Latest Updates
-
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.!
ప్రకాశం జిల్లాలో విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి (89) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత స్థానికంగా చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
శుక్రవారం అంత్యక్రియలు..
పిడతల రామభూపాల్ రెడ్డి అంత్యక్రియలను అతని స్వస్థలం గిద్దలూరులో శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.

రాజకీయ ప్రస్థానం..
పిడతల రామభూపాల్ రెడ్డి గిద్దలూరు రాజకీయాల్లో విశేష ప్రాధాన్యత సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి, అసెంబ్లీలో తన విలక్షణమైన పని తీరు, ప్రజల సమస్యలపై గళం వినిపించడం ద్వారా మంచి పేరును సంపాదించారు. నిరాడంబర వ్యక్తిత్వం, ప్రజలతో నేరుగా కలసి సమస్యలు తెలుసుకునే స్వభావం ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఎన్నికల అనంతరం కొంతకాలం రాజకీయాల్లో చురుకుగా పని చేసిన ఆయన, తరువాత క్రమంగా ప్రజా జీవనానికి దూరమై కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టారు.
వైసీపీలోకి కుమారుడు..
రామభూపాల్ రెడ్డి రాజకీయ వారసత్వం ప్రస్తుతం ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి చేతుల్లో కొనసాగుతోంది. ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ, వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో ప్రభావాన్ని పెంచుకుంటూ, తండ్రి పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా పని చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మాజీ ఎమ్మెల్యే రామభూపాల్ రెడ్డి మరణ వార్తతో గిద్దలూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక వర్గాల నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభ్యున్నతికి పనిచేసిన నాయకుడిని కోల్పోయామని పలువురు విచారం వ్యక్తం చేశారు.
Credit: Oneindia



Click it and Unblock the Notifications
