For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గటం సహజమే!

By B N Sharma
|

Newborn Weight Loss Is Usual!
పుట్టిన బిడ్డలు కొద్దిరోజులకే బరువు తగ్గటం సహజం. సగటున బేబీ మొదటి 5 రోజుల్లో 5 నుండి 6 శాతం బరువు కోల్పోతుంది. మొదటి మూడు రోజుల్లో అది 7 శాతం కంటే మించితే, తల్లిపాలు సరిపడా అందుతున్నాయో లేదో పరిశీలిచండి. తల్లిపాలు బిడ్డకు సరిగా అందించాలి. అనుభవం కలవారితో పాలనిచ్చే తల్లికి శిక్షణ నిప్పించాలి. బేబీ ఆరోగ్యంగా వుండి మల విసర్జన సరిగా వుంటే మరో రెండు రోజుల తర్వాత బరువు చూడండి.

పిల్లలు పుట్టేటపుడు కొంచెం అధిక బరువుతో పుడతారు. తల్లి ఇచ్చే పాలు మొదటి కొద్ది రోజుల్లో బరువు కోల్పోయేలా చేస్తాయి. బిడ్డ కనుక పుట్టినప్పటినుండి బరువు 14 శాతం వరకు బాగా తగ్గిపోతే తల్లిపాలతో పాటుగా ఇతర రకాల పాలు కూడా ఇవ్వవలసి వస్తుంది. బిడ్డలు సాధారణంగా రెండు లేదా మూడవ వారం నుండి సుమారు 6 నెలల వరకు మరల బరువు పెరుగుతారు.

బిడ్డ బరువు కోల్పోతోందని లేదా పెరుగుతోందని తల్లిపాలను ఎట్టి పరిస్ధితులలో ఆపవద్దు. పుట్టిన బిడ్డ సగటున 5 నుండి 6 శాతం మొదటి వారంలో బరువు కోల్పోవటం, రెండవ వారం లేదా మూడవ వారంనుండి బరువు పెరగటం సహజమే. తల్లిపాల పోషణకై అవసరమైతే నిపుణులను సంప్రదించండి.

English summary

Newborn Weight Loss Is Usual! | బరువు తగ్గటం సహజమే!

Newborn's weight loss should not stop the mother from breastfeeding. An average newborn weight loss of 5-6 % in the 1st week is natural. Consult lactation experts and follow guidelines while breastfeeding.
Story first published:Monday, October 24, 2011, 10:28 [IST]
Desktop Bottom Promotion