For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చిన్నారిని ఓరల్ థ్రష్ నుంచి రక్షించుకోండిలా !

By Y BAHRATH KUMAR REDDY
|

చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లిదండ్రులు తట్టుకోలేరు. వారికొచ్చే సమస్యను చెప్పుకోలేరు. పిల్లలకూ అప్పడప్పుడు నోటి సమస్యలు వస్తుంటాయి. నోటిపూత, నోట్లో తెల్లని ప్యాచ్ లు ఏర్పడడం జరుగుతుంటుంది. దీంతో సరిగా పాలు తాగలేరు. నోటిలో తెల్లని చిన్న చిన్న పొక్కులు రావడమే ఇందుకు కారణం.ఈ పొక్కులు కొందరిలో కొంత భాగానికే పరిమితమైతే.. మరికొందరిలో నాలుక మొత్తం కనబడొచ్చు. పెదవులు, బుగ్గల లోపల.. నోటి అడుగున, అంగిలి మీద కూడా ఇవి ఏర్పడొచ్చు. కొందరికి పెదవుల చివర్లో ఏర్పడతాయి. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఓరల్ థ్రష్ అని కూడా అంటారు. యాంటీబయాటిక్స్ వల్ల నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది, దీనిని ఓరల్ థ్రష్ అంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల నాలికపై లేదా నోటి లోపల తెల్లని, పసుపు రంగులో ఉండేటటువంటి ప్యాచ్ లు కనిపిస్తాయి. రెండేళ్లలోపు చిన్న పిలల్లు వీటిని బారిన పడినప్పుడు తల్లిదండ్రులు కాస్త జాగ్రతలు తీసుకోవాలి. ఓరల్ థ్రష్ నివారణకు కొన్ని రకాల హోం రెమిడీస్ కూడా బాగానే పని చేస్తాయి. వాటిని తల్లిదండ్రులు తెలుసుకుని మీ చిన్నారులు ఓరల్ థ్రష్ నుంచి ఉపశమనం పొందేలా చేయాల్సిన అవసరం ఉంది. మరి అవి ఏమిటో తెలుసుకోండి.

1. బేకింగ్ సోడా

1. బేకింగ్ సోడా

ఓరల్ థ్రష్ నివారణకు బేకింగ్ సోడా బాగా పని చేస్తుంది. ఇది పిల్లలలో నోటి పూతకు కారణమయ్యే ఈస్ట్ ను నాశనం చేస్తుంది. అలాగే నోట్లో పీహెచ్ స్థాయిలు తటస్థంగా ఉండేలా సాయం చేస్తుంది. బేకింగ్ సోడాను కొద్దిపాటి నీటిలో కలపండి. కొద్దిగా పత్తి తీసుకుని ఆ నీటిలో ముంచి ఎక్కడైతే మీ చిన్నారి నోటిలో తెల్లగా ఉందో లేదా పొక్కులులాంటివి ఉన్నాయో ఆ ప్రాంతంలో దానితో సున్నితంగా ఒత్తినట్లు చేయండి. తర్వాత నోటిలో నీళ్లు వేసుకుని పుక్కలించాలి.

2. వెల్లుల్లి

2. వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీ ఫంగల్ లాగా పని చేస్తుంది. యాంటీ బాక్టీరియల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక వెల్లుల్లిని తీసుకోండి. దాని పొట్టు తీసి బాగా కడగండి. మెత్తగా నూరుకోండి. మీ చేతి వేలుని బాగా కడుక్కోండి. మీ చిన్నారి నోటిలో ఉన్న పొక్కులపై ఆ మిశ్రమాన్ని రుద్దండి. కొద్దిసేపటి తర్వాత నోటిలో నీళ్లుపోసి పుక్కిలించి ఉమ్మి వేసేలా చేయండి.

3. విటమిన్ సి

3. విటమిన్ సి

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఓరల్ థ్రష్ ను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే తల్లి విటమిస్ సీ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన ఉంటుంది. ఆమె పాలను బిడ్డ తాగడం వల్ల విటమిన్ సి బిడ్డకు అందుతుంది. లేదంటే ఆరేంజ్ రసాన్ని తీసుకుని దాన్ని మీ వేలితో సున్నితంగా మీ చిన్నారి నోటిలో పూయండి. కొద్దిసేపటి తర్వాత నీళ్లతో నోటిని కడివేయండి.

