Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.!
Akhanda 2 రిలీజ్ వాయిదా... వేణుస్వామిని ఏకీపారేస్తోన్న బాలయ్య ఫ్యాన్స్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం అనూహ్యంగా వాయిదాపడటంతో టాలీవుడ్ వర్గాలు, బాలయ్య అభిమానులు షాక్ అయ్యాయి. కనీసం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పకుండా సినిమాను నిరవధికంగా వాయిదా వేయడంతో గందరగోళం నెలకొంది. సినిమా విడుదల ఎందుకు ఆగిపోయిందన్నది తెలియక అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని బాలయ్య అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అఖండ 2 విడుదల ఆగిపోవడానికి, వేణుస్వామికి ఉన్న లింక్ ఏంటీ? బాలయ్య అభిమానులు ఆయనను ఎందుకు టార్గెట్ చేశారు? ఈ వివరాల్లోకి వెళితే...
Dhurandhar Movie Twitter Review: దురంధర్ ట్విట్టర్ రివ్యూ
తొలుత యూట్యూబ్‌లో, పలు టీవీ ఛానెల్స్‌లో జాతకాలు, పంచాంగం, రాశిఫలాలు చెప్పుకుంటూ సాగిపోతున్న దశలో నాగచైతన్య - సమంత సహా కొందరు సెలబ్రెటీల విషయంలో వేణుస్వామి జ్యోస్యం ఫలించడంతో ఆయన రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యారు. తమ జాతకాలు పట్టుకుని పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లడం, ఏదో పూజలు చేయించడంతో కొందరికి బాగా కలిసి రావడంతో హై ప్రొఫైల్ సర్కిల్స్‌లో వేణుస్వామికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. జాతకాలు చెప్పమని, కామాఖ్యలో ప్రత్యేక పూజలు చేయించాలంటూ ఎగబడ్డారు.

అయితే టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గత కొద్దినెలలుగా వేణుస్వామి ఏది పట్టుకుంటే అది ఎదురు కొడుతోంది. ఆయన చెప్పిన జ్యోస్యానికి పూర్తి విరుద్ధంగా రిజల్ట్స్ కనిపిస్తుండటంతో జనం ట్రోలింగ్ చేస్తున్నారు. తొలుత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జాతకం అస్సలు బాలేదని.. బాహుబలి తర్వాత చేసే సినిమాలు ఫట్ అవుతాయని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపటడంతో సినీ జనాలు, ప్రేక్షకులు నిజమేనని నమ్మారు. కానీ ఎప్పుడైతే సలార్, కల్కిలు వసూళ్ల వర్షం కురిపించాయో అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల్లో వేణుస్వామి బుక్కయ్యారు.
Akhanda 2: బాలయ్య విధ్యంసం ఆపలేరు.. అఖండ 2 వాయిదాపై అభిమానుల ఆగ్రహం ..
ఇవే కాదు.. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ విషయంలోనూ వేణుస్వామి చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో అప్పట్లో ఆయనపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇక గతేడాది అక్కినేని నాగచైతన్య - శోభితాల వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జర్నలిస్టులు మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమీషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ వివాదంతో తాను ఇకపై రాజకీయ, వ్యక్తిగత జాతకాల జోలికి వెళ్లనని వేణుస్వామి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే సమంత - రాజ్ నిడిమోరుల పెళ్లిపైనా వేణుస్వామి స్పందించలేదు.
రెండ్రోజుల క్రితం ఓ హోమం చేస్తూ వీడియో పెట్టిన వేణుస్వామి కీలక విషయాలు వెల్లడించారు. సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి, వారి వైవాహిక జీవితంపై తాను మాట్లాడనని స్పష్టం చేశారు. అయితే తాను మూడు రోజుల నుంచి బగళాముఖీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించానని చెప్పారు. త్వరలో రిలీజ్ కానున్న ఓ పెద్ద సినిమా విజయం సాధించాలని బగళాముఖీ అమ్మవారికి హోమం నిర్వహించానని వేణుస్వామి వెల్లడించారు. అయితే ఆ పెద్ద సినిమా అఖండ 2నే అని అందరూ నమ్మారు. ఎందుకంటే ఈ వారంలో తెలుగుకు సంబంధించి అఖండ 2నే పెద్ద సినిమా కావడంతో.. బాలయ్య కోసమే ఆయన ఈ పూజలు నిర్వహించారని అందరూ భావించారు.
ఆస్తి కోసం సీరియల్ నటికి చిత్రహింసలు... మ్యాగీ ఫోర్క్‌ని కాల్చి
కట్ చేస్తే అఖండ 2 సినిమా హిట్ అవ్వడం సంగతి పక్కనపెడితే.. కనీసం విడుదల కూడా కాలేదు. తొలుత డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ క్యాన్సిల్ కాగా.. ఓవర్సీస్‌లో యథాతథంగా బొమ్మ పడుతుందని భావించారు. ఆ కాసేపటికే ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్స్ వాయిదాపడ్డాయి. దాంతో డిసెంబర్ 5వ తేదీన సినిమా విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ గంటల వ్యవధిలోనే సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తూ 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. దీంతో వేణుస్వామిపై బాలకృష్ణ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. బాలయ్య కెరీర్‌లో ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో మీ పూజలు ఫలించలేదంటూ విరుచుకుపడుతున్నారు. మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications
