మీ చిన్నారుల్లో పళ్ల సమస్యలొచ్చాయా? అయితే ఇలా చేయండి

By: Y BHARATH KUMAR REDDY
Subscribe to Boldsky

చిన్నారుల బోసి నవ్వులు అందరికీ ఇష్టమే. తల్లిదండ్రులు తమ పిల్లలు నవ్వు అంటే భలే ఇష్టం. అప్పుడే వచ్చిన లేత పళ్లతో చిరునవ్వులు చిందిస్తుంటే మురిసిపోతారు. చిన్నపిల్లల్లో ఆరు నెలల నుంచి రెండున్నర యేళ్ల వయసు వరకూ వచ్చే మొదటి దంతాలను ప్రాథమిక దంతాలు లేదా పాలపళ్లు అంటారు. ఆరు సంవత్సరాల వయసు నుంచి 12 సంవత్సరాల మధ్యలో శాశ్వత దంతాలు వస్తాయి. పాలపళ్లు(ప్రాథమిక దంతాలు)కు శాశ్వత దంతాలకు మధ్య సమయాన్ని మిక్సిడ్‌ డెంటిషన్‌ పీరియడ్‌ అంటారు. ఈ సమయంలో పిల్లలు రెండురకాల దంతాలను కలిగి ఉంటారు. అంటే పాలపళ్లు రాలుతూ, శాశ్వత దంతాలు ఏర్పడుతుంటాయి. పిల్లలకు ప్రాథమిక దంతాలు రాగానే సమస్య ఉన్నా లేకున్నా ఒకసారి దంత వైద్యుడిని కలవాలి. పిల్లల్లో దంత సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఆసమయంలో వచ్చే దంత సమస్యలను కూడా ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

దంత క్షయం

అనేక కారణాల వలన దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై దంత క్షయం సంభవిస్తుంటుంది. దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై నప్పుడల్లా ఆ భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి దంతాలలో కాని, అవి ఉన్న భాగంలోని దవడ ఎముకలలో కాని ఉండవచ్చు. దంత మూలాలలో ఇన్ఫెక్షన్లు కలగడం వలన దంతక్షయం ఏర్పడి నొప్పి వస్తుంది. దంతాలపైన ఉండే ఎనామిల్ నాశనమై, దంతాలలోని సున్నిత భాగం పైకి వచ్చి మనం తీసుకునే ఆహారం, చల్లటి నీరు మొదలైన వాటి తాకిడి కారణంగా నొప్పి కలుగవచ్చు.

నిర్లక్ష్యం వద్దు

సాధార‌ణంగా చిన్న‌పిల్ల‌ల్లో ఆరు నెల‌ల నుంచి ప‌ళ్లు రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. వీటిని పాల‌ప‌ళ్లు అంటారు. వీటిని జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం వ‌ల్ల వాటి క్రింద ఉండే శాశ్వ‌త దంతాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటాయి. ఈ పాల‌ప‌ళ్లు అనేవి ఎలాగు ఊడిపోయి..శాశ్వ‌త దంతాలు వ‌స్తాయి క‌దా అని చాలా మంది అనుకుంటారు. కానీ అవి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ నొప్పి ఇంత‌టితో ఆగ‌కుండా వాపురావ‌డం..నొప్పి ఇంకా ఎక్కువ అవ్వ‌డం ఆ ఇన్ఫెక్ష‌న్ ల కింద ఉన్న శాశ్వ‌త దంతాలకు పాకుతుంది. ఈ పాల‌ప‌ళ్ళు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వ‌త దంతాలు స‌రైన క్ర‌మంలో రావ‌డానికి మార్గాలుగా ఉంటాయి. అందువ‌ల్ల ఆ శాశ్వ‌త దంతాలు వ‌చ్చే వ‌ర‌కు వాటిని కాపాడుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అలాగే చిన్నపిల్లలు దంతాలు పాడవడం వల్ల సరిగా ఆహారాన్ని తీసుకోలేరు. దీంతో వారు పోషకాహార లోపానికి గురవుతారు. అందువల్ల ప్రాథమిక దంతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

పిల్లల్లో దంత క్షయం కారణాలు ఏమిటి?

సరైన నోటి శుభ్రత లేకపోతే దంత క్షయం ఏర్పడుతుంది. రోజూ చిన్నారులను నోటిని శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే అది దంత క్షయానికి దారి తీస్తుంది. మీ చిన్నారికి మొదట దంతాలు వచ్చినప్పుడు వాటిని సున్నితంగా శుభ్రం చేయాలి. ఒక స్మూత్ టూత్ బ్రష్ ను ఉపయోగించాలి.