4. క్రాన్బెర్రీ

4. క్రాన్బెర్రీ

క్రాన్బెర్రీ లేదా క్రాన్బెర్రీ జ్యూస్ కూడా నీటి పొక్కుల నివారణకు, నోటిలో తెల్లగని ప్యాచ్ ల నివారణకు, ఓరల్ థ్రష్ నివారణకు బాగా పని చేస్తుంది. కొన్ని తాజా క్రాన్బెర్రీస్ తీసుకోండి. వాటితో జ్యూస్ తయారు చేసుకోండి. ఒక టీ స్పూన్ జ్యూస్ ను మీ చిన్నారికి తాపండి. లేదంటే మార్కెట్లో చక్కెర ఉపయోగించకుండా తయారు చేసిన క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకొచ్చి కూడా తాపవచ్చు.

5. దాల్చిన చెక్క

5. దాల్చిన చెక్క

ఇది కూడా యాంటీ ఫంగల్ ఏజెంట్ గా బాగా పని చేస్తుంది. దాల్చినచెక్క నీటిలో వేసి బాగా మరిగించండి. అది బాగా చల్లారాక కొద్దిగా మీ చిన్నారికి తాపండి. దీంతో కూడా మంచి ఫలితం పొందొచ్చు.

6. ప్రోబయోటిక్ ఫుడ్స్

6. ప్రోబయోటిక్ ఫుడ్స్

లాక్టోబాసిలస్ ఆసిడోఫిల్ వంటి ప్రోబయాటిక్స్ నోటిలో బ్యాక్టీరియల్ పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. పెరుగు, యోగార్ట్ లో ప్రో బయోటిక్ ఆహారాలు. వీటిని మీ చిన్నారికి ఒక స్పూన్ తినిపించండి.

7. లవంగ నూనె

7. లవంగ నూనె

లవంగ నూనె కూడా యాంటీ ఫంగల్ గా పని చేస్తుంది. మీ చేతి వేలును బాగా కడుక్కోని కాస్త లవంగ నూనెను మీ చిన్నారి నోటిలో రాయండి. కొద్దిసేపు అలాగే ఉంచండి. తర్వాత నోటిని నీళ్లతో కడగండి.

8. టీ ట్రీ ఆయిల్

8. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్లో కూడా లవంగ నూనె మాదిరిగానే పని చేస్తుంది. ఒక చుక్క ఆయిల్ ను తీసుకుని మీ చిన్నారి నోటిలో పొక్కులున్న చోట పూయండి. కొద్దిసేపటి తర్వాత నోటిని కడివేయండి.

9. లావెండర్ నూనె

9. లావెండర్ నూనె

లావెండర్ నూనె కూడా యాంటీ ఫంగల్ గా పని చేస్తుంది. ఒక చుక్క నూనెను మీ చిన్నారి నోటిలో పొక్కులు లేదా తెల్లటి ప్యాచ్ ఉన్న చోట పూయండి. దీంతో మీ చిన్నారికి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే నూనె పూసిన కొద్ది సేపటి తర్వాత దాన్నికడిగివేయండి.

10. మిర్హ్ ఆయిల్

10. మిర్హ్ ఆయిల్

మిర్హ్ ఆయిల్ ఎంతో బాగా పని చేస్తుంది. తెల్లటి ప్యాచ్ లున్న చోట ఒక్క చుక్క మిర్హ్ ఆయిల్ పూయండి. కొద్దిసేపటి తర్వాత నోటిని పూర్తిగా కడిగివేయండి. దీని వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

11. ఒరెగానో నూనె

11. ఒరెగానో నూనె

ఓరెగానో నూనె ఓరల్ థ్రష్ కు కారణమయే్య ఈస్ట్ కు వ్యతరేకంగా పని చేస్తుంది. ఒరెగానో నూనె వేలుకు రాసుకుని మీ చిన్నారి నోటిలో పొక్కులున్న చోట పూయండి. కొద్దిసేపు అలాగే ఉంచండి. తర్వాత నీటితో మీ చిన్నారి నోటిని కడిగివేయండి.

12. కొబ్బరి నూనె

12. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియా యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రెండు చుక్కల కొబ్బరి నూనెను తెల్లచి ప్యాచీలపై వేసి సున్నితంగా రాయండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది.

13. బ్రెస్ట్ పంప్స్ శుభ్రంగా ఉంచుకోవాలి

13. బ్రెస్ట్ పంప్స్ శుభ్రంగా ఉంచుకోవాలి

బిడ్డల నోటిలో ఏర్పడే నోటి పూతకు బ్రెస్ పంప్స్ కూడా కారణం కావొచ్చు. అవి అపరిశుభ్రంగా ఉండడం వల్ల కూడా పిల్లల నోటిలో ఈ విధమైన తెల్లటి ప్యాచులు ఏర్పడుతాయి. అలాగే పాల డబ్బాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. బ్రెస్ట్ పంప్స్, పాసిఫైయర్లను శుభ్రంగా ఉంచుకోవాలి.

