చంటి పిల్లలు ఏడవటం ఎందుకు మంచిదో కారణాలు చూడండి..

By: DEEPTHI
Subscribe to Boldsky

కొన్నిసార్లు, మీకు మీ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలీదు. నిజానికి, పిల్లల భాష ఏడవడమే. మీతో మీ బిడ్డ ఏదో చెప్పాలనుకుంటోంది.

మనం సాధారణంగా ఏడవడాన్ని తప్పుగా అనుకుంటాం కానీ, పసిపిల్లల విషయంలో అది అన్నిసార్లు తప్పు కాదు. కొన్నిసార్లు, ఏడ్చి వారు కావాల్సింది తెలుపుతారు మరికొన్నిసార్లు మీ లాలన కోసమే ఏడుస్తారు.

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

వైద్యనిపుణుల ప్రకారం ఏడవటం సహజమే మరియు చంటిపిల్లలపుడు అది మంచిది కూడా. పిల్లలకు ఏడవటం ఎందుకు మంచిదో కారణాలు చూడండి.

గాలి కోసం !

గాలి కోసం !

బిడ్డ భూమిపైకి రాగానే, అతను లేదా ఆమె మొదటగా ఏడుస్తారు. మొదటగా ఏడ్చిన ఏడుపు బిడ్డ ఊపిరితిత్తులు తెరుచుకోబడటానికి సాయపడతాయి. మీ బిడ్డ మొదటిసారి శ్వాస తీసుకుంటుంది ఇక మరి !

మీతో ఏదో చెప్పటానికి

మీతో ఏదో చెప్పటానికి

ఏదో మీతో సంభాషించటానికి ఏడుపు ఎంతో ఉపయోగం. మీ బిడ్డకి భాష వచ్చేముందు, మీ నుంచి ఏమన్నా కావాలంటే, మీ సాయం కావాలంటే వాడే వస్తువు ఏడుపే. నిజానికి, మీ బిడ్డకి మీ కౌగిలి, ఒడి కావాలంటే మీకు చెప్పాలంటే ఏడుపు ఒకటే మార్గం !

మౌనం అపాయకరం కావచ్చు !

మౌనం అపాయకరం కావచ్చు !

నిజానికి , మీ బిడ్డ అసలు ఏడవకపోతే మీరు భయపడాలి ! పిల్లలు అప్పుడప్పుడు ఏడవడం చాలా సహజం. మౌనంగానే ఎప్పుడూ ఉంటే, మీ బిడ్డ లోపల ఏదో ఒత్తిడి, బాధపడుతున్నట్టు లెక్క !

బిడ్డను కనడానికి మగవారికి సరైన వయస్సు ఏది?

వ్యాయామం

వ్యాయామం

నమ్మండి లేక నమ్మకండి ; ఏడుపు కూడా ఒక వ్యాయామమే ! మీ బిడ్డ ఏడ్చినప్పుడు అనేక కండరాలు సాగి, ఆ వయస్సుకి తగ్గ వ్యాయామంగా సరిపోతుంది!

హాయిని పొందటానికి !

హాయిని పొందటానికి !

ఏడవటం వల్ల మీ భావావేశాలు బయటకి పోతాయి. పసిపిల్లలకు కూడా, ఏడుపు మానసిక భావాలను బయటకి తేవడానికి ఉపయోగపడుతుంది !

English summary

Why Crying Is Good For Your Baby

Though most of us perceive crying as a bad thing, it isn't always bad as far as babies are concerned. Read on to know why crying is good for your baby.
Story first published: Friday, August 11, 2017, 13:00 [IST]
Subscribe Newsletter