For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిడ్డ పొట్టలో గ్యాస్ నివారణకు చిట్కాలు

By B N Sharma
|

How to cure gas in Babies?
పిల్లల పొట్టలో సాధారణంగా గ్యాస్ ఏర్పడుతూంటుంది. దీని కారణంగా వీరికి పొట్టలో నొప్పి కూడా కలుగుతుంది. ఏడుస్తూంటారు. అటువంటి సమయంలో వారికి ఊరట కలిగించటానికి గాను తల్లులు అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. కొందరు నిస్సహాయ స్ధితిలో వుండిపోతారు. అటువంటి పరిస్ధితులలో బేబీకి పొట్టలో గ్యాస్ తగ్గించేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పరిశీలించండి.

బేబీ ని అడ్డంగా చేతులలో లేదా ఊయలలో పడుకోబెట్టటానికి బదులు, నిలువుగా వుంచండి. ఈ చర్య బేబీలోని గ్యాస్ జీర్ణ వ్యవస్ధలో సర్దుబాటు చేసుకునే అవకాశం వుంటుంది. ఈ సమయంలో అధికంగా బిడ్డను ఎత్తుకొని ఆందోళన చెందకండి. పొట్టలో గ్యాస్ వుంటే పిల్లలకు మీ స్పర్శ కావాలి. బిడ్డ పొట్టను సున్నితంగా మర్దన చేయండి. ఇది చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

బిడ్డ చేతులను, కాళ్ళను కొద్దిపాటిగా కిందకు, పైకి ఆడించండి. గ్యాస్ బయటకు వచ్చేందుకు ఈ చర్య సహకరిస్తుంది. నొప్పి ఎక్కువయ్యే కొద్ది బిడ్డలు, వారంత వారే కాళ్ళు, చేతులు ఆడించటం చూస్తూనే వుంటాం. బిడ్డను పొట్టపై బోర్లా పడుకోపెట్టి వెన్ను భాగం మర్దన చేయండి. బేబీకి తాగగలిగితే హెర్బల్ టీ అతి కొద్దిగా పట్టండి. ఇది చాలా సురక్షితమేనని వైద్యులు కూడా చెపుతారు. హెర్బల్ టీ ఔషధంగా ఇచ్చినప్పటికి, బేబీ యొక్క పోషకావసరాలను అశ్రధ్ధ చేయకండి.

English summary

How to cure gas in Babies? | బిడ్డ పొట్టలో గ్యాస్ నివారణకు చిట్కాలు

If you have a baby, you tend to do everything to make them feel alright. However, some situation will really get into particularly if they experienced colic or most commonly known as gas. If your little one has stomach pain due to gas you have most likely been on a search on how to cure gas in babies.
Story first published:Wednesday, February 1, 2012, 12:13 [IST]
Desktop Bottom Promotion