14. కలబంద

14. కలబంద

కలబందలో కూడా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఓరల్ థ్రష్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కలబంద ఆకును తీసుకోండి. దాన్ని ముక్కముక్కలుగా చేసుకోండి. దాని రసాన్ని వేలితో మీ చిన్నారి నోటిలో పూయండి.

15. వేప ఆకులు

15. వేప ఆకులు

వేప ఆకుల్లోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తాజా వేప ఆకులను తీసుకోండి. వాటిని మెత్తగా నూరుకోండి. కాస్త నీరు కలపి మిశ్రమంగా తయారు చేసుకోండి. దాన్ని మీ చిన్నారి నోటిలో తెల్లటి పూత ఉన్న చోట పూయండి. లేదంటే నీళ్లను వేడి చేసి అందులో వేప ఆకులు వేసి మరిగించండి. ఆ నీటిని మీ చిన్నారికి ఒక రోజులో కొన్నిసార్లు తాపుతూ ఉండండి.

16. పసుపు, పాలతో తయారు చేసిన పేస్ట్

16. పసుపు, పాలతో తయారు చేసిన పేస్ట్

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. వేడిపాళ్లలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి పేస్ట్ గా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ ను మీ చిన్నారి నోటిలో తెల్లటి లేదా పచ్చటి పూత ఉన్న చోట పూయండి.

17. ఆపిల్ సైడర్, తేనె

17. ఆపిల్ సైడర్, తేనె

ఆపిల్ సైడర్ యాంటీ ఫంగల్ గా పని చేస్తుంది. ఆపిల్ సైడర్, తేనె రెండు సమపాళ్లలో కలుపుకుని ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోండి. దాన్ని మీ చిన్నారి నోటిలో పూయండి. అయితే సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల విషయంలో మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇది వారికి ప్రమాదకరం. అందువల్ల ఏడాది పై బడిన పిల్లలకు మాత్రమే ఈ రెమిడీ ఉపయోగించాలి.

18. నిమ్మ రసం, నిమ్మ గడ్డి నూనె

18. నిమ్మ రసం, నిమ్మ గడ్డి నూనె

నిమ్మకాయ రసం, నిమ్మ గడ్డి నూనె ఈ రెండింటిలో యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయ రసం, నిమ్మకాయ గ్లాస్ నూనెను మిక్స్ చేసుకోండి. మీ వేలును శుభ్రంగా కడుక్కోని ఆ మిశ్రమాన్ని మీ చిన్నారి నోటిలో పూయండి.

19. వేడి పాలు, కాస్టర్ ఆయిల్

19. వేడి పాలు, కాస్టర్ ఆయిల్

కాస్టర్ ఆయిల్ లో ఎక్కువగా యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాస్త గోరు వెచ్చటి పాలు తీసుకోండి. అందులో ఒక రెండు చుక్కల ఆముదం కలపండి. దీన్ని తాపడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి.

20. అవిసె గింజలు

20. అవిసె గింజలు

అవిసె గింజలు ఓరల్ థ్రష్ ను నివారించడంలో బాగా పని చేస్తాయి. కొంచెం నీరు తీసుకోండి. అందులో అవిసె గింజలను వేసి ఉడికించండి. చల్లరాక వాటిని ఒక టీ స్పూన్ ప్రకారం మీ చిన్నారికి తినిపించండి. మంచి ఫలితం ఉంటుంది.

21. వెచ్చని నీరు

21. వెచ్చని నీరు

గోరు వెచ్చని నీరు కూడా ఈ సమస్య పరిష్కారానికి బాగా పని చేస్తుంది. మీ చిన్నారి హైడ్రేటుగా ఉండేటట్లు చేస్తుంది. కొద్దిగా నీరు తీసుకుని బాగా మరిగించండి. దాన్ని పూర్తిగా చల్లబరచండి. ఈ నీటిని మీ చిన్నారికి రోజులో అప్పుడప్పుడు తాపుతూ ఉండండి.

22. నిపుల్స్ ను శుభ్రం చేసుకోవడం మంచిది

22. నిపుల్స్ ను శుభ్రం చేసుకోవడం మంచిది

మీ చిన్నారి ఓరల్ థ్రష్ కు గురికావడానికి మీ నిపుల్స్ కూడా కారణం కావొచ్చు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అందువల్ల మీ బిడ్డకు పాలిచ్చిన ప్రతిసారి వాటిని శుభ్రం చేసుకోండి.

23. బ్లాక్ వాల్నట్

23. బ్లాక్ వాల్నట్

బ్లాక్ వాల్నట్ యాంటీ ఫంగల్ గా పని చేస్తుంది. బ్లాక్ వాల్నట్స్ ను నీటిలో మరిగించండి. ఈ ద్రవాణాన్ని రోజుకు రెండు సార్లు ప్రకారం మీ చిన్నారికి తాపుతూ ఉండండి. దీని వల్ల కూడా మీ చిన్నారి ఓరల్ థ్రష్ భారీ నుంచి ఉపశమనం పొందుతారు.

