For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపులో పురుగులు ; లక్షణాలు మరియు పసిపిల్లలకి దీని చికిత్స

|

పిల్లలు తల్లిదండ్రులకు వరాల వంటివారు. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు చాలా సంతోషపడిపోయి, వారి పిల్లలను సహజంగానే నవ్వే పాపలుగా వర్ణిస్తూ పోతారు. కానీ, పిల్లలు చిరాకుగా లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు 'ఏం జరిగిందో’ అని తల్లడిల్లుతారు.

చిన్నపిల్లలకు నొప్పి లేదా అసౌకర్యంగా ఉన్నప్పుడు వెంటనే ఏడుస్తూ నవ్వటమే మానేస్తారు. నొప్పి, అసౌకర్యం రెండూ పెద్ద సమస్యలే తెస్తాయి. కొన్ని కేసుల్లో, ప్రేగుల్లో పురుగులు కూడా పసిపిల్లల్లో అసౌకర్యానికి కారణమవుతాయి.

కడుపులో పురుగులు పసిపిల్లల్లో ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు. మట్టిలో ఆడుకునే పిల్లలు నులిపురుగులు, కొంకిపురుగులు,ఎలికపాములు,టేప్ వార్మ్ మరియు కొరడాపురుగుల బారిన తరచుగా పడి ఇన్ఫెక్షన్ కి గురవుతారు.

ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, ఇన్ఫెక్షన్ ఉన్న నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి.

Intestinal Worms: Symptoms and Treatment in Toddlers

సరిగ్గా ఉడకని ఆహారం లేదా శుభ్రంగా వండని ఆహారం తినటం వలన కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. పిల్లల చుట్టూ పరిశుభ్ర వాతావరణం ఉంచకపోతే ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి.

పసిపిల్లల్లో పురుగులు ఉంటే లక్షణాలు ఏంటో తెలుసుకోడానికి చదవండి

ఈ కింద మీకు కడుపులో పురుగులు ఉండటం వల్ల మీ బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం ఎలా పడుతుందో వివరించాం. పూర్తిగా చదవండి, దీనికి చికిత్స కూడా వివరించబడింది.

పిల్లల్లో కడుపులో పురుగుల సాధారణ లక్షణాలు

పొట్ట నొప్పి

కొంచెం బరువు తగ్గటం

చిరాకు

ఆకలి లేకపోవటం

Intestinal Worms: Symptoms and Treatment in Toddlers

పిల్లల్లో నులిపురుగుల తీవ్ర లక్షణాలు

కొంకిపురుగుల వలన రక్తహీనత

మలద్వారం చుట్టూ దురద

దురద వలన నిద్రలేమి

రక్తహీనత

దద్దుర్ల వలన ర్యాషెస్

ఆగని దగ్గు

వాంతులు మరియు విరేచనాలు (వెంటనే వైద్య సాయం తప్పనిసరి)

పసిపిల్లల కడుపులో పురుగుల ప్రభావం

Intestinal Worms: Symptoms and Treatment in Toddlers

కడుపులో పురుగులు పరాన్నజీవులు. ఈ పరాన్నజీవులు విటమిన్లు మరియు ఇతర పోషకాలను మీ బిడ్డ శరీరంలోంచి లాగేస్తాయి. ఇది పోషకలోపాన్ని కలిగిస్తుంది.

పోషకలోపం ఉన్న పిల్లలు మామూలు పిల్లలకన్నా తక్కువ ఆరోగ్యంగా ఉంటారు. కడుపులో పురుగులు ఉన్న పిల్లలకి రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.

రోగనిరోధక శక్తి తగ్గటం,పోషకలోపం, రక్తహీనత అన్నీ కలిపి మీ బిడ్డ ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి.


పిల్లల్లో కడుపులోని పురుగులకి చికిత్స

కొన్ని పరీక్షలు చేసిన తర్వాతే చికిత్స మొదలుపెట్టవచ్చు. ఈ సాధారణ పరీక్షలు గోళ్ల కింద పురుగులు లేదా మురికి కోసం పరీక్ష, అతుక్కునే టేపు పరీక్ష వంటివి చేస్తారు. కొన్ని కేసులలో కాటన్ దూదితో లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేస్తారు.

Intestinal Worms: Symptoms and Treatment in Toddlers

1 నుంచి 3 ఏళ్ళ వయస్సు మధ్య పిల్లల్లో కడుపులో పురుగులకి సులభంగా చికిత్స చేయవచ్చు. పిల్లల వైద్యుడు ఏ రకపు పురుగులున్నాయో కనుగొనగానే దానికి సంబంధించిన మందులను, చికిత్సను సూచిస్తారు. ఈ చికిత్స సాధారణంగా మందులు లేదా ద్రావణాలు తీసుకోవటం వంటివే అయివుంటాయి. వైద్యుడు చికిత్స సూచించే వరకూ ఆగటం మంచిది ఎందుకంటే పురుగు రకాన్ని బట్టి మందు మారుతూ వుంటుంది.

చికిత్స జరుగుతున్నప్పుడు, తర్వాత కూడా కొన్ని సంరక్షణ చర్యలు తీసుకోవటం మంచిది. మీ బిడ్డ డైపర్ ను రోజుకు రెండు మూడు సార్లు మార్చడం ముఖ్యం. టాయిలెట్ సీటు శుభ్రంగా ఉంచడం, మీ బిడ్డ గోళ్ళు కత్తిరించడం, వారిని శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమైన పనులలో కొన్ని.

English summary

Intestinal Worms: Symptoms and Treatment in Toddlers

Intestinal worms in toddlers can be present due to many possible reasons. Children who play in soil can often be infected with thread worms, hookworms, roundworms, tapeworms and whip worms.
Desktop Bottom Promotion