For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బుజ్జాయి ఏడవడం మంచిదే ఎందుకంటే !?

By Lekhaka
|

కొన్నిసార్లు, మీ పాప ఎందుకు ఏడుస్తుందో మీకు అర్థం కాదు. నిజానికి, ఏడుపే వారి భాష. దానిద్వారా మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు.

మనలో చాలామంది ఏడవడాన్ని తప్పు విషయంగా అనుకుంటాం. కానీ పసిబిడ్డల విషయంలో అది అన్నిసార్లూ కాదు. కొన్నిసార్లు, వారికి కావాల్సింది అడగటానికి, వ్యక్తపర్చటానికి, మీ దృష్టి వారిపై ఉండేట్లా చేసుకోటానికి వారు ఏడుస్తారు.

Why Crying Is Good For Your Baby

శ్వాస కోసం మొదట !

మీ పాపాయి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వెంటనే, ఏడవటం మొదలుపెడతాడు. ఇలా మొదట ఏడ్చే సంగతి వల్ల ఆ బిడ్డలో ఊపిరితిత్తులు తెరచుకుని శ్వాస తీసుకోగలుగుతాడు. అలా మీ బిడ్డ మొదటిసారి ఊపిరి పీల్చుకుంటాడు !

Why Crying Is Good For Your Baby

మీతో సంభాషణ

ఏడవడం భావాలను వ్యక్తపర్చటంలో ఎంతో సాయపడుతుంది. మీ పాపకి భాష నేర్చుకునే ముందు మీ నుంచి ఏమన్నా కావాలన్నా, మీ సాయం అవసరం ఉన్నా ఏడుపొక్కటే ఆయుధం. నిజానికి వారికి కేవలం మిమ్మల్ని హత్తుకోవాలని ఉన్నా, అది కూడా ఏడుపు ద్వారానే తెలియచేయగలరు.

Why Crying Is Good For Your Baby

మౌనం అపాయకరం !

ఒకవేళ , మీ పాపాయి అస్సలు ఏడవకపోతేనో, మీరిక భయపడాలి! ఎందుకంటే పసిబిడ్డలు ఏడవటం చాలా సహజం. అస్సలు ఏడవని బుడతడు లోపల ఎంతో వత్తిడిని, అశాంతిని అనుభవిస్తున్నట్టు !

Why Crying Is Good For Your Baby

వ్యాయామం

నమ్మండి, నమ్మకపోండి; ఏడుపు కూడా ఒక వ్యాయామమే ! పాప ఏడవటం మొదలుపెట్టగానే , అనేక కండరాలు సంకోచవ్యాకోచాలతో అదే ఆ వయస్సుకి వ్యాయామంలా పనిచేస్తుంది !

Why Crying Is Good For Your Baby

మనశ్శాంతి కోసం !

ఏడవడం వల్ల లోపల పేరుకున్న భావోద్వేగాలు బయటకి ప్రవహించి మనసు తేలికవుతుంది. అవును, చిన్నపిల్లల్లో కూడా ఏడవటం వల్ల వారి మానసిక వత్తిడి దూరమవుతుంది !

English summary

Why Crying Is Good For Your Baby

Actually, health experts say that crying is natural and is also good during that infancy. Here are some reasons why why crying is good for babies.
Story first published:Tuesday, December 5, 2017, 13:23 [IST]
Desktop Bottom Promotion