For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినూనె పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది ?

కొబ్బరినూనెనే ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగించాలని మన పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. మరి కొబ్బరినూనె పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో చూద్దాం..

By Swathi
|

అన్ని వయసుల వాళ్లకు కొబ్బరినూనె చాలా అద్భుతమైన ఔషధం. కొబ్బరినూనెను బాగా ముదిరిపోయిన కొబ్బరి నుంచి తీస్తారు. కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కొబ్బరినూనెతో చేసిన ఆహారాలు తీసుకుంటారు.

Why Is Coconut Oil Good For Babies?

చాలా దేశాల్లో కొబ్బరినూనెను సంప్రదాయ పద్ధతుల్లో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరినూనె పిల్లల ఆరోగ్యానికి చాలామంచిది. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా కొబ్బరినూనె చాలా ప్రయోజనకరం. కొబ్బరినూనెను పిల్లలకు ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల వాళ్లు చాలా వేగంగా, బలంగా పెరుగుతారు.

కొబ్బరినూనెనే ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగించాలని మన పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. మరి కొబ్బరినూనె పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో చూద్దాం..

ల్యూరిక్ యాసిడ్

ల్యూరిక్ యాసిడ్

కొబ్బరినూనెలో తల్లిపాలలో మాదిరిగా ల్యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబోయే తల్లులు కొబ్బరినూనె తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్ గా కొబ్బరినూనె తీసుకోవడం వల్ల పిల్లలకు కావాల్సిన పాలు తల్లిలో ఉత్పత్తి అవడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియకు

జీర్ణక్రియకు

కొబ్బరినూనెలో ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. కాబట్టి పిల్లల ఆహారంలో కాస్త కొబ్బరినూనె చేర్చడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ప్రతిరోజూ కొబ్బరినూనెను కొద్దిగా ఆహారంలో చేర్చితే.. బేబీ బాడీ పోషకాలను గ్రహించే శక్తిని మెరుగుపరుస్తుంది.

పిల్లల నిద్రకు

పిల్లల నిద్రకు

మీ బేబీని ప్రతిరోజూ కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల వేగంగా పెరగడమే కాకుండా, మానసికంగా, శారీరకంగా డెవలప్ అవుతారు. అలాగే రాత్రిళ్లు చాలా హాయిగా నిద్రపోతారు. కాబట్టి.. కొబ్బరినూనెతో బేబీని మసాజ్ చేయాలి.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

అప్పుడే పుట్టిన పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు స్కిన్ ర్యాషెస్ తో బాధపడుతుంటారు. కాబట్టి కొబ్బరినూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్ అందుతుంది. అలర్జీలు రాకుండా ఉంటాయి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

కొబ్బరినూనెలో తల్లిపాలలో మాదిరిగానే ల్యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబయోల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది అప్పుడే పుట్టిన పిల్లలకు రక్షణగా ఉంటుంది. ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది.

English summary

Why Is Coconut Oil Good For Babies?

Why Is Coconut Oil Good For Babies.Coconut oil is great for both adults and babies. It improves a baby's immunity and digestive capacity, besides helping to grow fast.
Desktop Bottom Promotion