For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?

By Nutheti
|

తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది. వర్ణించలేని ఆనందం. పొట్టలో పెరుగుతున్న బిడ్డ ఎప్పుడెప్పుడు కళ్లముందుకు వస్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. తొమ్మిదినెలల కాలంలో పొట్టలో వచ్చే మార్పులు, గర్భస్త శిశువు కదలికలు కాబోయే తల్లికి తీపి జ్ఞాపకాలు. ఎప్పుడెప్పుడు తన బిడ్డ భూమ్మీద పడతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది.

READ MORE: మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

అయితే పొట్టలో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అన్న క్యూరియాసిటి ప్రతి తల్లిలోనూ ఉంటుంది. చట్టప్రకారం కడుపులో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అని తెలపడం నేరం. అందుకే ఏ హాస్పిటల్స్ లోనూ ఈ విషయం చెప్పరు. అయితే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ లేకుండా.. బేబీ గర్ల్స్ పుడుతుందో.. బేబీ బాయ్ పుడుతున్నాడో తెలుసుకోవడానికి ఇక్కడ ఈజీ టిప్స్ ఉన్నాయి. మీ క్యూరియాసిటీకి బ్రేక్ వేసే ఈ మెథడ్స్ పై ఓ లుక్కేయండి

ఆల్ర్టాసౌండ్ స్కానింగ్

ఆల్ర్టాసౌండ్ స్కానింగ్

ఆల్ర్టా సౌండ్ స్కానింగ్ ద్వారా కడుపులో పెరుగుతున్నది బేబీ గర్ల్ లేదా బేబీ బాయ్ అన్నది తెలుసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. అదే జెనెటిక్ టెస్ట్ ద్వారా అయితే బేబీ జెండర్ కరెక్ట్ గా తెలిసిపోతుంది.

బేబీ హార్ట్ రేట్

బేబీ హార్ట్ రేట్

అండాశయంలో ఉన్న శిశువు అమ్మాయి అయితే హార్ట్ రేట్ ఒకలా.. అబ్బాయి అయితే ఒకలా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డా ? ఆడబిడ్డా ? అని ఈజీగా కనిపెట్టేయవచ్చు. గర్భంలో బిడ్డకి నిమిషానికి 140 కంటే తక్కువ బీట్స్ ఉంటే బేబీ బాయ్ అని, అంతకంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ గా తేలింది.

చైనీస్ జెండర్ చార్ట్

చైనీస్ జెండర్ చార్ట్

దీన్ని సరిగ్గా క్యాల్కులేట్ చేసుకుంటే.. 90 శాతం కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. 700 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ చైనీస్ చార్ట్ గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ ని తెలుపుతుంది. కన్సీవ్ అయిన నెలను, తల్లి పుట్టిన సంవత్సరాన్ని బట్టి ఈ చైనీస్ చార్ట్ ద్వారా మగబిడ్డా ? ఆడబిడ్డా ? అనేది తెలుసుకోవచ్చు.

వెడ్డింగ్ రింగ్ టెస్ట్

వెడ్డింగ్ రింగ్ టెస్ట్

ఇది చాలా వింతగా అనిపిస్తుంది కదూ. వెడ్డింగ్ రింగ్ తీసి.. ఒక తాడుకు వేలాడదీయాలి. దీన్ని పొట్టపై వేలాడదీయాలి. ఈ రింగ్ పొట్టపై గుండ్రంగా తేలుతూ ఉంటే.. మగబిడ్డ అని, వెనక్కి, ముందుకూ కదులుతూ ఉంటే అమ్మాయి పుడుతుందని అర్థం.

ముక్కు

ముక్కు

ఇది ఆశ్చర్యంగా ఉందా ? నిజమే ముక్కుని బట్టి కూడా పుట్టబోయే బిడ్డ ఆడా ? మగా ? అని చెప్పవచ్చు. గర్భంతో ఉన్న మహిళ ముక్కు రూపం, సైజ్ లో మార్పులు కనిపించాయంటే మగబిడ్డ అని సూచిస్తుంది. నాసికా ద్వారాలు పెద్దవిగా, వెడల్పుగా తయారై ఉంటే అబ్బాయి పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలిక మార్పులే. బిడ్డ పుట్టిన తర్వాత అవి మామూలు స్థితికి వచ్చేస్తాయి.

