వింటర్లో బేబీకి మసాజ్ చేయడం వల్ల ఉపయోగాలు! మసాజ్ కోసం 13 బెస్ట్ ఆయిల్స్

Written By: Mallikarjuna d
Subscribe to Boldsky

వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది, ఎండకు చాలా మంది తట్టుకోలేరు. అలాగే వింటర్ కూడా, చలికి కూడా తట్టుకోలేరు. వింటర్లో వేడి, తేమ వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలుంటే మరీ కష్టం అవుతుంది.

పసిపిల్లలు చాలా సున్నితమైన చర్మంను కలిగి ఉండటం వల్ల త్వరగా వాతావరణ మార్పలు బేబీ స్కిన్ మీద ప్రభావం చూపుతుంది. పసిపిల్లలకు సాప్ట్ స్కిన్ ఉండటం వల్ల వింటర్లో చలి తీవ్రత వల్ల, వాతావరణంలోని తేమ వల్ల సాఫ్ట్ స్కిన్ కాస్తా హార్డ్ గా మారుతుంది. పిల్లలకు సరిగా ఎండ తగలకపోగా, వింటర్ చలి తోడైతే పసిపిల్లలకు చర్మ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. పసిపిల్లల్లో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. దాంతో చలికాలంలో పసిపిల్లలకు తరచూ జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ, ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర సీజనల్ వ్యాధులు వస్తుంటాయి.

ఈ కారణాలన్నింటి వల్ల పసిపిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో బేబీకి ఆయిల్ మసాజ్ చేయాలి. బేబీ మసాజ్ ను కరెక్ట్ గా సరైన నూనెలు ఉపయోగించడం వల్ల వింటర్లో బేబీకి అనేక ఉపయోగాలుంటాయి.

13 Best Oils For Baby Massage During Winters

వింటర్ సీజన్ లో బేబీకి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల పొందే ప్రయోజనాలను ఈక్రింది విధంగా వివరించడం జరిగింది. బేబీ మసాజ్ కోసం వివిధ రకాల నూనెలు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికంటే ముందుగా బేబీకి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో తెలుసుకోవచ్చు.

పసిపిల్లలు విశ్రాంతి పొందుతారు

వింటర్ సీజన్లో పసిపిల్లలను బయటకు ఎక్కువ తీసుకెళ్ళకూడదు.అలాగని ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంచడం వల్ల పసిపిల్లలు చీకాకు చెందుతారు, మూడీగా ఉంటారు. అందువల్ల ఒక మంచి ఆయిల్ మసాజ్ వల్ల బేబీ రిలాక్స్ అవుతుంది. నిశ్శబ్దంగా ఉంటుంది.

కండరాలకు మరియు ఎముకలకు విశ్రాంతిని కలిగిస్తుంది

వింటర్ సీజన్లో పసిపిల్లలకు కూడా కండరాలు, ఎముకల పట్టివేతకు గురి అవుతాయి. అందు వల్ల ఒక మంచి మసాజ్, కాస్త ఎక్కవ సమయం మసాజ్ చేయడం వల్ల ఎలాంటి నొప్పి అయినా, కండరాల పట్టివేతైనా తగ్గుతుంది.

జీర్ణశక్తికి సహాయపడుతుంది

వింటర్ సీజల్లో ఎక్కువగా పొట్ట సమస్యలుంటాయి. పసిపిల్లలకు సున్నితమైన మసాజ్ చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి.

బెటర్ బ్లడ్ సర్క్యులేషన్

వింటర్ సీజన్లో మసాజ్ చేయడం వల్ల పసిపిల్లల్లో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

బాడీ మసాజ్ వల్ల థెరఫిటిక్ ప్రభావం ఉంటుంది

బేబీ పుట్టిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు, చాలా ముఖ్యమైన సమయం. బేబీకి అంతా కొత్తగా ఉండటం, నేర్చుకోవడానికి , ఎదుగుదలకు మంచి సమయం. బేబీలో అన్ని రకాల కదలికలు, గ్రహించే శక్తి, వినికిడి వంటి సెన్స్ ను కలిగి ఉంటారు. ఇలాంటి సమయంలో సున్నితమైన మసాజ్ వల్ల బేబీ మీద థెరఫిటిక్ ఎఫెక్ట్ ఉండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.

శరీరం వెచ్చబడుతుంది

వింటర్లో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల, బేబీకి చలి ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన ఆయిల్ మసాజ్ వల్ల బాడీలో ఉష్ణం పెరిగి, బేబీ వెచ్చగా ఉండటానికి మసాజ్ ఉపయోగపడుతుంది.

