Latest Updates
-
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.! -
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం! -
ఫిల్టర్స్, మేకప్‌తో పనే లేదు.. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం యోగా సూత్రాలు.! -
కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా..పూరీ,ఇడ్లీ,చపాతీ,పలావ్ లోకి కేక! -
జూన్ 17-23 వార ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం.. మీ రాశి ఉందా? -
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి?
పిల్లలకు గోరుముద్దలు ఎలా తినిపించాలి....?

అయితే ఈ ఉరుకులపరుగుల జీవన విధానంలో మన సమాజంలో దారుణమైన పరిస్థితి ఏర్పడింది. తెలిసో, తెలియకో, ఓపిక లేకనో చాలామంది కంట్రోల్ ఫీడింగ్ చేస్తున్నారు. కంట్రోల్ ఫీడింగ్ అంటే బిడ్డను కాళ్లమీ కూచోబెట్టుకునో, పండబెట్టుకునో నోట్లో కుక్కుతుంటారు. పైగా బిడ్డ ఆ ఆహారాన్ని ముట్టుకోకుండా చేతులు కట్టేస్తారు.
ఇవ్వనీ ఒక ఎత్తైతే తినిపించే విధానంలో కూడా స్పూన్ తో లేదో చేస్తో నోట్లో కుక్కతారు. అటువంటి సమయంలో పిల్లలు ఇటూ అటూ కదులుతూ ముఖం కదిలిస్తూ మూతి తిప్పేస్తుంటారు. అలా చేసేటప్పుడు పిల్లలను కొట్టేవాళ్ళు లేకపోలేదు. ఇలా చేయడం వల్ల పిల్ల మెరాయించి తినడమే మానేస్తారు. లేదా తిన్నదాన్ని కక్కేస్తారు. దాంతో ఇక చాలని తామే నిర్ధారణ చేసుకొని మానేస్తుంటారు పెద్దలు.
దాంతో పిల్లలకు తిండిపట్ల తిరస్కార భావం ఏర్పడుతుంది. తినిపించడానికి ఏదోకటి తెస్తున్నారని తెలియగానే పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. తిండిపై ఇలాంటి వ్యతిరేక తిరస్కార భావన పిల్లలకు కలుగనీయకూడదు. ఎవరైనాకానీ సంతోషంగా తినాలి. అలాగని వాళ్లే తింటారులే అనుకోకూడదు. పిల్లలు తినాలనే భావన కలిగినప్పుడు పిల్లల చేతులు ముందుగా కడగాలి. తినిపించే వాళ్ళ చేతులూ కడుక్కోవాలి.
పిల్లలకు ఆహారం తినిపించేవారి ఎత్తులో కూచోబెట్టుకోవాలి. పిల్లలతో మాట్లాడుతూ ఇది బాగుంటుంది..తియ్యగుంటుంది..లాంటి తియ్యని కబుర్లు చెబుతూ తినిపించాలి. తినిపించే సమయంలో చేత్తోకానీ, స్పూన్ కానీ తక్కువ క్వాటింటీ తీసుకోవాలి. బలవంతంగా నోట్లో కుక్కకూడదు. ముద్దను పిల్లలు పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానే లోనికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. పిల్లలు వాళ్ళకు పెట్టింది వాళ్ళు తిన్నారన్న స్వయంతప్తిని దక్కేట్టు చేయాలి.
పిల్లలు మారం చేయకుండా తినగలిగి పూర్తి చేసిన వెంటనే పిల్లలను బాగా తిన్నావు అని మొచ్చుకోవాలి. అలాంటప్పుడే రెండోసారి తినడానికి ముందుకొస్తారు. సాధరణంగా పెద్దలు బాధలో ఉన్నప్పుడు తక్కువ ఆహారం తీసుకుంటుంటారు. పిల్లలూ అంతే అని గుర్తించి సంతోషపెట్టి ఎక్కువ తినిపించాలి. అంతే కానీ ఏడిపిస్తు తక్కువ తినిపిస్తే పిల్లలకు సరైన పోషకాలు లభించవు...



Click it and Unblock the Notifications