For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలుత్రాగే శిశువులలో ఎసిడిటి కలిగించే 15 ఆహారపదార్థాలు

శిశువులలో యాసిడ్ రిఫ్లక్స్ అనేది సర్వ సాధారణం. సాధారణ స్ప్లిట్ అప్స్ తో పాటు యాసిడ్ రిఫ్లక్స్ అనేది శిశువుల్లో తరచూ గమనించవచ్చు. అభివృద్ధి దశలోనున్న పసిపిల్లల జీర్ణవ్యవస్థ ఇప్పుడిప్పుడే ఆహారానికి అలవా

|

శిశువులలో యాసిడ్ రిఫ్లక్స్ అనేది సర్వ సాధారణం. సాధారణ స్ప్లిట్ అప్స్ తో పాటు యాసిడ్ రిఫ్లక్స్ అనేది శిశువుల్లో తరచూ గమనించవచ్చు. అభివృద్ధి దశలోనున్న పసిపిల్లల జీర్ణవ్యవస్థ ఇప్పుడిప్పుడే ఆహారానికి అలవాటు పడే దశలో ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అందుకే, డాక్టర్లు అప్పుడే పుట్టిన శిశువుకు కేవలం తల్లిపాలను మాత్రమే సిఫార్సు చేస్తారు.

పసిపిల్లలు ఆరుమాసాల వయసుకు చేరుకునే వరకు వారికి కేవలం తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. అయితే, ఆరుమాసాలు దాటాక ఇతర పౌష్టిక ఘాన ఆహారాన్ని పరిచయం చేస్తూ రెండేళ్ల వరకు తల్లిపాలని అందించడాన్ని కొనసాగించవచ్చు.

foods that cause acidity in breastfed babies,

ఒక వేళ మీ శిశువు పూర్తిగా కేవలం తల్లిపాలపై మాత్రమే ఆధారపడినట్లైతే, తల్లిపాలు మాత్రమే శిశువుకు పోషణని ఇచ్చే ఆహారం కాబట్టి పాలిచ్చే తల్లి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పాలిచ్చే తల్లి గనక తాను తీసుకునే ఆహారం ద్వారా ఏవైనా అనారోగ్యానికి గురయితే ఆ ప్రభావం ఆ పాలు త్రాగే శిశువుపై కూడా పడుతుంది.

అందువల్ల, ఎటువంటి దుష్ప్రభావాలు చూపించని ఆహారాన్నే పాలిచ్చే తల్లి ఎంచుకోవాలి. అందువల్ల, పాలిచ్చే తల్లులు ఏ ఆహారం తింటే మంచిదో, ఏయే ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదో తెలుసుకుని తగిన ఆహార నియమాలను పాటించాలి.

గ్యాస్ట్రోయెసోఫాగేల్ రిఫ్లక్స్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అనేక కారణములు వల్ల సంభవిస్తుంది. అయితే, పాలు త్రాగే పసిపిల్లలకు మాత్రం వారి తల్లి ఆహారపుటలవాట్ల వల్ల సంభవిస్తుంది.

పాలిచ్చే తల్లికి తాను తీసుకోవలసిన ఆహారపదార్థాలపై కనీస అవగాహన లేకపోవడం కూడా వారి శిశువులలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు ప్రధాన కారణం.

ఈ రోజు, పాలిచ్చే తల్లులు ఏ ఆహారం తీసుకుంటే వారి శిశువులలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కనిపిస్తుందో తెలుసుకుందాం. మీరు పాలిచ్చే తల్లి అయితే ఈ ఆర్టికల్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది.

మీ శిశువును యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి రక్షించాలనుకుంటే మీరు ఆహారానియమాలని చక్కగా పాటించాలి. ఈ ఆర్టికల్ ని చదివి యాసిడ్ రిఫ్లక్స్ ను కలిగించే ఆహారపదార్థాల గురించి తెలుసుకోండి.