చక్కెర లేదా పంచదార పానీయాలు తీసుకోవడం

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిలో బాక్టీరియా ఏర్పడుతుంది. అయితే చిన్నపిల్లలు నోటిని అంతగా శుభ్రం చేసుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి నోటిలో బ్యాక్టీరియా మరింత పెరిగి దంతసమస్యలు ఏర్పడుతాయి. అలాగే చాలామంది తల్లులు వారి పిల్లలు త్వరగా నిద్రపోవాలని చక్కెర నీటిని లేదా తేనే నీటిని పాలను తాపిస్తుంటారు. అయితే ఇవి కూడా దంతక్షయానికి కారణం అవుతాయి.

ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి

మొదట తల్లులు తమ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో తల్లులు, పిల్లలు ఒకే చెంచాను ఉపయోగించడం వల్ల తల్లుల నోట్లోని బ్యాక్టీరియా పిల్లల లాలాజలంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు పాలుపట్టాక పిల్లల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. చిన్నారులకు అలవాటయ్యే వరకు తల్లిదండ్రులే బ్రష్ చేయడం మంచిది. చక్కెర కలిపిన నీళ్లు, జ్యూస్‌లు బాటిల్‌తో పట్టకండి. పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు.

1. పసుపు

1. పసుపు

పసుపు బాక్టీరియాను నివారించడంలో బాగా పని చేస్తుంది. దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో ఇది సమర్థంగా పోరాడుతుంది. కొద్దిగా పసుపు, కొబ్బరి నూనెను తీసుకోండి. ఈ రెండింటిని కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను మీ చిన్నారుల పళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించండి.

2. కాడ్ లివర్ ఆయిల్

2. కాడ్ లివర్ ఆయిల్

కాడ్ లివర్ ఆయిల్ లో విటమిన్ ఏ, ఇతర పోషకపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆయిల్ బ్యాక్టీరియాను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దంత క్షయాన్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది. కొద్దిగా కాడ్ లివర్ ఆయిల్ తీసుకుని మీ చేతి వేలి ద్వారాగానీ, బ్రష్ తో గానీ మీ చిన్నారుల పళ్లను శుభ్రం చేయండి.

3. ఉప్పు నీరు

3. ఉప్పు నీరు

ఉప్పు నీరు కూడా పళ్ల సమస్యలను ఈజీగా తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను నివారించడంలో ఇది బాగా పని చేస్తుంది. ఒక స్పూన్ నీటిలో చిటికెడు ఉప్పు వేయండి. దాన్ని మీ చిన్నారి పళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించండి.

4. లవంగం

4. లవంగం

లవంగం, లవంగ నూనెతో చాలా ప్రయోజనాలున్నాయి. నోటి పరిశుభ్రత దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పంటి నొప్పులు తగ్గేందుకు ఇది బాగా సహాయపడుతుంది. రెండు చుక్కల లంవంగం నూనెను తీసుకుని దాంతో మీ చిన్నారుల పళ్లను శుభ్రం చేయండి. దీంతో దంతక్షయం మటు మాయం అవుతుంది.

5. వెల్లుల్లి

5. వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీ ఫంగలల్, యాంటీ, బాక్టీరియల్ గా పని చేస్తుంది. కొన్ని వెల్లిలను తీసుకుని వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని మీ చిన్నారులు పళ్లు తోముకోవడానికి ఉపయోగించండి.

6. గోధుమ గడ్డి

6. గోధుమ గడ్డి

గోధుమలో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దంత క్షయాన్ని నివారించడంలో గోధుమ గడ్డి బాగా సహాయపడుతుంది. కొద్దిగా పచ్చి గోధుమ ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని మీ శిశువు పళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించండి.

7. లికోరైస్

7. లికోరైస్

లికోరైస్ మొక్క కూడా దంతక్షయం నుంచి కాపాడుతుంది. ఇందులో యాంటీ క్యావిటీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్కకు సంబంధించిన వేర్లు, లేదా చిన్నచిన్న కొమ్మలు దంత పరిరక్షణకు బాగా ఉపయోగపడతాయి. మీ పిల్లలు వీటిని నమలగలిగితే వీటిని వినియోగించండి.

8. వేపపుల్ల

8. వేపపుల్ల

ఇండియన్ లిలక్ లేదా వేప దంతాల శుభ్రపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. మనదేశంలో చాలామంది దీన్ని ఉపయోగిస్తుంటారు. మీ చిన్నారి కాస్త పెద్దగా ఉన్నట్లయితే వేపపుల్లను పళ్లు తోమడానికి ఉపయోగిస్తే చాలా మంచిది. లేదంటే మీ పిల్లలు చాలా చిన్నవారైతే వేప ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్ తో మీ పిల్లల దంతాలను శుభ్రం చేయొచ్చు.

