For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసి పిల్లలలో వాంతులు ప్రమాదకరమా? కాదా?

|

ఒక తల్లిగా ప్రతి విషయంలో, మీ బిడ్డ అత్యుత్తమమైనది పొందాలని మీరు అనుకుంటారు. మీ శిశువుకు ఏ విధమైన శారీరక సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే,అది మీకు అమితమైన బాధను కలిగిస్తుంది. ఆ సమస్యను నుండి వారిని దూరంగా ఉంచడానికి మీకు చేతనైన ప్రతి పనిని చేస్తారు. ఇదే మాతృత్వ వాత్సల్యం అంటే! సాధారణంగా పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులలో, వాంతులు ఒకటి. చాలా తరచుగా, నవజాత శిశువులు వాంతి చేసుకోవడం మనం చూస్తుంటాము.

ఈ పరిస్థితి కొన్ని వారాలు లేదా నెలలు వరకు కొనసాగవచ్చు. పెద్దవారికి వాంతులను ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా భావిస్తారు కనుక, పిల్లల విషయంలో కూడా వారి ఆలోచనలు అదే విధంగా సాగుతాయి.

Baby Vomiting: Whats Normal And Whats Not

అయితే, వాస్తవానికి వాంతులనేవి, పెద్దల విషయంలో ఇబ్బందికరమైనంతగా, పిల్లల విషయంలో కావు. అనేది మీరు మరియు నా లాంటి వ్యక్తుల కంటే చాలా సందర్భాలలో, మీ పిల్లలు వాంతులు చేసుకున్నప్పుడు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో, వాంతి నిజానికి ఇంకేదో సమస్యకు సంకేతం కావచ్చు. ఈ వ్యాసం ద్వారా, మీరు మీ పిల్లలకి వాంతులు అవుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటి గురించి చెబుతుంది.

అసలు పసి పిల్లలు ఎందుకు వాంతి చేసుకుంటారు?

అసలు పసి పిల్లలు ఎందుకు వాంతి చేసుకుంటారు?

చాలా ఇతర విషయాలు వలే, వాంతులు కూడా శరీరం యొక్క సహజ ప్రతిచర్యలలో ఒకటి. శిశువుల విషయంలో కూడా ఇది వాస్తవం. ఒక శిశువు యొక్క కడుపు పూర్తిగా నిండినప్పుడు, ఆహారంతో పాటు జీర్ణ ఆమ్లాలు కూడా అతని ఆహార నాళం పై వైపుగా కదిలి, వాంతికి కారణమవుతాయి.

శిశువుకు కొన్నిసార్లు ఎక్కిళ్ళు కూడా రావచ్చు. వీటి వలన కూడా వాంతి అయ్యే అవకాశం ఉంది. ఒక పిల్లవాడికి వాంతులు అవ్వడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయి. వారిలో కొన్ని ఆరోగ్య సమస్యల వలన కావచ్చు, కానీ వాటిలో ఎక్కువ భాగం ప్రమాదకరం కానివే ఉంటాయి.

కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పుడుతున్నప్పుడు:

కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పుడుతున్నప్పుడు:

పసి పిల్లలు ఎవరైనా, పరిపూర్ణ పరిజ్ఞానం(తినే విషయంతో సహా)తో జన్మించరని గ్రహించడం చాలా ముఖ్యం. అందువల్ల వారి శరీరం, కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పడటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అటువంటి దశలలో, మీ శిశువు ఆహారానికి ఇమడ్చుకోలేక వాంతులు చేసుకోవచ్చు. కొందరు పాలు అధిక పరిమాణంలో తాగడం వలన కూడా వాంతులయ్యే అవకాశం పెరుగుతుంది.

ఈ రకమైన వాంతి గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో, చిన్న పిల్లలను వాంతి చేసేటప్పుడు భయపడవచ్చు. వాంతి చేసేటప్పుడు వారు ఎడవవచ్చు. ఇలా సాధారణంగా జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఒక నెల లోపలే ఇటువంటి సమస్యలు ఉంటే పరిష్కరించబడతాయి.

కారు ప్రయాణం వలన అనారోగ్యం:

కారు ప్రయాణం వలన అనారోగ్యం:

పెద్దలయినా కూడా, గతుకులు లేదా ఎక్కువగా వంపులు ఉన్న మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కుదుపుల వలన అనారోగ్యానికి గురవుతారు. అయితే, పిల్లల విషయంలో, ఇది చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ప్రయాణిస్తున్నప్పుడు మీ బిడ్డకు కూడా, వాంతులు వచ్చే అవకాశం ఉందని మీరు అర్ధం చేసుకోండి. కానీ, వయస్సు పెరిగేకొద్దీ, ఈ పరిస్థితి తొలగిపోతుంది.

