For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా తల్లిదండ్రులు అయిన వారు చింతించే 7 సాధారణ విషయాలు

పిల్లలు చాలా అధ్బుతమైన మానవ రూపాలు.వాళ్ళు రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే అది కొత్త తల్లిదండ్రులని ఆశ్చర్యపరుస్తూ వాళ్ళ మొహం మీద చిన్న నవ్వును తెప్పిస్తుంది.పిల్లలని అత్యంత ప్రేమ ఇంకా జాగ్రత్తతో చూడాలి

|

పిల్లలు చాలా అధ్బుతమైన మానవ రూపాలు.వాళ్ళు రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే అది కొత్త తల్లిదండ్రులని ఆశ్చర్యపరుస్తూ వాళ్ళ మొహం మీద చిన్న నవ్వును తెప్పిస్తుంది.పిల్లలని అత్యంత ప్రేమ ఇంకా జాగ్రత్తతో చూడాలి మరియు ఏ పిల్లల్ని ఒంటరిగా ఒదిలేసి పోకూడదని ప్రతీ తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

పిల్లలకి 12 నెలలు ఒచ్చేదాకా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అప్పుడే పిల్లలు నడవటం, తమ రెండు కాళ్ళ మీద నుంచోవడం, ఏది చూస్తే అది పట్టుకోవడం చేస్తుంటారు.ఒక చిన్న పిల్ల ప్రపంచంలోకి వచ్చాక కొత్త తల్లిదండ్రులు,వాళ్ళు ఎప్పుడు తల ఎత్తుతారు లేదా ఎప్పుడు వాళ్ళకి వాళ్ళే నీళ్ళు తాగుతారు అని చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడతారు.

ఇలాంటి ప్రశ్నలు కొత్త తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ తలనొప్పి తెప్పిస్తుంటాయి.అందుకే ఇక్కడ బోల్డ్-స్కై అలాంటి సాధారణ విషయాలకు లేదా ప్రశ్నలకు ఆందోళన పడే కొత్త తల్లిదండ్రులకు సమాధానమిచ్చింది.ఇంకో పక్క ఈ ప్రశ్నల్లో మీ పిల్లలు ఎంత తొందరగా ఎదుగుతున్నారు మరియు మీరు పిల్లలకి స్వతంత్రంగా ఎదగడం ఎంత బాగా నేర్పుతున్నారు తదితరవాటి గురించి కూడా ఉంటాయి.

కనుక తల్లిదండ్రులు అందరూ మీ కంగారు,ఆందోళనలని పక్కన పెట్టి పిల్లల ఎదుగుదలలో వచ్చే సాధారణ ప్రశ్నల గురించి మీ సమయాన్ని కేటాయించి చదవండి...

మా పిల్లలు నీళ్ళు తాగడం ఎప్పుడు మొదలుపెడతారు?

మా పిల్లలు నీళ్ళు తాగడం ఎప్పుడు మొదలుపెడతారు?

పిల్లలు సాధారణంగా ఘన పదార్థాలు ఆహారంగా తినడం మొదలు పెట్టినప్పటినుంచి,అంటే మూడోనెలో, నాలుగో నెల నుంచో నీళ్ళు తాగడం మొదలుపెడతారు. చిన్న చిన్న చెంచాల చెక్కర నీళ్ళు అయితే అయిదో రోజు నుంచే ఇవ్వచ్చు.

మా పిల్లలు తల ఎప్పుడు ఎత్తుతారు?

మా పిల్లలు తల ఎప్పుడు ఎత్తుతారు?

ఎప్పుడైతే మీ పిల్లలు బోర్లా పడుతుంటారో, అప్పుడే తన చిన్న తలకాయని పిల్లలు ఎత్తుతారు.అప్పుడే పుట్టిన మీ పిల్లలు నెలో లేక కొన్ని వారాలో అయితే, వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎత్తుకోవాలి ఎందుకంటే వాళ్ళ తల బాగా సున్నితంగా ఉంటుంది.

