For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిపిల్లలచేత మంచినీళ్లు ఎప్పటి నుంచి త్రాగించవచ్చు?

|

పసిపిల్లల సంరక్షణ గురించి బంధువులు, చుట్టుపక్కలవాళ్ళు అనేక సలహాలు అందిస్తూ ఉంటారు. ఈ సలహాలన్నిటినీ వినీ వినీ మీకు ఇప్పటికే విసుగు వచ్చి ఉండవచ్చు. ఒక వ్యక్తికీ మరొక వ్యక్తికీ మధ్య అభిప్రాయాలు మారవచ్చు. మొదటి సారి తల్లైన వారికి ఈ సలహాలన్నీ కాస్త తికమకను కలిగిస్తాయి.

డీహైడ్రేషన్ సమస్యను నివారించడానికి పసిపిల్లలకు నీళ్లు ఇవ్వాలని మీకు ఇప్పటికే ఎవరినుంచైనా సలహా అంది ఉండవచ్చు. అయితే, శిశువుకి తల్లిపాల ద్వారానే తన శరీరానికి అవసరమైనంత నీరు అందుతుంది. పొడిబారిన, చాలా వేడిగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా తల్లిపాలు తాగే శిశువుకు తగినంత నీరు అందుతుంది. తల్లిపాలతో దాదాపు 88 శాతం నీరుంటుంది. అందువల్ల, వాతావరణం వేడిగా ఉన్నా కూడా మీ శిశువుకు తగినంత నీరు తల్లిపాల ద్వారా అందుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి.

నిజానికి, ఆరునెలల కంటే తక్కువ వయసున్న పిల్లల చేత నీటిని త్రాగించడం అంత మంచిది కాదు. దీనివల్ల, పసిపిల్లలు అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. అధికంగా నీటిని తాగించడం వలన వాటర్ ఇంటాక్సికేషన్ తో పాటు పోషకాహారలోపానికి చిన్నారులు గురవుతారు.

మంచినీటిని అధికంగా తీసుకున్న తరువాత ఆకలి లేకపోవడం వలన పిల్లలు తల్లిపాలను త్రాగడానికి ఆసక్తి కనబరచరు. చిన్నారుల కడుపు చాలా చిన్నది. వారికి తల్లిపాలతోనే కడుపునిండిపోతుంది. అందువలన, శిశువులచేత మంచినీళ్లను త్రాగించే ముందు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ ఆర్టికల్ ని చదవడం ద్వారా శిశువులకు మంచి నీటిని ఎప్పటి నుంచి అందించాలన్న విషయంపై మీకు స్పష్టత ఏర్పడుతుంది. చదవండి మరి....

 శిశువులకు

శిశువులకు

శిశువులకు తల్లిపాలను మించినది మరేదీ లేదు. శిశువు జన్మించిన కొన్ని రోజుల వరకూ తల్లిపాలతో లభించే కొలొస్టరుమ్ అనే పదార్ధం వారిని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

తల్లి తన శిశువుకి తాన పాలని ఎంత తరచుగా పడుతూ ఉంటే అంత తరచుగా తల్లిపాలు ఉత్పత్తి అవుతాయి. అలా, శిశువుకు అవసరమైన పోషణ లభిస్తుంది.

 శిశువు జన్మించిన మొదటి రోజు నుంచి మూడునెలల వరకు

శిశువు జన్మించిన మొదటి రోజు నుంచి మూడునెలల వరకు

శిశువుకు మూడు నెలల వయసు వచ్చే వరకు మంచినీళ్లను పట్టకూడదు. ఎక్కువగా నీటిని పట్టడం వలన ఓరల్ వాటర్ ఇంటాక్సీకేషన్ ఏర్పడి శిశువు మెదడుతో పాటు గుండెపై దుష్ప్రభావం పడుతుంది. ఎక్కువగా నీళ్లు తాగించడం వలన కడుపు నిండిన భావన కలిగి శిశువు తల్లిపాలని నిరాకరించవచ్చు.

నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు

నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు

ఈ సమయంలో నీళ్లు పట్టించడం అంత హానికరం కాకపోయినా సిఫార్సు చేయదగినది కాదు. తల్లిపాల ద్వారానే శిశువుకు అవసరమైనంత నీరు లభిస్తుంది. ఆకలిని అలాగే దాహాన్ని తీర్చే పోషకాలు తల్లిపాలతో సమృద్ధిగా లభిస్తాయి. అయితే, ఫార్ములా మిల్క్ ని త్రాగే శిశువులకు వేడి వాతావరణంలో కాస్తంత నీటిని త్రాగిస్తూ ఉండాలి.

ఆరు నెలల తరువాత

ఆరు నెలల తరువాత

ఈ దశలో రోజు మొత్తంలో శిశువు చేత అప్పుడప్పుడూ కాస్తంత నీరు త్రాగిస్తూ ఉండాలి. సాలిడ్ ఫుడ్స్ కి మీ చిన్నారి అలవాటు పడగానే పాలు లేదా నీళ్లను సాలిడ్ ఫుడ్స్ తో పాటు తక్కువ మొత్తంలో అందించాలి. అయితే, శిశువుకు ఆరునెలల వయసు వచ్చేవరకు తల్లిపాలను తప్పనిసరిగా పట్టాలి.

ఆరు నెలల కంటే తక్కువ వయసున్న శిశువులకు నీళ్లు పట్టడం వలన కలిగే దుష్ప్రభావాలు

ఆరు నెలల కంటే తక్కువ వయసున్న శిశువులకు నీళ్లు పట్టడం వలన కలిగే దుష్ప్రభావాలు

శిశువులకు ఎప్పటి నుంచి నీళ్లను పట్టాలి అనే విషయంపై మీకు స్పష్టమైన అవగాహన ఏర్పడిన తరువాత ఈ అంశాలను కూడా మీరు గ్రహించాలి. చిన్నారులకు ఎక్కువ నీటిని త్రాగించడం వలన తల్లిపాలతో లేదా ఫార్ములా మిల్క్ లో లభించే పోషకాలను వారి శరీరం పూర్తిగా గ్రహించలేదు. ఫార్ములా ఫీడ్ ని మీరు చేస్తున్నట్లైతే దానికి పాటించవలసిన పద్దతులను క్షుణ్ణంగా తెలుసుకుని పాటించాలి. సిఫార్సు చేయబడినంత నీటినే శిశువు చేత తాగించాలి.

వాటర్ ఇంటాక్సికేషన్

వాటర్ ఇంటాక్సికేషన్

ఎక్కువ నీటిని త్రాగించడం వలన వాటర్ ఇంటాక్సికేషన్ సమస్య వేధిస్తుంది. శరీరంలో ఎలెక్ట్రోలైట్ బాలన్స్ అటూ ఇటూ అయితే ఈ సమస్య ఉద్భవిస్తుంది. నీటిని ఎక్కువగా పట్టినట్లయితే వారి శరీరంలోని సోడియం గాఢత తగ్గుతుంది. తద్వారా ఎడీమా సమస్య తలెత్తుతుంది. అందువలన ఆరుమాసాల కంటే తక్కువ వయసున్న శిశువులకు మంచినీళ్లను పట్టడం మంచిది కాదు.

శిశువులకు తల్లిపాలే శ్రీరామరక్ష

శిశువులకు తల్లిపాలే శ్రీరామరక్ష

మీ శిశువుకు ఆరుమాసాల వయసు వచ్చే వరకు తల్లిపాలను తప్పనిసరిగా తాగించండి. సాధారణంగా పసిపిల్లలలో కనిపించే డయారియా, న్యుమోనియా వంటి అనేక సమస్యల వలన శిశు మరణాలు సంభవిస్తాయి. తల్లిపాలను త్రాగిచడం వలన ఈ ప్రమాదాల నుంచి మీ శిశువును రక్షించుకోవచ్చు.

ఇప్పుడు, శిశువులకు మంచినీటిని ఎప్పటి నుంచి పట్టించవచ్చో స్పష్టంగా తెలుసుకున్నారు కదూ. ఇక మీరు ఈ విషయంపై కొత్తగా తల్లైన వారికి సరైన సలహా ఇవ్వగలరు.

English summary

When Can Babies Start Drinking Water

The more often a woman breastfeeds, more will be the milk that is produced, which means more water for the baby.
Story first published:Thursday, December 7, 2017, 17:16 [IST]
Desktop Bottom Promotion