గుక్కపట్టి ఏడవటం:

గుక్కపట్టి ఏడవటం:

మీ పిల్లవాడు అదేపనిగా ఏడుస్తూ, మిమ్మల్ని కలత చెందేట్టు చేస్తుంటే, మీరు ఒక్కసారిగా కంగారుకు లోనవుతారు. ఏడుపు లేదా దగ్గు తెరలు తెరలుగా వస్తూ, వాటితో పాటుగా వాంతి అయితే, పిల్లల శరీరం మీద చాలా ఒత్తిడి పడుతుంది. దానిని తెలపడానికి వారికి తెలిసిన ఏకైక మార్గం, ఏడుస్తూ ఉండటం.

అయితే, ఇక్కడ మీరు ఎక్కువగా ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో, వారు ఆరు గంటల లోపలే ఉపశమనం పొంది ఏడుపును ఆపేస్తారు . అందువలన, ఇది మీ చిన్నారికి ఏ విధంగా కూడా దీర్ఘకాలిక ఆరోగ్య నష్టం కలిగించదు.

అసాధారణ వాంతులు అంటే ఏమిటి?

అసాధారణ వాంతులు అంటే ఏమిటి?

• ఆహార అలెర్జీ:

ఇది సాధారణ ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టిన పిల్లలలో సాధారణంగా కనిపించే ఒక పరిస్థితి. ఎదో ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని తిన్నప్పుడు, వారు అలర్జీకి గురవుతాయి. అటువంటి పరిస్థితిలో, అలెర్జీ మూలంగా కలిగే ప్రతిచర్యలలో వాంతులు ఒకటి.

అలెర్జీలకు కారణమైన పదార్థాన్నీ మీరు గుర్తించినట్లయితే, మీ బిడ్డ ఆహారం నుండి ఆ పదార్ధాన్ని తొలగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. మీరు ఖచ్చితమైన పదార్ధాన్ని గుర్తించలేక పోయినప్పటికీ, మీరు అలెర్జీ లక్షణాల గురించి మీ వైద్యుడికి తప్పక తెలియజేయండి.

వాంతిలో రక్తం లేదా పైత్య రసం ఉండటం:

వాంతిలో రక్తం లేదా పైత్య రసం ఉండటం:

ఒకసారి లేదా రెండుసార్లు వాంతిలోని కొన్ని చుక్కలు రక్తం లేదా పైత్య రసం ఉండటం నిజంగా ప్రమాదకరం కాదు. అయితే, మీ శిశువు ఎక్కువగా రక్తం లేదా పైత్య రసం కక్కుతున్నట్లైతే, వెంటనే మీ వైద్యుని సంప్రదించాలి. ఇది ప్రమాదకర సంకేతం కావచ్చు.

ఒక శిశువు యొక్క వాంతిలో ఆకుపచ్చని పైత్య రసం ఉన్నట్లైతే, అది వారి ప్రేగులకు ఎదో అడ్డు పడుతోంది అని అర్థం. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు త్వరగా చికిత్స అందివ్వకపోతే, ప్రాణాంతకం కావచ్చు.

డీహైడ్రేషన్:

డీహైడ్రేషన్:

వాంతి అనేది శిశువులో డీహైడ్రేషన్ యొక్క తొలి సంకేతాలలో ఒకటి. వాంతులు అవుతున్నప్పుడు, కన్నీళ్లు రాకపోవడం, చర్మం బిగుతు కోల్పోయి సాగడం మరియు నోరు పొడిబారటం వంటి ఇతర పరిస్థితులు కూడా ఉంటే, ఇది మీ బిడ్డ శరీరంలో డీహైడ్రేషన్ కలగటం వలన కావచ్చు.

ఒక రోజులో మీ బిడ్డ 6 కన్నా తక్కువ న్యాపీలను తడపడం, కూడా ఈ పరిస్థితిని తెలిపే మరొక సాధారణ లక్షణం. పిల్లలు లో డీహైడ్రేషన్ తీవ్రమైతే, ప్రాణాంతకంగా మారవచ్చు. మీరు ఈ లక్షణాలను పిల్లలలో గమనించినట్లయితే, వెంటనే మీ శిశువైద్యుని సంప్రదించడం ఉత్తమం.

ఇప్పుడు మీకు, ఈ విషయంలో అవసరమైన సంపూర్ణ జ్ఞానం లభించింది కనుక, మీ పసివారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు వారిని ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి కొంతమేరకు మీరు సంసిద్ధం అయినట్లే!

English summary

Baby Vomiting: What's Normal And What's Not

There are several reasons as to why a child might vomit. As a parent, in most cases, you don't have to worry since vomiting occurs due to acid refluxes. It could also be due to food allergies to particular food items. Make sure to identify the food and cause and avoid giving your child such food items.
Story first published: Monday, August 20, 2018, 12:40 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more