9. ఉసిరి

9. ఉసిరి

ఉసిరిలో యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి దంతాలను సంరక్షించడానికి సహాయపడుతుంది. మీ పిల్లలు కాస్త పెద్దగా ఉంటే రోజు ఒక ఉసిరికాయ తినేలా చూడండి. మీ పిల్లలు చాలా చిన్నవారైతే మాత్రం ఉసిరి కాయ పొడిని కాస్త నీళ్లలో కలిపి ఆ పేస్ట్ తో మీ పిల్లల పళ్లు శుభ్రం చేయండి.

10. జాజికాయ

10. జాజికాయ

జాజికాయలో యాంటీ కార్యోజెనిక్ ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా జాజికాయ పొడిని తీసుకుని దానికి కాస్త లవంగ నూనె కలపండి. ఆ పేస్ట్ ను మీ చిన్నారుల పళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. పాల పళ్లకు అలాగే శాశ్వతదంతాలకు ఇది బాగా పని చేస్తుంది.

11. స్వీట్లు తినడం మానిపించండి

11. స్వీట్లు తినడం మానిపించండి

దంతాల క్షయం ఏర్పడానికి ప్రధాన కారణం మీ పిల్లలు స్వీట్లు ఎక్కువగా తినడమే. మీ చిన్నారులచే వాటిని తినడం మాన్పించండి. ఎందుకంటే దంత క్షయానికి ఎక్కువగా స్వీట్స్ తినడమే కారణం.

12. ఫైటిక్ యాసిడ్

12. ఫైటిక్ యాసిడ్

ఫైటిక్ యాసిడ్స్ కలిగిన ధాన్యాలు, నట్స్ తీసుకుంటే వారిలో దంత క్షయం ఎక్కువగా ఉంటుంది. ఫైటిక్ యాసిడ్స్ కూడా డైజెస్టివ్ ట్రాక్ లో కలిసి ఉంటాయి. అందువల్ల ఇది ఉండే పదార్థాలను చాలా తక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఫైటిక్ యాసిడ్స్ ఉన్న పదార్థాలను ఒకవేళ తీసుకుంటే వెంటనే మీ పిల్లల నోటిని శుభ్రంచేయండి. దీంతో దంతక్షయం ఏర్పడదు.

13. పాల పదార్థాలను తీసుకోవాలి

13. పాల పదార్థాలను తీసుకోవాలి

పాల పదార్థాల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అలాంటి ఉత్పత్తులను తీసుకోవడం వల్ల దంతక్షయం తగ్గిపోతుంది. అలాగే మీ చిన్నారుల పళ్లు కూడా గట్టిగా తయారువుతాయి. అందువల్ల పాలపదార్థాలను ఎక్కువగా వినియోగించాలి.

14. పోషకాహారాలు అధికంగా తీసుకోవాలి

14. పోషకాహారాలు అధికంగా తీసుకోవాలి

సరైన పోషకాహారం లేని ఆహారాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో దంత క్షయం సులభంగా వస్తుంది. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటే మంచిది. దీని ద్వారా దంతక్షయానికి కారణమయ్యే బ్యాకీరియాకు వ్యతిరేకంగా పోరాడే శక్తి వస్తుంది.

15. మంచి పేస్ట్ ఉపయోగించండి

15. మంచి పేస్ట్ ఉపయోగించండి

కొన్ని రకాల టూత్ పేస్ట్ లలో ఎలాంటి మినరల్స్ ఉండవు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల మినరలైజ్డ్ టూత్ పేస్ట్స్ ఉపయోగించాలి. ఇవి మీ చిన్నారుల దంతాలను గట్టిగా ఉంచుతాయి. అలాగే దంతక్షయం ఏర్పడకుంగా కాపాడుతాయి.

16. ఆయిల్ పుల్లింగ్

16. ఆయిల్ పుల్లింగ్

ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ కూడా ఈ సమస్య పరిష్కారానికి బాగా పని చేస్తుంది. రెండు చుక్కల కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని కొద్దిసేపు పుక్కలించి బయటికి ఉమ్మివేసేలా చేయించాలి. అయితే మీ పిల్లలు కాస్త పెద్దవారైతేనే ఈ విధానం పాటించేలా చూడండి. చిన్నవారైతే ఉపయోగించకపోవడమే మంచిది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మీ చిన్నారుల పళ్లు తెల్లగా మారుతాయి. అయితే కొబ్బరి నూనెను ఎట్ట పరిస్థితుల్లోనూ మింగకూడదు.

English summary

16 natural remedies tooth decay in babies

Milk teeth can be lost due to many reasons. Tooth decay in children is a major reason for loss of teeth in childhood. As parents, it is our duty to prevent the onset of tooth decay in our babies. If by any chance, signs of tooth decay are recognized in your baby, you must do the needful to reverse it or treat it. Today, we shall discuss more about tooth decay and the way that we can prevent and correct them. We shall also mention a few home remedies that you can try for the same.
Story first published: Saturday, November 11, 2017, 14:09 [IST]
Subscribe Newsletter