For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాక్సినేషన్ సమయంలో గమనించవలసిన అంశాలేంటి?

వ్యాక్సినేషన్ పిల్లలకి మంచిదో కాదో అనే అంశంపై అనేక వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్ నిపుణుల సూచన ప్రకారం ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కొరకు ప్రతి బిడ్డకి వ్యాక్సినేషన్ చేయించాలి. దురదృష

|

వ్యాక్సినేషన్ పిల్లలకి మంచిదో కాదో అనే అంశంపై అనేక వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్ నిపుణుల సూచన ప్రకారం ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కొరకు ప్రతి బిడ్డకి వ్యాక్సినేషన్ చేయించాలి. దురదృష్టవశాత్తు, కొంతమంది తల్లిదండ్రులు ఈ సూచనని పట్టించుకోవటంలేదు.

స్మాల్ పాక్స్వంటి వ్యాధులను ప్రపంచవ్యాప్తంగా అరికట్టడంలో వాక్సిన్స్ ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే, పోలియో వంటి భీకరమైన వ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. వ్యాక్సిన్స్ ప్రభావంతో పోలియో అనేది దేశవ్యాప్తంగా నిర్మూలన దశలోనే ఉన్నాదని చెప్పుకోవచ్చు.

అందువలన, మీ బిడ్డకి సరైన సమయంలో వ్యాక్సిన్స్ ను అలాగే ఇమ్మునైజషన్ ను ఇప్పించడం మరచిపోకండి. ఇవి పాటించడం ద్వారా మీ బిడ్డకి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించి మీ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారు.

అయితే, మీ బిడ్డకి వ్యాక్సిన్ ని ఇప్పించేటప్పుడు మీరు కొన్ని విషయాలను గమనించడం ఎంతో అవసరం. ఈ రోజు, వ్యాక్సిన్స్ ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించేటప్పుడు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తల గురించి చర్చించుకుందాం. ఈ ఆర్టికల్ ని చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.,..

చెక్ అప్

చెక్ అప్

మీ బిడ్డని వాక్సినేషన్ కోసం తీసుకెళ్లినప్పుడు వైద్యుడు కొన్ని చెక్ అప్ లు చేసి మీ బిడ్డ వాక్సిన్ కి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకుంటాడు. ఎన్నో కారణాల వలన వైద్యుడు మీ బిడ్డని వాక్సినేట్ చేయడానికి సిద్ధమవకపోవచ్చు. అందుచేత, మిమ్మల్ని మరలా రమ్మని చెప్పవచ్చు.

జలుబు, జ్వరం, విరేచనాల వంటి కొన్ని ఆరోగ్యసమస్యలనేవి కొన్ని కారణాలు. అంతకు ముందిచ్చిన వాక్సిన్ వలన బిడ్డకి అస్వస్థత చేకూరిచే వాటిని దృష్టిలో పెట్టుకున్న వైద్యుడు మీ బిడ్డని ఇమ్మ్యూనైజ్ చేయడానికి సిద్ధపడకపోవచ్చు. అలెర్జిస్ కూడా కారణం కావచ్చు. మందగించిన రోగనిరోధక వ్యవస్థ, మూర్ఛ వ్యాథి, ఎయిడ్స్ మరియు హెచ్ ఐ వీ వంటివి కొన్ని ఇతర కారణాలు.

వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్

వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్

పీడియాట్రీషియన్ నియంత్రణలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. వ్యాక్సినేషన్ సమయంలో పిల్లలు అసౌకర్యానికి గురై ఏడవడం సహజం.

వ్యాక్సినేషన్ చేయించేటప్పుడు మీ బిడ్డని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఒక వేళ మీ బిడ్డని అదుపు చేయడం మీకిబ్బంది అయితే స్టాఫ్ మెంబర్ సలహా తీసుకుని వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

వాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పద్దతి

వాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పద్దతి

వాక్సిన్ ని అందించే విధానాలు అనేకం. పోలియో కిచ్చే వ్యాక్సిన్ ఓరల్ వ్యాక్సిన్. అయితే, కొన్ని రకాల వాక్సిన్లను ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తారు.

ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లలో కూడా వివిధ రకాలున్నాయి. ఆయా వ్యాక్సిన్ల బట్టి ఇంజెక్షన్ చేసే పాయింట్స్ మారతాయి. కొన్ని వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ను చేతులకి ఇస్తే మరికొన్నిటిని తొడలపై ఇస్తారు. డిఫ్థేరియా, పెరటాసిస్ మరియు తేటానస్ ( DPT) వంటి కొన్ని వ్యాక్సిన్స్ ని మిళితం చేసి ఇస్తారు.

వాక్సినేషన్ తరువాత గమనించవలసిన విషయాలు

వాక్సినేషన్ తరువాత గమనించవలసిన విషయాలు

వాక్సినేషన్ ఇచ్చిన తరువాత వైద్యులు మీ బిడ్డని పది నుంచి పదిహేను నిమిషాల వరకు గమనిస్తారు. వాక్సినేషన్ వలన అలెర్జీలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గాని కలగలేదని నిర్ధారించుకునే సమయమిది. అయితే, వాక్సినేషన్ వలన మీ బిడ్డ ఈ పాటికే జోరుగా ఏడుస్తూ ఉండవచ్చు.

మిగతా రోజంతా కూడా మీ బిడ్డ కాస్త డల్ గా ఉండవచ్చు. చిరాకుగా, అసౌకర్యంగా ఉండవచ్చు. వ్యాక్సినేషన్ తరువాత ఒక వేళ ఏమైనా తీవ్రమైన ఇబ్బందులకు మీ బిడ్డ గురైతే మీరు ఖచ్చితంగా మీ బిడ్డని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి.

వాక్సినేషన్ తరువాత సాధారణంగా కనిపించే సైడ్ ఎఫక్ట్స్

వాక్సినేషన్ తరువాత సాధారణంగా కనిపించే సైడ్ ఎఫక్ట్స్

ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి లేదా వాపు

మైల్డ్ టెంపరేచర్ లో ఫీవర్

వాంతులు మరియు వికారం

అతిసారం మరియు విరేచనాలు

సైడ్ ఎఫెక్ట్ ని గమనించగానే తీసుకోవలసిన చర్యలు

సైడ్ ఎఫెక్ట్ ని గమనించగానే తీసుకోవలసిన చర్యలు

మీ బిడ్డలో మైల్డ్ ఫీవర్ ని గమనిస్తే సాధారణంగా మీరు తీసుకునే జాగ్రత్తలు సరిపోతాయి. అయితే, హై ఫీవర్ తో పాటు మూర్ఛని గమనిస్తే మాత్రం వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరని గుర్తుంచుకోండి.

English summary

What Happens During Vaccination

Vaccination is a topic that had been embroiled in debate as to whether it is good for your baby or not. Vaccination is a topic that had been embroiled in debate as to whether it is good for your baby or not. Here are some facts.
Desktop Bottom Promotion