For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడే పుట్టిన పిల్లలు వేగంగా ఊపిరి తీసుకోవడం వెనుక అసలు కారణం ఇదే!

By R Vishnu Vardhan Reddy
|

పిల్లలు వేగంగా ఊపిరి తీసుకోవడం చూసి చాలా మంది తల్లిదండ్రులు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఒక ఇంట్లో ఎప్పుడైతే శిశువు జన్మిస్తుందో, ఆ సమయంలో ఆ శిశువు ఎలా ఊపిరి తీసుకుంటోంది అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. బిడ్డ పుట్టిన కొన్ని రోజుల వరకు వాళ్ళు ఎలా ఊపిరి తీసుకుంటున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యమైన విషయం.

సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులను ఒక ప్రశ్న వాళ్ళ మదిని తొలిచేస్తుంటుంది. అదేమిటంటే, ఎందుకు అప్పుడే పుట్టిన శిశువులు వేగంగా, విపరీతంగా ఊపిరి తీసుకుంటున్నారు ? మాములుగా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మాములు మనుష్యులు మరియు పిల్లల కంటే కూడా అప్పుడే పుట్టిన శిశువులలో ఊపిరి తీసుకొనే ప్రక్రియ ఒకింత విభిన్నంగా ఉంటుంది.

<strong>ఎదిగే పిల్లలకు బహు ప్రయోజనాలందించే అమృతం నెయ్యి...</strong>ఎదిగే పిల్లలకు బహు ప్రయోజనాలందించే అమృతం నెయ్యి...

అప్పుడే పుట్టిన పిల్లలు ఊపిరి చాలా వేగంగా తీసుకుంటారు. దానికి తోడు ఊపిరితీసుకునే స్వభావము కూడా కొద్దిగా అసాధారణంగా ఉంటుంది. అది చూసిన ఎవరైనా ఒకింత ఆందోళన చెందుతారు. కానీ, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అది సాధారణంగా జరిగే ప్రక్రియ అని. కానీ, విపరీతంగా ఊపిరి తీసుకోవడం అనేది కొద్దిగా అసాధారణ విషయం కావడంతో చాలా మంది కొద్దిగా ఆందోళన చెందుతుంటారు.

అప్పుడే పుట్టిన పిల్లల యొక్క ఊపిరితిత్తులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఊపిరి తీసుకునే మధ్య సమయంలో, శరీరానికి కావాల్సినంత వాయువుని పట్టి ఉంచే అంత శక్తిగాని, సామర్థ్యంగాని అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండవు. అందుచేతనే వారి యొక్క ఊపిరి తీసుకొనే స్వభావం చాలా వేగంగా మరియు విపరీతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఎప్పుడైతే శిశువు మెల్లగా పెరిగి పెద్దవారవుతుంటారో అలాంటి సమయంలో ఊపిరితిత్తులు కూడా వృద్ధి చెందడం మొదలవుతుంది మరియు వాటియొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది.

<strong>బేబీ పుడ్స్ లో బెల్లం చేర్చడం వల్ల ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..</strong>బేబీ పుడ్స్ లో బెల్లం చేర్చడం వల్ల ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..

ఏది సాధారణం ?

ఏది సాధారణం ?

అప్పుడే పుట్టిన శిశువుకి ఆరు నెలల వయస్సు గనుక ఉంటే, అటువంటి వారు నిమిషానికి 30 నుండి 60 సార్లు ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. ఆ శిశువు వయస్సు ఎప్పుడైతే 6 నెలలు దాటుతుందో అప్పుడు నిమిషానికి 24 నుండి 40 సార్లు ఊపిరి తీసుకుంటారు. ఆ శిశువు వయస్సు ఎప్పుడైతే 1 నుండి 5 సంవత్సరాల మధ్య ఉంటుందో ఆ సమయం లో నిమిషానికి 20 నుండి 30 సార్లు ఊపిరి తీసుకోవడం జరుగుతుంది.ఎప్పుడైతే పిల్లల వయస్సు 6 సంవత్సరాలకు చేరుతుందో, అప్పుడు వాళ్ళు నిమిషానికి 12 నుండి 20 సార్లు ఊపిరి తీసుకుంటారు. యుక్త వయస్సు వచ్చేసరికి ఇది మరింత తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు నిమిషానికి 12 నుండి 16 సార్లు మాత్రమే ఊపిరి తీసుకోవడం జరుగుతుంది.