24. ఆలివ్ ఆకులు

24. ఆలివ్ ఆకులు

ఓరల్ థ్రష్ కు కారణమయ్యే ఈస్ట్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఆలివ్ ఆకులకు ఉంటుంది. వీటని ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి. మీరు కొన్ని ఆలివ్ ఆకులన తీసుకొని వాటిని నీళ్ళలో వేసి మరిగించండి. తర్వాత చల్లార్చండి. ఆ ద్రావణాన్ని మీ చిన్నారి నోట్లో పూయండి.

25. పుచ్చకాయ తొక్క

25. పుచ్చకాయ తొక్క

పుచ్చకాయను తిన్న వెంటనే దాని తొక్కను మనం పారవేస్తుంటాం. అయితే ఇది అనే యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండాలి. అలాగే మీ చిన్నారిని నోటిని ఇది బాగు చేస్తుంది. పుచ్చకాయ తొక్కను చిన్న ముక్కలుగా చేసుకోండి. దానితో మీ చిన్నారి నోటిలో ఎక్కడెక్కడ అయితే తెల్లటి ప్యాచ్ లున్నాయో అక్కడ రుద్దండి.

26. గ్రీన్ టీ

26. గ్రీన్ టీ

గ్రీన్ టీ ఓరల్ థ్రష్కు కారణమయ్యే శిలీంధ్రాలను నాశనం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ తయారు చేసి దాన్ని బాగా చల్లార్చండి. ఒక రోజులో కొన్ని స్పూన్ల ప్రకారం మీ చిన్నారికి తాపండి.

27. మజ్జిగ

27. మజ్జిగ

మజ్జిగలో మంచి ప్రయోజనాలు కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. ఓరల్ థ్రష్ ఫంగస్ ను ఎదుర్కోనే గుణాలు దీనికి ఉంటాయి. రోజుకు రెండుసార్ల చొప్పున మీ చిన్నారికి మజ్జిగ తాపుతూ ఉండండి.

28. బోరిక్ యాసిడ్

28. బోరిక్ యాసిడ్

బోరిక్ యాసిడ్ ఫంగస్ ను నాశనం చేస్తుంది. నోట్లో పీహెచ్ తటస్థంగా ఉండేలా ఇది పని చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బోరిక్ యాసిడ్ ను కలపాలి. ఈ నోటితో మీ చిన్నారి నోటిని కడగండి. అయితే మీ పిల్లలు దీన్ని మింగకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మింగకూడదు.

29. జెన్టియన్ వైలెట్

29. జెన్టియన్ వైలెట్

జెన్టియన్ వైలెట్ ను సాధారణంగా ప్రయోగశాలల్లో స్టెయిన్ గా ఉపయోగిస్తారు. ఫంగస్ కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఇది ఎక్కువగా కలిగి ఉంటుంది. జెంటియన్ వైలెట్ కాస్త పత్తికి అంటించుకుని నోటిలో పొక్కులుండే చోట పూయాలి. కొద్దిసేపటి తర్వాత నోటిని శుభ్రంగా కడిగివేయాలి.

30. గ్రేప్ ప్రూట్

30. గ్రేప్ ప్రూట్

గ్రేప్ ప్రూట్ లో ఉండే యాసిడ్స్ ఓరల్ థ్రష్ కు కారణమయ్యే శిలీంధ్రాలను నాశనం చేయగలవు. మీ చిన్నారికి కొన్ని చుక్కల గ్రేప్ ప్రూట్ రసాన్ని తాపండి. లేదంటే నోటిలోని తెల్లటి ప్యాచెస్ పై గ్రేప్ ప్రూట్ గింజల రసాన్ని రసాన్ని రుద్దండి. ఈ విధానాలన్నీ మీ చిన్నారి నోటిలో ఉండే పొక్కులు, తెల్లటి మచ్చలు, పుండ్లు తదితర వాటిని నివారించడానికి ఉపయోగపడతాయి.

English summary

30 Home Remedies For Oral Thrush In Infants & Kids 

Your little one is so small and vulnerable that any discomfort to your baby can be very worry some to you. Finding a white patch in your baby’s mouth can be terrifying especially if you do not know what to expect. The white patch in your baby’s mouth can be anything from milk residue to oral thrush. But you need to be sure before you can decide on the way to best deal and resolve the issue. Read on and you will learn how to differentiate a case of Oral thrush from the other cases. We shall also tell you some home remedies that can help prevent. Cure and deal with the oral thrush.
Desktop Bottom Promotion