బేని నిద్రపోవడానికి సహాయపడుతుంది

వాతావరణం మరీ చల్లగా మారినప్పుడు, పసిపిల్లలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతారు. బేబి నిద్రించడానికి కొన్ని గంటల ముందు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల, బేబీ విశ్రాంతి పొంద ఘాడంగా నిద్రపోతుంది.

తల్లి మరింత దగ్గర అవుతుంది

తల్లి బిడ్డకు దగ్గర అవ్వడం ఈ సమయంలో చాలా అవసరం. రొటీన్ గా, రోజూ మసాజ్ చేయడం వల్ల తల్లిబిడ్డల మద్య బాండింగ్ ఏర్పడుతుంది.

13 Best Oils For Baby Massage During Winters

మసాజ్ ఎలా చేయాలి?

మీకు నచ్చిన మసాజ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవాలి. అది గోరువెచ్చగా చేసుకోవాలి. వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే బేబీకి బర్నింగ్ లేదా బాధించడం జరుగుతుంది.

గోరువెచ్చగా ఉన్న నూనెను కొద్దిగా చేతిలోకి తీసుకుని రెండు చేతుల్ని అప్లై అప్లై చేసుకుని, రెండుచేతుల్లో నూనె వేసి రుద్దడం వల్ల బేబికి పట్టడానికి టెంపరేచర్ కంఫర్టబుల్ గా ఉంటుంది.

ఇప్పుడు బేబీ బాడీ మొత్తానికి అప్లై చేసి సున్నితమైన మసాజ్ చేయాలి.

ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసేప్పుడు పెద్దవారికి లాగే పిల్లలకు ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. బేబి చర్మంలోనికి ఇమిడేట్లు చేస్తే చాలు..

కొన్ని నూనెలు అప్లై చేసిన తర్వాత అలాగే ఉంచవచ్చు, స్నానం లేదా కడగాల్సిన అవసరం లేదు. కొన్ని నూనెలు అలాగే ఉన్నట్లే, స్నానం చేయించేటప్పుడు సోప్ వాడితే సరిపోతుంది.

బేబీ బాడీ మీద ఆయిల్ ప్యాచెస్ లేకుండా చేసుకోవాలి. లేదంటే అలర్జీకి గురి అవుతుంది.

బేబీ వంటి మీద గాయాలు లేదా రాషెస్ ఉన్నట్లైతే ఆ ప్రదేశంలో నూనె అప్లై చేయడం మానేయాలి.

మసాజ్ కూడా బేబీ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి.

13 Best Oils For Baby Massage During Winters

వింటర్లో మసాజ్ చేయవచ్చా లేదా అన్న సందేహం ఉందా?

కొంత మంది కొత్తగా తల్లైన వారు వింటర్లో బేబీకి మసాజ్ చేయకూడదు అంటుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. వింటర్లో బేబికి మసాజ్ చేసినా ఉపయోగకరమైనదే.

వింటర్లో బేబీ బాడీ మసాజ్ కు ఎంపిక చేసుకోవల్సిన బెస్ట్ ఆయిల్స్

1. బాదం ఆయిల్

1. బాదం ఆయిల్

బాదం నూనెలో విటమిన్ ఇ , ఉంటుంది, అందువల్ల బేబీకి వింటర్లో మసాజ్ చేయడానికి ఇది ఒక ఉత్తమ నూనె. ఇది బేబీ రిలాక్స్ అవ్వడానికి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. స్వచ్చమైన నూనెను తీసుకోవడం మంచిది.

2.ఆవనూనె

2.ఆవనూనె

ఆవనూనెను నార్త్ ఇండియాలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది ఒక రకమైన వాసన ఉంటుంది , మరియు చర్మానికి చీకాకు కలిగిస్తుంది. అందువల్ల , మరో నూనెతో మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఆవ నూనె వింటర్ సీజన్లో ఉపయోగించడం మంచిది. ఇది శరీరాన్ని గోరువెచ్చగా ఉంచుతుంది. బేబీ బాడీలో వ్యాధినిరోధకతను పెంచుతుంది.

3. చమోమెలీ నూనె

3. చమోమెలీ నూనె

చమోమెలీ నూనె బేబీలకు గ్రేట్ మసాజ్ ఆయిల్ ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి మంచిది. ఇది కోలిక్ తో బాధపడే బేబీ స్కిన్ ను స్మూత్ గా మార్చుతుంది.కోలిక్ సాధారణంగా మనం వింటర్లో చూస్తుంటారు. ఇది ఒక ఉత్తమమైన నూనె. వింటర్లో ఈ నూనెను ఉపయోగించడం ఉత్తమమైనది.

