For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాధి లక్షణాలు తల్లి గుర్తించాలి!

By B N Sharma
|

Mother
బిడ్డ తన సమస్యను తెలియచేయలేదు. తల్లే బిడ్డకు సంబంధించిన ప్రతి సమస్యను అర్ధం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. సాధారణంగా ఒక్కొక్కపుడు బిడ్డకు ఎప్పుడు అనారోగ్యం మొదలైందో తల్లితండ్రులు సరిగ్గా చెప్పలేకపోతారు. బిడ్డ తన సమస్యను మీకు వివరించలేదు కాబట్టి మనమే రోగ లక్షణాలను తెలుసుకుని ఆ దృష్టితో బిడ్డను జాగ్రత్తగా గమనించాలి.

ఇలా మనం సంపాదించుకున్న సమాచారంతో బిడ్డ ఆరోగ్యంలో ఏ కాస్త మార్పు కనిపించినా వెంటనే వైద్యులను లేదా ఇంటిలో అనుభవంకలవారిని సంప్రదించాలి. వేరేవారి సలహా తీసుకోడానిక ఏ మాత్రం సంకోచించరాదు.

జలుబువంటిది వచ్చినపుడు గొంతులో మార్పు వస్తుంది. ముక్కు కారుతుంది. ఇటువంటి లక్షణాలతో మనం వ్యాధిని గుర్తించాలి. ఇది ఒక ప్రత్యేకమైన వైరస్. దీనిపై యాంటీ బయోటిక్ మందులు ప్రభావాన్ని చూపలేవు. కాబట్టి శరీరం రోగ నిరోధక సామర్ధ్యన్ని పెంచుకుని తనంతట తానుగా వైరస్ తో పోరాడే శక్తిని సంపాదించే వరకు ఈ మందులు ఆ వైరస్ ను ఏమీ చేయలేవు. అటువంటపుడు మీరు వైద్యులను సంప్రదించి మూసుకు పోయిన ముక్కును తెరుచుకునేటందుకు తగిన మార్గాలను తెలుసుకోవాలి.

English summary

Taking care of Infant's Health! | వ్యాధి లక్షణాలు తల్లి గుర్తించాలి!

Generally, if there is any ill health an infant cannot express it. In such a case mother should observe the symptoms of ill health and check with a Doctor or an experienced person in the house and treat the child with remedies.
Story first published:Thursday, November 10, 2011, 17:36 [IST]
Desktop Bottom Promotion