పాలుత్రాగే పసిపిల్లలలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు:

వాంతి చేసుకోవడం:

వాంతి చేసుకోవడం:

యాసిడ్ రిఫ్లక్స్ బారిన పడిన శిశువు తరచూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది. సాధారణ స్ప్లిట్ అప్స్ కంటే వాంతులు కాస్త భిన్నంగానే ఉంటాయి. మీ శిశువులో గనక ఈ లక్షణం గమనించినట్టయితే మీరు వెంటనే జాగ్రత్తపడాలి.

దగ్గు:

దగ్గు:

శ్వాసలో గురక అలాగే విపరీతమైన దగ్గు కూడా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య యొక్క ఇతర లక్షణాలు.

ఆహారపు సమస్యలు:

ఆహారపు సమస్యలు:

యాసిడ్ రిఫ్లక్స్ తో గనక మీ శిశువు ఇబ్బంది పడుతున్నట్లైతే, మీ శిశువు ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడదు. మీ శిశువు కేవలం తల్లిపాల మీదే ఆధారపడినట్లైతే, పాలు త్రాగడానికి కూడా శిశువు నిరాకరిస్తుంది. మీ శిశువు గనక ఇలా చేస్తున్నట్లైతే యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో సతమతమవుతూ ఉండవచ్చు.

బాధ

బాధ

పసిపిల్లలు యాసిడ్ రిఫ్లక్స్ బారిన పడితే వారు చెప్పుకోలేని బాధకు లోనవుతారు. యాసిడ్ రిఫ్లక్స్ కి గురైన పిల్లల్లో హార్ట్ బర్న్, గ్యాస్ ట్రబుల్, పొత్తి కడుపునొప్పి, కోలిక్ వంటివి వారిని ఎక్కువగా బాధపెడతాయి. పసిపిల్లలు పాలు త్రాగేటప్పుడు లేదా పాలు త్రాగిన తరువాత వీటిని వారిలో గమనించవచ్చు.

ద్రవాలను వెలుపలికి పంపడం

ద్రవాలను వెలుపలికి పంపడం

యాసిడ్ రిఫ్లక్స్ బారిన పడిన పిల్లలలో ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. పసిపిల్లలు పలు తాగేటప్పుడు మీరు ఈపాటికే ఈ విషయాన్ని గ్రహించే ఉంటారు.

తల్లిపాలు త్రాగే పిల్లలకు యాసిడ్ రిఫ్లక్స్ ను కలిగించే ఆహారపదార్థాలు

శిశువులకు ఏయే ఆహారపదార్థాలు యాసిడ్ రిఫ్లక్స్ ని కలుగచేస్తాయి తప్పక తెలుసుకోవాలి. ఆయా ఆహార పదార్థాలను పాలిచ్చే తల్లులు అవాయిడ్ చేయడం మంచిది. తమకు ఎసిడిటీని కలిగించే ఏ ఆహారాన్నైనా దూరంగా ఉంచడం పాలిచ్చే తల్లులు తప్పక పాటించవలసిన సాధారణ నియమం. పాలిచ్చే తల్లులు ఏ ఆహారం తీసుకుంటే పసిపిల్లలు యాసిడ్ రిఫ్లక్స్ బారినపడతారో ఇక్కడ వివరించడం జరిగింది.

బ్రెస్ట్ ఫీడ్ బేబీస్ లో ఎసిడిటికి కారణమయ్యే ఆహారాలు

కెఫైన్:

కెఫైన్:

పాలిచ్చే తల్లులు కెఫైన్ ను పూర్తిగా అవాయిడ్ చేయడం శ్రేయస్కరం. శిశువుల జీర్ణవ్యవస్థ ఇంకా ఎదుగుదల దశలోనే ఉండటం వలన కెఫైన్ అనేది వారి జీర్ణవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. తద్వారా, శిశువులు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో సతమతమవుతారు. కెఫైన్ అనేది లోయర్ తక్కువ ఎసోఫాగియల్ స్పిన్స్టర్ కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఈ కండరాలే ఉదరంలో యాసిడ్స్ ని నిలిపి ఉంచుతాయి. వీటి పనితీరుకు కెఫైన్ ఆటంకం కలిగించడం వలన పిల్లలు యాసిడ్ రిఫ్లక్స్ బారిన పడతారు.