శిశువు యొక్క శ్వాసక్రియ రేటు ఎలా పరీక్షించాలి ?

శిశువు యొక్క శ్వాసక్రియ రేటు ఎలా పరీక్షించాలి ?

ఇందుకోసం మీ యొక్క కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తే, అప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు. మీరు గనుక ఆ పనిని చేయాలని భావిస్తే 30 క్షణాల పాటు శ్వాసక్రియ రేటుని లెక్కించండి. ఆ తర్వాత దానిని రెట్టింపు చేయడం ద్వారా నిమిషానికి ఎంతనో తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా ఒక నిమిషానికి శిశువు యొక్క శ్వాసక్రియ రేటుని లెక్కించవచ్చు.

కానీ, మీ శిశువుకు గనుక అసాధారణ రీతిలో శ్వాసక్రియ గనుక ఉంటే, అటువంటి సందర్భంలో ఖచ్చితత్వమైన శ్వాసక్రియ రేటుని కనుక్కోలేరు. అప్పుడు శిశువుని వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లడం మంచిది.

ఎలా లెక్కించాలి ?

ఎలా లెక్కించాలి ?

మీ శిశువు యొక్క ఛాతి ఒక నిమిషం కాలంలో ఎన్ని సార్లు పైకి లేస్తుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లెక్కించండి. మీరు గనుక ఈ మార్పులను గుర్తించలేకపోయినట్లైతే, అటువంటి సందర్భంలో మీ చేతిని చాలా సౌమ్యంగా శిశువు యొక్క ఛాతీ పై పెట్టండి. ఆలా చేయడం ద్వారా ఆ శిశువు ఎన్ని సార్లు ఊపిరి తీసుకుంటున్నాడు అనే విషయం అర్ధం అవుతుంది.

ఒక నిమిష కాలంలో ఎన్ని సార్లు ఊపిరి తీసుకుంటున్నారు లెక్కించడం ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల యొక్క శ్వాసక్రియ రేటుని సులువుగా తెలుసుకోవడం జరుగుతుంది. కానీ, ఇలా చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి. మీరు లెక్కించే సమయంలో మీ చేయి శిశువుకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చూసుకోండి. ఏమరుపాటుగా ఉన్నట్లయితే, అది వారి యొక్క శ్వాసక్రియ ప్రక్రియ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎలా పరీక్షించాలి ?

ఎలా పరీక్షించాలి ?

ఒకవేళ శిశువు గనుక ఇంట్లో జన్మించినట్లైతే, అటువంటి సమయంలో పుట్టిన 5 నుండి 6 గంటల తర్వాత శ్వాసక్రియ రేటుని పరీక్షించడం మంచిది. ఒకవేళ ప్రసవం గనుక ఆసుపత్రిలో జరిగినట్లయితే అటువంటి సందర్భంలో శిశువు యొక్క శ్వాసక్రియ రేటు పరీక్షించడాన్ని వైద్యులు చూసుకుంటారు. శిశువు ఊపిరి తీసుకునే విషయమై మీరు గనుక ఆందోళన చెందుతున్నట్లైతే, అటువంటి సందర్భంలో మీరు వైద్యులను సంప్రదించి వారితో పరీక్షలు జరిపించడం మంచిది. సాధారణంగా అప్పుడే గర్భం నుండి బయటకు వచ్చిన శిశువు బయట ప్రపంచానికి అలవాటుపడటానికి కొద్దిగా సమయం పడుతుంది.

English summary

Why Babies Breathe So Fast

As a parent, you must be wondering why babies breathe so fast. When you have a new born baby at home, you tend to watch how your baby breathes. Read this!
Desktop Bottom Promotion