4. ఆలివ్ ఆయిల్

4. ఆలివ్ ఆయిల్

మసాజ్ కు ఆలివ్ ఆయిల్ పాపులర్ అయినది. బేబీ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని తరచూ ఆవనూనెతో కలిపిఉపయోగించడం వల్ల వాసను తగ్గిస్తుంది. బేబీ స్కిన్ రాషెస్ మరియు ఇతర చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లేతే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించకపోవడం మంచిది.

5. టీ ట్రీ ఆయిల్

5. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ తో బేబి బాడీకి మసాజ్ చేయడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది, బేబీ ఆయిల్లో మంచి యాంటీసెప్టిక్ లక్షణాలున్నాయి. ఇది వింటర్లో పసిపిల్లకు సాదారణంగా వచ్చే చర్మ వ్యాధులను నివారించడానికి , అలర్జీలను తగ్గించడానికి సహాయపడుతుంది.

6. ఆముదం నూనె

6. ఆముదం నూనె

ఈ నూనె పొడిబారిన, పగిలిన చర్మానికి మంచిది, ముఖ్యంగా వింటర్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చర్మంతో పాటు, జుట్టు మరియు గోళ్ళకు కూడా అప్లై చేయవచ్చు

7. సన్ ఫ్లవర్ ఆయిల్

7. సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్ లైట్ గా ఉంటుంది, ఇది చర్మంలోకి చాలా సులభంగా ఇంకిపోతుంది, ఈనూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇంకా ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వల్ల వింటర్ లో బేబీ చర్మానికి కావల్సిన పోషణను అందిస్తుంది.

8. క్యాలెండులా నూనె

8. క్యాలెండులా నూనె

క్యాలెండులా నూనె చాలా తేలికగా ఉంటుంది. ఇది కూడా బేబీ చర్మంలోకి తేలికా ఇంకుతుంది. ఈ నూనెను అప్లై చేసి అలాగే వదిలేయవచ్చు. ఇది వింటర్లో బేబీ స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. బేబీ స్కిన్ స్మూత్ గా మారడం వల్ల రిలాక్స్ చేస్తుంది.

9. నువ్వుల నూనె

9. నువ్వుల నూనె

నువ్వులను నూనె ఇండియాలో ఎక్కువగా మసాజ్ కు ఉపయోగిస్తుంటారు. దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువ వాడుతారు. ఇది వింటర్లో బేబీ ఆరోగ్యానికి చాలా మంచిది. నల్ల నువ్వుల నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.

10. నెయ్యి

10. నెయ్యి

నెయ్యిలో విటమిన్ ఎ, డి మరియు ఇ లున్నాయి. నెయ్యిని ఉపయోగించడం వల్ల బేబీ శరీరం వెచ్చగా ఉంటుంది. బేబీ మూడ్ బాగుంటుంది

11.వెజిటేబుల్ ఆయిల్

11.వెజిటేబుల్ ఆయిల్

వెజిటేబుల్ ఆయిల్ తేలికగా ఉంటుంది, ఈ సీజన్లో మసాజ్ చేయడానికి సహాయపడుతుంది. వెజిటేబుల్ నూనెతో మసాజ్ చేయడం వల్ల బేబీ రిలాక్స్ అవుతుంది. వింటర్లో బేబీ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

12. కొబ్బరి నూనె

12. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె తేలికగా ఉంటుంది. ఇది చర్మంలోకి త్వరగా ఇంకుతుంది. వింటర్లో బాడీ మసాజ్ కు అద్భుతమైన నూనె. ఇది జిడ్డుగా అనిపించదు, బేబీ చర్మానికి అప్లై చేసి అలాగే ఉంచవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

13. ఆయుర్వేద నూనె

13. ఆయుర్వేద నూనె

ఆయుర్వేదిక్ బేబీ మసాజ్ ఆయిల్ బహు ప్రయోజనాలు కలిగినది, ఇతర నూనెలతో పోల్చితే ఆయుర్వేద నూనెలో కొన్నిన్యాచురల్ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. ఈ నూనె వింటర్లో బేబీని వెచ్చగా ఉంచుతుంది, వ్యాధినిరోధకత పెంచుతుంది.

English summary

13 Best Oils For Baby Massage During Winters

13 Best Oils For Baby Massage During Winter. Today, we shall look at the benefits of giving your baby an oil massage during the winter months. We shall also talk about the various oils that are best for baby massages during the winter. Read on to know more.
Subscribe Newsletter