Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పసి బిడ్డలకు పెట్టే ఆహారం ఎలా ఉండాలి ?
తల్లిగా మీ బిడ్డ పోషకాహారం గూర్చి మీరు చింత చెందటం సహజమే. పసివయసులో పిల్లలు ఆహారం తీసుకోవటంలో అసలు శ్రద్ధ చూపించరు.ఆ సమయంలో ఎక్కువ విశ్రాంతి లేకుండా ఉండి, తిండి విషయంలో కూడా అల్లరి చేస్తారు. మీ పిల్లలకి మరి ఏం తినిపించాలి? చిన్నబిడ్డల తల్లిదండ్రులు వారికి పోషకాలు పుష్కలంగా ఉండే ఏం పదార్థాలు పెట్టాలి అని ఆలోచిస్తుంటారు.పిల్లల విషయంలో ఆహారం గూర్చి తల్లిదండ్రులు సులభంగా తప్పుమార్గం పట్టే అవకాశం ఉంది.అందులో ఒకటి భోజనసమయంలో పిల్లలకి ఎక్కువ స్వేచ్చనివ్వటం.వారు తినకుండా తప్పించుకోటానికి మార్గాలు వెతుకుతుంటారు. అలా వారికి తినిపించటానికి వారి వెనకాల పరిగెత్తడమో ,టివిపై ఆధారపడటమో చేయాలి.

మరో చెడ్డ అలవాటు వారికి నచ్చినట్టుగా తినిపించడం. ప్రతి బిడ్డకి మిగతావారికన్నా వారికి నచ్చిన ఆహారం,విధానం ఉంటాయి.తల్లిదండ్రులు పిల్లలు అసలు తినకపోవటం కన్నా నచ్చిన పద్ధతిలో తినటం మంచిదని అదే చేస్తారు.ఇది అతిపెద్ద తప్పిదం.ఇలా చేయటం వల్ల,మీరు మీ బిడ్డకి అవసరమైన పోషకాలు ఉండే ఆహార పదార్థాలనుండి దూరం చేస్తున్నారు.మేము ఈ వ్యాసంలో మేము మీ బిడ్డకి అవసరమైన పోషకాలుండే ఆహారాలని పొందుపరిచాం.వీటి గూర్చి తెలుసుకోవడం వల్ల మీరు మీ బిడ్డకి సరైన ఆహారాన్ని అవసరమైనంత నిర్ణయించుకోగలరు.ఇదిగో ఇవే మీరు మీ బిడ్డకి తినిపించగలవి. ఇంకా తెలుసుకోడానికి చదవండి.

పిండిపదార్థాలు
మీ పిల్లలకి ప్రతీపూటా భోజనంలో పిండిపదార్థాలు ఉండేట్లా చూసుకోండి. ఇవి బంగాళదుంపలు,చామదుంపలు, అన్నం,గోధుమలు,అరటికాయలు,కంద మొదలైనవి. ఇవి చిన్నపిల్లలకు కార్బొహైడ్రేట్లు అందించి శక్తిని అందిస్తాయి. పిల్లల ఆహారం మొత్తం పీచుతో నిండిపోకుండా చూడండి. మంచిదైనా ఇది తొందరగా కడుపు నిండేట్లా చూసి ఆకలిని తగ్గించి మిగతా అవసరమైన పోషకాహారం తీసుకోకుండా చేస్తాయి.

పండ్లు మరియు కూరగాయలు
పండ్లు మరియు కూరలు మీ బిడ్డ శరీర ఎదుగుదలకు చాలా అవసరం.మీ పిల్లలు ప్రతి రుతువులో వచ్చే వివిధ పండ్లు,కూరలు తప్పనిసరిగా తినేట్లు చూడండి. మామిడి,అవకాడో,అరటిపళ్ళ వంటి వాటికి వండాల్సిన అవసరం కూడా లేదు; అదేవిధంగా దోసకాయలు, టమోటాల వంటివి కూడా నేరుగానే తీసుకోవచ్చు. ఇతర పండ్లు మరియు కూరలను ఉడికించి మీ పిల్లలకు పెట్టవచ్చు. మీ బిడ్డ మసాలాదినుసులు తినగలిగితే,మిగతా కుటుంబం తినేదే వారికీ పెట్టవచ్చు. పసిపిల్లలకి ఇది మంచి పోషకాహారాల్లో ఒకటి.

ఐరన్ ,ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం
మీ బిడ్డకి అధికంగా ప్రొటీన్లు,ఐరన్ ఉండే ఆహారం అవసరం. ధాన్యాలు,పప్పుదినుసులలో ఐరన్,ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలకు మీరు మాంసాహారం తినిపించాలనుకుంటే,అవి తాజాగా,శుభ్రంగా ఉండేట్లు చూసుకోండి. బాగా వండి అప్పుడు తినిపించండి.అనవసర నూనెలు,ఉప్పు కలిగిఉండే ప్రాసెస్డ్ మాంసాహారం నుండి దూరంగా ఉండండి.

పాలు మరియు పాల ఉత్పత్తులు
మీ పసిబిడ్డ ఇంకా తల్లిపాలు తాగుతూ ఉన్నట్లైతే , అతనికి మరే పాలఉత్పత్తుల అవసరం ఉండబోదు.కానీ మీ బిడ్డ బలహీనంగా కానీ,ఇప్పుడిప్పుడే తల్లిపాలు మానేసినట్లైతే మాత్రం పాలు,పాల ఉత్పత్తులను రోజుకి మూడుసార్లు అందివ్వండి.కానీ రోజు 400మి.లీ లకి మించిన ఉత్పత్తులు లేకుండా చూసుకోండి.దానికన్నా ఎక్కువైతే మాత్రం పాలల్లో ఉండని విటమిన్ ఎ వంటి పోషకాలు మీ బిడ్డకి అందకుండా పోతాయి.

కొవ్వు మరియు చక్కెరలు
కొవ్వుపదార్థాలు,చక్కెరలను చెడు ఆహారంగా పరిగణిస్తారు.మీ బిడ్డకి మంచి కొవ్వుపదార్థాలను,సహజ చక్కెర పదార్థాలను సరైన మోతాదులో అందివ్వటం మంచిది. వంటనూనె కూడా పరిమిత స్థాయిలో వాడటం మంచిదే. మీ పాప ఏడాది వయస్సు నిండాక చాలా తక్కువగా వెన్న,నెయ్యి తినిపించటం మంచిది.



Click it and Unblock the Notifications
