For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా తల్లిదండ్రులైనవారు చేయకూడని తప్పిదాలు..

By Super
|

సహజంగా మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. ప్రారంభంలో అలా తప్పులు జరగడం, సహజం మనకు అనుభవం లేని వాటిని కొత్తగా నేచుకొన్నిప్పుడు కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. మీకు గుర్తుందా మీరు మొదటి సారి సైకిల్ నేర్చుకోవడం లేదా వంట చేయడం నేర్చుకొన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుంటారో .

మొదటి సారి కొత్తగా కొన్ని పనులు లేదా అనుభం లేని విషయాలు నేర్చుకోవాలనుకొన్నప్పుడు కొన్ని తప్పిదాలు జరగడం సహజం. ఎందుకంటే మొదటి సారి నేచుర్చుకనే వారెవరూ అన్నింటిలోనే ఫర్ఫెక్ట్ గా ఉండారు. ఏదైనా అనుభవపూర్వకంగానే తెలుస్తుంది .

అలాంటిదే కొత్తగా తల్లిదండ్రులైనవారికి పిల్లల విషయంలో ప్రతీది కొత్తగా అనిపిస్తుంది, ముఖ్యంగా మొదటి సారి బిడ్డ పుట్టినప్పుడు, బిడ్డను ఎత్తుకోవడం, పాలు పట్టడం, వారిని లాలించడం,ఏడవకుండా ఎలా మ్యానేజ్ చేయాలో కొంత మందికి అస్సలు తెలిసుండదు.

మొదటి బిడ్డ పుట్టిన తర్వాత, వారి అనుభపూర్వకుంగా ఫీడింగ్ హ్యాంబిట్స్ తెలుసుకుని ఉండాలి. చంటిపిల్లలకువచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ ప్రారంభంలో కొద్దిగా కష్టంగా అగుపించవచ్చు. తర్వాత అవే అర్ధం అవుతాయి.

అప్పుడే పుట్టిన పిల్లల పట్ల కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కలిగి ఉండాలి. అనుభవపూర్వకంగా ఎది కరెక్ట్, ఏది తప్పు అని వారికి చేసే పనుల్లో ముందుగా అంచనా వేసుకొని, లేదా తెలుసుకొని తర్వాత ప్రయత్నించాలి. చిన్న పిల్లల విషయంలో మీరు తప్పులు చేయకుండా తీసుకోవల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ..

తప్పిదం 1#:

తప్పిదం 1#:

బేబీ విషయంలో ప్రతి విషయానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు . ఎలా ఉంటే బిడ్డ సంతోషంగా ఉంటుందో తెలుసుకోవాలి. . బేబీ తరచూ జలుబు, దగ్గు వంటి ఫ్లూకి గురి అవుతుంటారు. ఒక్కోక్క రోజులో పాలు సరిగా తాగకుండా ఉంటారు. అలాంటి సమయంలో వారి గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తప్పిదం 2#:

తప్పిదం 2#:

బేబీ బిగ్గరగా ఏడవడం అంత మంచిది కాదు, తరచూ ఏడుస్తున్నప్పుడు వారి ఏడుపు మాన్పించడం వల్ల , భవిష్యత్తులో సకలాజికల్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

తప్పిదం 3#:

తప్పిదం 3#:

బేబీ ఫీడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాలు పట్టడం, లిక్విడ్ ఫుడ్, మరియు నాపింగ్ ప్యాట్రన్స్ ను గమనిస్తుండాలి. హెల్త్ స్టాటిస్టిక్స్ ను ఫాలో అవ్వడం వల్ల కొంత ఆందోళనకు గురి అవుతారు. ఎందుకంటే ఒక్కో బేబీలో ఒక్కో విధంగా జీవక్రియలు పనిచేస్తాయి. కొంత మందిలో త్వరగా జర్ణించుకొనే శక్తి ఉంటే మరికొందరి ఆలస్యంగా జీర్ణించుకొనే శక్తి ఉంటుంది. ఈ విషయం గుర్గుపెట్టుకోవాలి.

తప్పిదం 4#:

తప్పిదం 4#:

అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం, వారి బాటిల్ ఫీడింగ్ అవసరం లేదు, ముఖ్యంగా వారి దంతాలు రావడం ప్రారంభమైనప్పుడు, ఫీడింగ్ బాటిల్ వల్ల దంతాలు వంకర్లు పోవడం , దంతాల క్యావిటి తగ్గడం జరుగుతుంది.

తప్పిదం 5#:

తప్పిదం 5#:

కొత్తగా తల్లైన వారు, ఆ సమయంలో కుటుంబ సభ్యులను లేదా పార్ట్నర్ కు దూరంగా ఉండటం మంచిది కాదు, అప్పుడే పుట్టిన బిడ్డతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. అలాగే మీ బిడ్డతో పాటు, కుటుంబంలో ఇతర సంబంధబాంధవ్యాలు కూడా ముఖ్యమనే గ్రహించాలి.

తప్పిదం 6#:

తప్పిదం 6#:

చిన్న పిల్లల ముందు గట్టిగా అరవడం లేదా గొడవలు పడటం పూర్తిగా మానుకోవాలి. మీరు మాట్లుడుకొనే విషయంలో పిల్లలకు అర్ధం కావని మీరు అనుకుంటారు. కానీ ఇలాంటి అలవాట్ల వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతాయని సూచిస్తున్నారు .

తప్పిదం 7#:

తప్పిదం 7#:

బేబి విషయంలో ప్రతి ఒక్కరు చెప్పిన సలహాలను పాటించాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల విషయంలో అంత అనుభవం లేకపోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల బిడ్డకు మరో రకంగా ప్రభావం చూపవచ్చు . మీ బేబీ గురించి కొన్ని విషయాలను స్వయంగా తెలుసుకుని వారి కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

English summary

7 Mistakes That New Parents Must Never Make

New parents are often bombarded with advices and suggestions from people all around and they get confused about what is right and what is not, for the well-being of their baby. In this process of learning, new parents tend to make certain mistakes with their newborns. Here is a list of mistakes that new parents should avoid making, have a look.