డైపర్ రాష్ ని ఎలా నివారించాలి?

డైపర్ రాష్ ని ఎలా నివారించాలి?

కొత్తగా పుట్టిన పిల్లలో డైపర్ రాష్ చాలా సాధారణం.పాడైపోయిన డైపర్స్ నుంచి దూరంగా ఉండండి, ఎందుకంటే రాష్ కి కారణం అవే కాబట్టి.తరువాత డైపర్ రాష్ పోగొట్టడానికి ఉత్తమమైన ఇంటి చిట్కా ఏంటి అంటే, పిల్లల కింద భాగాన మరియు తొడల పైన కొబ్బరి నూనె రాయండి.

మా పిల్లలు ఎప్పుడు బోర్లాపడతారు?

మా పిల్లలు ఎప్పుడు బోర్లాపడతారు?

పుట్టిన పిల్లలు మూడో నెల పూర్తి చేసుకోని, నాలుగో నెల లోకి వచ్చినప్పుడు మీరు పిల్లలు పక్కకి బోర్లా పడటం, పక్క మీద దొర్లుతూ తల పైకి ఎత్తడం చూస్తారు.పిల్లలు రెండో నెలలో ఉన్నపుడు తల్లిదండ్రులు ప్రతీసారి పిల్లలని వాళ్ళ తలకాయ గుండ్రంగా ఉండటం కోసం ఎడమ నుంచి కుడి పక్కకి తిప్పాలి.

మా పిల్లలు గుడ్లు ఎప్పుడు తింటారు?:

మా పిల్లలు గుడ్లు ఎప్పుడు తింటారు?:

గుడ్లల్లో ఉండే ఘనమైన ప్రోటీన్లు, ఎముకలు మరియు పళ్ళ మెరుగుదలకి మంచిది.పిల్లలకి తమ 12వ నెల నుంచి గుడ్డు పెట్టచ్చు. అదే సొన అయితే తొమ్మిదవ నెల నుంచే పెట్టచ్చు.

ఎంత తరచుగా మా పిల్లలకి స్నానం చేయించాలి?

ఎంత తరచుగా మా పిల్లలకి స్నానం చేయించాలి?

రోజు మార్చి రోజు తల స్నానం, ప్రతీ రోజూ మాములు స్నానం పిల్లలకి చేయించాలి.నీళ్ళు చల్లగాను, గోరువెచ్చగాను కాకుండా వేడిగా ఉండాలి.రోజు మార్చి రోజు పిల్లలికి ఆముదం నూనెతో కానీ బాదం నూనెతో కానీ మర్దన చేయాలి, ఎందుకంటే అది పిల్లల ఎముకలు గట్టి పడటానికే కాకుండా వాళ్ళ చర్మం కాంతివంతంగా ఉంచుతుంది.

మా పిల్లలు నుంచోడానికి ఎలా సహాయపడగలము?

మా పిల్లలు నుంచోడానికి ఎలా సహాయపడగలము?

పిల్లలు వాళ్ళంతట వాళ్ళే బోర్లా పడటం మరియు పాకడం మొదలెట్టాక, మీరు వాళ్ళంతట వాళ్ళే నుంచోడం తొందరలోనే చూస్తారు.ప్రారంభ దశలో మీ పిల్లలు నడవడాన్ని తేలిక చేసేందుకు సహాయం చేయండి.మెల్లగా వాళ్ళ కాల్ల మీద సౌకర్యంగా నిలబడటం మొదలుపెట్టాక, వాళ్ళకు వాళ్ళే నడుస్తారు.

Read more about: baby pregnancy parents బేబి
English summary

7 Common Things All New Parents Worry About

Today we discuss with you some of the seven most common things all new parents talk and worry about. We think you should take a look at this read.
Desktop Bottom Promotion