చర్మం

చర్మం

మీరు గర్భిణీగా ఉన్నప్పుడు చర్మంపై యాక్నే, స్కిన్ పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతూ ఉంటే.. మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుపుతుంది. అయితే ఎలాంటి చర్మ సమస్యలు లేకపోతే.. అబ్బాయి పుడతాడని అర్థం.

కాళ్లు

కాళ్లు

పాదాల వాపులు ప్రెగ్నెన్సీ సమయంలో కామన్. అయితే గర్భం దాల్చిన మొదట్లో పాదాలపై వాపులు కనిపిస్తూ ఉంటే.. మీ పొట్టలో ఉన్నది అమ్మాయి. అదే ముందు నుంచి పాదాల వాపు సమస్య లేకుండా.. చివరి రోజుల్లో అంటే డెలివరీకి ముందు నుంచి పాదాల వాపులు కనిపిస్తూ ఉంటే.. మీ కడుపులో ఉన్నది అబ్బాయి అని తెలుస్తుంది.

చేతులు

చేతులు

గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ ని చేతుల చర్మం తెలుపుతుంది. తల్లి చేతుల చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంది అంటే.. తన కడుపులో ఆడపిల్ల ఉందని, అదే చర్మం పొడిబారిపోయి, పగుళ్లు కనిపిస్తూ ఉంటే అబ్బాయి పెరుగుతున్నట్లు అర్థం.

శరీరం

శరీరం

శరీరమంతా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిపేలా రూపంలో మార్పులు కనిపిస్తే.. ఆమె గర్భంలో ఉన్నది అమ్మాయి అని, అదే కొన్ని భాగాల్లో మాత్రమే గర్భవతిగా కనిపిస్తూ ఉంటే.. అబ్బాయి అని తెలుపుతుంది.

స్ర్టెచ్ మార్క్స్

స్ర్టెచ్ మార్క్స్

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్టపై స్ర్టెచ్ మార్క్స్ కామన్ గా కనిపిస్తాయి. అయితే వీటి ద్వారా కూడా గర్భంలో పెరుగుతున్నది మేల్ బేబీనా, ఫీమేల్ బేబీనా అని తెలుసుకోవచ్చు. ఎడమ చేతి వైపు పొట్టమీద ఎక్కువ స్ర్టెచ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటే కడుపులో ఉన్నది అబ్బాయి అని, అదే కుడివైపు ఎక్కువ స్ర్టెచ్ మార్క్స్ ఉంటే.. అమ్మాయి అని తెలుపుతుంది.

పొట్ట ఆకారం

పొట్ట ఆకారం

బేబీ ఆడా ? మగా ? అని పొట్ట ఆకారాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. పొట్ట పొడుచుకున్నట్లు ముందుకు సాగినట్టు ఉంటే.. గర్భంలో ఉన్నది అబ్బాయి అని, పొట్ట వెడల్పుగా ఉంటే గర్భంలో పెరుగుతున్నది అమ్మాయి అని తెలుపుతుంది.

పొట్ట

పొట్ట

గర్భధారణ సమయంలో పొట్ట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి పైభాగంలో పొట్ట కనిపిస్తుంది. మరికొందరికి కింది భాగంలో పొట్ట కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి కూడా గర్భంలోని బిడ్డ జెండర్ తెలుసుకోవచ్చు. పై పొట్ట ఉంటే అబ్బాయి అని, కిందివైపుగా పొట్ట ఉంటే.. అమ్మాయిని సూచిస్తుంది.

వాజినల్ డిస్చార్జ్

వాజినల్ డిస్చార్జ్

ప్రెగ్నెన్సీ సమయంలో కొంచెం కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే.. మీకు పుట్టబోయేది మగబిడ్డ. అదే చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో అప్పుడప్పుడు బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటే.. మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని అర్థం.

చూశారుగా.. ఇంకే ఈ ఈజీ టెస్ట్ ల ద్వారా మీకు పుట్టబోయేది.. అమ్మాయో ? అబ్బాయో ముందుగానే తెలుసుకుని ఎంజాయ్ చేయండి.

English summary

Easy tips that tell you the gender of your baby in telugu

When it comes to gender preditor, Im sure you’ve heard enough about the Chinese Gender Chart and the old wives’ tales.
Story first published: Monday, November 23, 2015, 13:27 [IST]
Desktop Bottom Promotion