స్పైసీ ఆహార పదార్థాలు:

స్పైసీ ఆహార పదార్థాలు:

స్పైసీ ఆహార పదార్థాలు వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు గురవుతారు. ఆహారంలో నుండే మాసాలాలు స్టమక్ లైనింగ్ ను అలాగే ప్రేగులను ఇరిటేట్ చేసి అనారోగ్యానికి గురిచేస్తాయి. అందులో, శిశువుల యొక్క జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు వీరు త్వరగా గురవుతారు.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

నిమ్మకాయ, నారింజల వంటి సిట్రస్ పండ్లు కూడా జీర్ణవ్యవస్థ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. అందువల్ల, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే శిశువులు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు గురికావచ్చు.

కార్బోనేటేడ్ డ్రింక్స్:

కార్బోనేటేడ్ డ్రింక్స్:

కార్బోనేటేడ్ డ్రింక్స్ లో అన్స్టేబుల్ గ్యాస్ మాలిక్యూల్స్ అధికంగా కలవు. ఇవన్నీ, స్టమక్ లైనింగ్ ని ఇర్రిటేట్ చేసి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు దారి తీస్తాయి.

వేయించిన ఆహార పదార్థాలు:

వేయించిన ఆహార పదార్థాలు:

అనవసరమైన అలాగే అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు వేయించిన ఆహార పదార్థాలు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవన్నీ, ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న పసిపిల్లల జీర్ణవ్యవస్థని ఇబ్బందికి గురిచేస్తాయి. అందువల్ల, యాసిడ్ రిఫ్లక్స్ తో పాటు అజీర్ణం సమస్యలను శిశువులలో గమనించవచ్చు.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ పసిపిల్లల్లో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను కలిగిస్తుంది. పిల్లల జీర్ణవ్యవస్థలో అంతరాయం కలిగించడం ద్వారా వారిని చికాకుకు గురిచేస్తుంది. శరీరంలోని కండరాలకు విశ్రాంతి కలిగించడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు దారితీస్తుంది. అందువల్ల, తమ శిశువు యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాలిచ్చే తల్లులు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.

పిప్పరమెంటు:

పిప్పరమెంటు:

పిప్పరమెంటులోనున్న పదార్థాలు పసిపిల్లల జీర్ణవ్యవస్థలోనున్న శ్లేష్మానికి ఇర్రిటెంట్ గా వ్యవహరిస్తాయి. అందువల్ల, పిల్లల్లో యాసిడ్ రిఫ్లక్స్ ను గుర్తించవచ్చు.

కృత్రిమ పండ్ల రసాలు:

కృత్రిమ పండ్ల రసాలు:

మార్కెట్ లో లభించే కృత్రిమ పండ్ల రసాలు ప్రిజర్వేటివ్స్ తో మిళితమైన ఉండేవి. ఈ పండ్ల రసాలలోనుండే కెమికల్స్ ని పసిపిల్లల జీర్ణవ్యవస్థ త్వరగా జీర్ణం చేసుకోలేదు. తద్వారా, అజీర్ణానికి దారితీస్తుంది. పాలిచ్చే తల్లులు ఈ కృత్రిమ పండ్ల రసాలను తీసుకుంటే వారి శిశువులు గ్యాస్ట్రోయెసోఫాజిల్ రిఫ్లక్స్ అనే సమస్యకు గురికావచ్చు.

స్మోకింగ్:

స్మోకింగ్:

స్మోకింగ్ అనేది అనేక రకాలుగా మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అలవాటు. పాలిచ్చే తల్లి స్మోకింగ్ చేస్తే ఆ శిశువును యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వేధిస్తుంది. కాబట్టి గర్భిణీగా ఉన్నప్పటినుంచి స్మోకింగ్ కు దూరంగా ఉండటంతో మీ శిశువు యొక్క ఆరోగ్యానికి రక్షగా మీరు వ్యవహరించిన వారవుతారు.

