో ఉంచాలి?

వాస్తు పిరమిడ్ ఈశాన్య మూలలో ఉంచడం శ్రేయస్కరం. ఈశాన్యం శక్తికి కేంద్రంగా భావిస్తారు. అందుకే ఈశాన్య మూలలో వాస్తు పిరమిడ్ ఉంచితే ఇంటిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పూజా గదిలో ఈశాన్య మూలలో ఉంచినా మంచి ప్రయోజనం కలుగుతుంది.

మంచి నిద్ర కోసం వాస్తు పిరమిడ్ ఎక్కడ ఉంచాలి?

మంచి నిద్ర కోసం వాస్తు పిరమిడ్ ఎక్కడ ఉంచాలి?

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మంచి నిద్ర కోసం వాస్తు పిరమిడ్‌ను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. ఈ దిశలో ఉంచిన వాస్తు పిరమిడ్ మంచి నిద్రతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. కుటుంబసభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారి మంచం వద్ద వాస్తు పిరమిడ్ ఉంచితే మంచి ఫలితం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చదువు, వృత్తి కోసం వాస్తు పిరమిడ్ ఎక్కడ ఉంచాలి?

చదువు, వృత్తి కోసం వాస్తు పిరమిడ్ ఎక్కడ ఉంచాలి?

ఇంట్లో విద్యార్థులు ఉంటే వారికి చదువుపై శ్రద్ధ ఉండాలంటే వాస్తు పిరమిడ్ సరైన దిశలో ఉంచాలి. దాని వల్ల చదువుపై ఆసక్తి రావడంతో పాటు కెరీర్‌కు సరైన దిశానిర్దేశం అందుతుంది. పిల్లలు చదువుకునే రూములో, స్టడీ రూమ్ ఉంటే అక్కడ వాస్తు పిరమిడ్‌ను ఉత్తరం దిశలో ఉంచాలి. వాస్తు పిరమిడ్ పిల్లలు చదువుపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

అలాగే వ్యాపారం సజావుగా సాగాలంటే వ్యాపారం చేసే చోట వాస్తు పిరమిడ్ నైరుతి మూలలో ఉంచాలి. దీని వల్ల వ్యాపారం లాభల బాటలో సాగుతుంది.

వాస్తు పిరమిడ్ ఏ దిక్కున పెట్టకూడదు:

వాస్తు పిరమిడ్ ఏ దిక్కున పెట్టకూడదు:

వాస్తు పిరమిడ్‌ను దక్షిణ దిశలో ఎప్పుడూ పెట్టకూడదు. అలాగే చీకటిగా ఉండే ప్రదేశాల్లో కూడా వాస్తు పిరమిడ్ ఉంచకూడదు. వంటగదిలో కూడా వాస్తు పిరమిడ్ ఉంచవద్దని శాస్త్రం చెబుతోంది. బాత్రూము సమీపంలో కూడా వాస్తు పిరమిడ్ ఉంచకూడదు.

వాస్తు పిరమిడ్‌ను ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని వాస్తు పిరమిడ్‌ను ఉంచినట్లైతే అది ఇంటికి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది.

English summary

Where to keep vastu pyramid at home in Telugu

read this to know Where to keep vastu pyramid at home in Telugu
Story first published:Saturday, January 14, 2023, 16:11 [IST]
Desktop Bottom Promotion