పుట్టబోయే బిడ్డ మీ గొంతు వినగలదా?

By: Deepti
Subscribe to Boldsky

కాబోయే తల్లిదండ్రులు బిడ్డతో పుట్టేముందే మాట్లాడాలని ఎంతో తపిస్తారు. కడుపులో ఉన్న బిడ్డ నిజంగానే 9వ నెలలో కొన్ని శబ్దాలను గుర్తించగలదని కొత్త అధ్యయనంలో తేలింది.

పరిశోధన ప్రకారం గర్భంలోని శిశువు శబ్దాలు వినగలదు మరియు అనుకోకుండా వచ్చే శబ్దాలు, మానవ శబ్దాలకు తేడా కూడా గుర్తించగలదు.

బేబీ చిగుళ్ళ సంరక్షణ ఎలా?

కొన్ని రకాల శబ్దాలు విన్నప్పుడల్లా గర్భస్థ శిశువు గుండెవేగంలో తేడా వచ్చినట్లు తెలిసింది. అదే ఇతర కొన్ని శబ్దాలు విన్నపుడు ఏ మార్పు లేదు.

ఈ ఫలితాలతో, పుట్టుక తర్వాత ఎన్నో ఏళ్ళకి భాష, వినే నైపుణ్యం పూర్తిగా పెరిగినా, పుట్టుక ముందే దాని బీజాలు మొదలవుతాయని పరిశోధకులు తేల్చారు.

పుట్టబోయే ముందు సున్నితత్వం

పుట్టబోయే ముందు సున్నితత్వం

ఈ అధ్యయనం ప్రకారం శిశువు చెవులు వినబడే కొన్ని శబ్దాలకు ఆటోమేటిక్ గా అలవాటుపడిపోతాయి. దీన్నే పుట్టబోయే ముందు సున్నితత్వం అంటారు. నిజానికి ఇదే భవిష్యత్తులో వినికిడి శక్తి, భాషా నైపుణ్యాలకు పునాది.

పరిశోధన

పరిశోధన

ఈ అధ్యయనం ప్రకారం, పరిశోధకులు 8వ నెలలో ఉన్న20 గర్భిణీలను పరీక్షించారు. కొన్ని ప్రత్యేక శబ్దాలు విన్పించినప్పుడు శిశువు ఆ శబ్దాలను విన్నదని తెలుసుకున్నారు.

శిశువుకు శబ్దాలు విన్పిస్తాయా?

శిశువుకు శబ్దాలు విన్పిస్తాయా?

శిశువుకి మొదటగా విన్పించే శబ్దాలు శరీరం లోపలి వాతావరణానికి చెందినవి. తల్లి శరీరంలోని శబ్దాలే విన్పించే శబ్దాలవుతాయి. వీటితో పాటు, కొన్ని బయట శబ్దాలు కూడా బిడ్డ చెవులను తాకుతాయి.

చెవిలోపలి పొర వినికిడి

చెవిలోపలి పొర వినికిడి

నిజానికి ఈ శబ్దాల వల్లనే, శిశువు మెల్లిగా చెవిలోపలి పొరలను పెంపొందించుకుని తర్వాత పుట్టాక భాష నేర్చుకుంటాడని పరిశోధకులు తెలిపారు.

English summary

Can An Unborn Baby Hear Your Voice?

Expecting parents would love to talk to their baby much before the delivery. The baby in the womb can actually identify certain sounds during the 9th month
Subscribe Newsletter