తల్లిపాలు తాగే శిశువులు ప్రినేటల్ విటమిన్స్:

తల్లిపాలు తాగే శిశువులు ప్రినేటల్ విటమిన్స్:

గర్భిణీలకు ముందస్తు జాగ్రత్తగా ప్రినేటల్ విటమిన్లను డాక్టర్లు సిఫార్సు చేస్తారు. గర్భిణీగా ఉన్నప్పుడు శరీరానికి తగిన పోషకావసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. అయితే, ప్రసవం అయిన తరువాత కూడా వీటిని వాడితే తల్లిపాలు తాగే శిశువుపై వీటి ప్రభావం పడుతుంది. శిశువు వీటివల్ల చికాకుకు ఒక రకమైన ఇబ్బందికి లోనయ్యే ప్రమాదం కలదు. అందువల్ల, ప్రసవం తరువాత వాడవలసిన విటమిన్ల గురించి మీ డాక్టర్లను అడిగి తెలుసుకుని అవి వాడితే శిశువు యొక్క ఇబ్బందిని తగ్గించిన వారవుతారు.

క్యాబేజ్:

క్యాబేజ్:

పిల్లలకే కాదు పెద్దలకు కూడా క్యాబేజ్ అసిడిటీ సమస్యను తీసుకువస్తుంది. క్యాబేజ్ తీసుకున్న పెద్దలు కూడా జీర్ణవ్యవస్థ పనితీరుపై ఫిర్యాదు చేయడం గమనిస్తూనే ఉంటాం. క్యాబేజ్ సరిగ్గా ఉడకకపోయినా అలాగే క్యాబేజ్ ని అధికంగా తీసుకున్నా అజీర్ణం సమస్య వేధిస్తుంది. అందువల్ల, పాలిచ్చే తల్లులు క్యాబేజీని తీసుకుంటే వారి పాలు తాగే శిశువులు అజీర్ణంతో ఇబ్బంది పడతారు.

కాప్సికమ్:

కాప్సికమ్:

కాప్సికంలో నున్న పదార్థాలు పసిపిల్లల జీర్ణవ్యవస్థను అంతరాయం కలిగిస్తాయి. అందువల్ల, పాలిచ్చే తల్లులు క్యాప్సికం గనక తీసుకుంటే వారి శిశువులు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో సతమతమవవచ్చు.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ అనేది అనేక పోషక విలువలతో సూపర్ ఫుడ్ గా ప్రసిద్ధి. అయితే, పాలిచ్చే తల్లి బ్రొకోలీని గనక తన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆమె శిశువు గ్యాస్ ట్రబుల్ బారిన పడే అవకాశం పుష్కలంగా ఉంది. అంతే కాదు, గ్యాస్ ట్రబుల్ తో శిశువు చికాకుపడి ఇబ్బంది పడుతుంది కూడా.

కిడ్నీ బీన్స్:

కిడ్నీ బీన్స్:

కిడ్నీ బీన్స్ గ్యాస్ ట్రబుల్స్ కి దారితీస్తాయి. పాలిచ్చే తల్లి ఇవి తీసుకుంటే ఆమె శిశువుకు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్య బారిన పడి ఇబ్బంది పడవచ్చు.

బ్లాక్ బీన్స్:

బ్లాక్ బీన్స్:

కిడ్నీ బీన్స్ లాగానే బ్లాక్ బీన్స్ కూడా పసిపిల్లల్లో గ్యాస్ ట్రబుల్స్ కి అలాగే యాసిడ్ రిఫ్లక్స్ కి కారణమవుతాయి. పాలిచ్చే తల్లి వీటిని తీసుకుంటే పసిపిల్లలు గ్యాస్ ట్రబుల్స్ బారిన పడే అవకాశం కలదు.

Read more about: breastfeeding food
English summary

foods that cause acidity in breastfed babies | foods to avoid during breastfeeding

If your newborn is exclusively breastfed, the milk you provide is the only source of nutrition to the baby. This breast milk contains the very essence and goodness of all that you consume as a breastfeeding mother. But any ill effects or side effects of the food you eat can also end up in your breast milk.
Desktop Bottom Promotion