Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఒకరకంగా పిల్లలకు ఈ అలవాటు మంచిదే ఎందుకంటే..!?
పిల్లలకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుందని కెనడా పరిశోధకులు చెబుతున్నారు. తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తే అలర్జీలు వచ్చే ప్రమాదం ఏ మాత్రం ఉండదట..
'ఒరేయ్ నోట్లో వేలు తీయ్..ఇదేం అలవాటు'? చిన్న పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో ఇది పాపులర్ డైలాగే ! నోట్లో వేలు పెట్టుకుని పిల్లలు కనిపిస్తే వారిని తల్లిదండ్రులు మందలించడం షరామామూలే..అయితే నోట్లో వేలు పెట్టుకోవడమేమీ చెడ్డ అలవాటు కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. గోర్లు కొరకడం, బొటనవేలు నోట్లో పెట్టుకునే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట!

పిల్లలు ఎప్పుడూ నోట్లో వేళ్లు పెట్టుకుంటూ ఉంటే పళ్లు దెబ్బతింటాయనీ, నత్తి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. వారి చేత ఆ అలవాటు మాన్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆ అలవాటు కూడా మంచిదేనని చెబుతున్నారు పరిశోధకులు.

ఈ అలవాట్లు పెరిగే క్రమంలో దీర్ఘకాలంలో అలర్జీలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని ఒటాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఇంట్లోని దుమ్ము, ధూళి, కుక్క, పిల్లిలాంటి పెంపుడు జంతువుల వెంట్రుకల ద్వారా వచ్చే అలర్జీల నుంచి కాపాడుకునేందుకు సరిపడే శక్తి నోట్లో వేలు పెట్టుకోవడంతో వస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

పిల్లలకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుందని కెనడా పరిశోధకులు చెబుతున్నారు. తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తే అలర్జీలు వచ్చే ప్రమాదం ఏ మాత్రం ఉండదనీ, పైగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుందనీ అంటున్నారు.

దానికి గల కారణాలను ఇలా విశ్లేషిస్తున్నారు. చిన్నారుల వేళ్ల మీద, గోళ్ల మీద అనేక రకాల క్రిములు ఉంటాయి. నోట్లో వేళ్లు పెట్టుకునే సందర్భంలో ఇవి వారి కడుపులోకి వెళ్లిపోతాయి. సహజంగానే ఈ క్రిములను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కూడా పసితనం నుంచే పెరుగుతూ వస్తుంది. క్రిములు పెరిగే కొద్దీ రోగాలను తట్టుకునే శక్తి కూడా శరీరానికి వస్తుందని పరిశోధకులు అంటున్నారు.

మామూలు చిన్నారుల కంటే వేళ్లను నోట్లో పెట్టుకునేవారికి 31 శాతం అధికంగా రోగనిరోధక శక్తి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏఏ క్రిముల పట్ల ఇలాంటి నిరోధక శక్తి వస్తుందో ఇంకా తెలియలేదనీ దాన్ని ధ్రువపరిచే పనిలో ఉన్నట్లు తెలిపారు. కొద్ది వయస్సు వరకు మాత్రమే ఈ అలవాటు మంచిదనీ, పెద్దయ్యాక కూడా ఇలాగే చేస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications











