మీ బేబీ గ్రోత్ ను తెలుసుకోవడం ఎలా?

By: Mahesh
Subscribe to Boldsky

పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు కానీ ఈ పెరుగుదల స్థిరమైన వేగంతో జరగదు. సాధారణంగా, పిల్లలు విశ్రాంతి దశలో ఉండటం ద్వారా వారు కొద్దిగా అభివృద్ధి చెందుతారు, తరువాత వృద్ధి చెందుతున్న దశలో అభివృద్ధి వేగంగా ఉంటుంది , ఇలా వేగంగా పెరగడాన్ని గ్రోత్ స్పర్ట్గా పిలుస్తారు.

గ్రోత్ స్పర్ట్స్ ని పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను బట్టి ముందే తెలుసుకోవచ్చు. ఈ సమయంలో వారు బాగా బరువు పెరుగుతారు. తల మరియు శరీరం పెరగడం లో వచ్చే మార్పుల వలన కూడా దీన్ని గుర్తించవచ్చు.

బేబీ పెరుగుదలలో కొన్నిఆశ్చర్యకర విషయాలు

అలాగే మీ బేబీ కి ఎక్కువగా ఆకలి వేస్తుంటే కూడా గ్రోత్ స్పర్ట్స్ కి సూచనగా అనుకోవచ్చు. తల్లి పాలను తాగే బేబీ ఎక్కువసేపు పలు తాగడానికి ప్రయత్నిస్తుంది. అలా కాకుండా డబ్బా పాలు లేదా ఫార్ములా పాలు తాగే బేబీ కూడా ఎక్కువగా తాగడానికి ప్రయత్నిస్తుంది కానీ తల్లి పాలు తాగే బేబీ తో పోల్చితే తక్కువగా తాగుతారు.

baby's growth at 3 months

కొంత మంది పిల్లలు చిరాకు మరియు ఇతరుల మీద ఆధారపడటం లాంటి దశలో ఉంటారు. వీరిని ఎక్కువసేపు ఎత్తుకుంటే ఇష్టపడతారు. అలాగే బేబీస్ నిద్రపోవడంలో ఇబ్బంది మరియు అసౌకర్యం గ ఉంటారు . మరి కొంత మంది పిల్లల్లో పెరుగుతున్నట్టు ఎలాంటి సంకేతాలు ఉండవు. ఇలాంటి పిల్లల్లో వాళ్లే సొంతం గా బట్టలు వేసుకోడం లాంటి చర్యల వల్ల అకస్మాత్తుగా పెరుగుతున్నట్టు తెలుసుకోవచ్చు.

బేబీస్ లో గ్రోత్ స్పర్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి

baby's growth at 3 months

గ్రోత్ స్పర్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి మరియు ఎంత కాలం పాటు ఉంటాయి ?

గ్రోత్ స్పర్ట్స్ గురించి తెలుసుకోడానికి కచ్చితమైన సమయం ఉండదు, ఇది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కానీ కింద చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మీరు గ్రోత్ స్పర్ట్స్ ని గుర్తించవచ్చు :

2 వారాలు

3 వారాలు

6 వారాలు

3 నెలలు

6 నెలలు

అందరిలో పైన చెప్పబడి సందర్భాల్లో ఉండాలని లేదు కానీ ఆ సమయాలకి దగ్గర్లోనే ఉండొచ్చు.

baby's growth at 3 months

గ్రోత్ స్పర్ట్స్ సమయంలో కనిపించే ముఖ్యమైన మార్పులు ఏంటి ?

తినడం : మీరు శిశువు యొక్క సాధారణ ఆహారపు అలవాట్లలో ఒక మార్పును ఆశించవచ్చు. మీ శిశువు గ్రోత్ స్పర్ట్స్ సమయంలో ఎక్కువ ఆకలిగా ఉండటం చూడొచ్చు. ఎందుకంటే పెరిగే సమయం లో శరీరానికి ఎక్కువ కాలరీస్ కావాలి. తల్లి పాలు మరియు డబ్బా పాలు తాగే పిల్లలు ఫీడింగ్ తర్వాత కూడా అసంతృప్తిగా ఉంటారు. మాములుగా తీసుకునే ఆహారం కంటే ఎక్కువ కావాలని అడుగుతుంటారు .

baby's growth at 3 months

నిద్రించే పద్ధతులు : చాలామంది పిల్లలు వృద్ధి చెందుతున్న దశలో మరియు వృద్ధి చెందే దశకు ముందు ఎక్కువగా నిద్రపోతుంటారు. నిద్రించే సమయంలో పిల్లలు ఎక్కువగా వృద్ధి చెందుతారు, ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది . నిద్రించే సమయంలో పెరుగుదలకు సంబందించిన హార్మోన్స్ విడుదల అవుతాయి ఇవి పిల్లలు పెరగడానికి ఉపయోగ పడతాయి.

బేబీకి ఒక సంవత్సరం వయసు వచ్చిందంటే?

ప్రవర్తన లో మార్పులు : పిల్లల గ్రోత్ స్పర్ట్స్ సమయంలో వారిని ఎత్తుకుని ఉండాలని కోరుకుంటారు . కింద దించినవుడు ఏడుస్తారు. అలాగే చిరాకుగా మరియు అసౌకర్యంగా ఉంటారు . పెరుగుతున్నపుడు శక్తీ అంత ఖర్చు అయిపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రవర్తన మార్పులు సంభవిస్తాయి .

baby's growth at 3 months

ఈ గ్రోత్ స్పర్ట్స్ ని ఎలా ఎదుర్కోవాలి ?

తల్లిదండ్రులుగా, పిల్లల గ్రోత్ స్పర్ట్స్ అనే క్లిష్టమైన సమయం. కేవలం మీ పిల్లల్ని అనుసరించండి మరియు వారిపై ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళకి నిద్ర అవసరం అయితే బాగా నిద్రపోనివ్వండి. అలాగే సౌకర్యవంతంగా నిద్రపోవడానికి ఏర్పాట్లు చేయండి. బేబీ తల్లి పాలు లేదా ఫార్ములా (డబ్బా ) పాలు తీసుకున్నా ఇంకొంచెం ఎక్కువగా ఆహారాన్ని ఇవ్వండి.

అలాగే మీ గురించి కూడా జాగ్రత్తలు తీస్కోండి.

English summary

Baby's Growth In Months

Babies grow very fast but this growth does not happen at a steady pace. The growth occurs in spurts.
Subscribe Newsletter