పాపాయికి ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఫీడింగ్ ఇవ్వవచ్చా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

సరిగ్గా ఎదిగిన హ్యూమన్ బీయింగ్ కి వర్కింగ్ నమూనాగా పాపాయిని పేర్కొనవచ్చు. చిన్నారి పాప మ్యానరిజమ్స్ తో పాటు గెస్చర్స్ అనేవి చాలా క్యూట్ గా ఉంటాయి. చిన్నపాపకి ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఆమె తల్లి ఎక్కువగా అలసిపోతుంది. పాపాయిలో ఏ చిన్న మాత్రం తేడా కనిపించినా తల్లి హృదయం కలత చెందుతుంది. ఎక్కువగా ఆందోళన పడుతుంది. చిన్నారి పాపలోని ప్రతి కదలిక చుట్టూ ఉన్నవారిని కదిలిస్తుంది. పాపాయి కదలిక సంతోషంతో కూడినదైతే చుట్టూ ఉన్నవారు ఆనందంలో తేలియాడుతారు. ఒకవేళ పాపాయి కదలికలో అనారోగ్య సూచనలు కనిపిస్తే చుట్టూ వాతావరణం డల్ గా మారిపోతుంది.

ఈ ఆర్టికల్ అనేది పిల్లలకు ఎక్కిళ్ళు వస్తున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తుంది. శిశువు జన్మించక ముందు నుంచే అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఎక్కిళ్ళు ప్రారంభం అవుతాయి. ఆరో నెల గర్భంలో పిల్లల లంగ్స్ అనేవి పూర్తిగా ఎదుగుతాయి. మీ పొత్తికడుపులో మీకు తెలిసే చిన్న చిన్న పాపాయి కదలికలో చాలా మటుకు ఎక్కిళ్ళకు సంబంధించినవే అయుండుంటాయి.

Can You Feed A Baby When He Has Hiccups?

తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపాయికి ఎక్కువగా ఎక్కిళ్ళు వస్తే పుట్టిన తరువాత కొన్ని నెలల వరకు పాపాయికి మరింత ఎక్కువగా ఎక్కిళ్ళు వచ్చే సూచనలు గలవు. ఒకవేళ గర్భంలో ఉండగా పాపాయికి ఎక్కిళ్ళు రాకపోయినా బయటకు వచ్చిన తరువాత ఎక్కిళ్ళు వస్తాయి. నిజానికి, ఎక్కిళ్ళు అనేవి సాధారణమైనవి. అంతగా, కంగారు పడేంత విషయం కాదు.

ఎక్కిళ్ల మధ్యలో పాపాయికి ఫీడింగ్

పాపాయికి విపరీతంగా ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా మీరు గమనించారా? గమనిస్తే, అనేక కారణాలు కనిపిస్తాయి. ప్రత్యేకించి ఇదీ కారణమని మనం చెప్పుకోలేము. పెద్దవాళ్ళ లాగా పిల్లల ఎక్కిళ్ళలో ప్రత్యేకమైన కారణాలు ఉండవు. వివిధ థియరీల ప్రకారం ఎక్కిళ్లనేవి డయాఫ్రామ్ సాధారణ కాంట్రక్షన్ వలన మరియు వోకల్ కార్డ్స్ రాపిడ్ గా క్లోజ్ అవడం వలన తలెత్తుతాయి.

సడెన్ గా వోకల్ కార్డ్స్ క్లోస్ అవడం వలన ఎక్కిళ్ళు వస్తే ఇది సాధారణ విషయమే. దీని గురించి అంత కంగారు పడవలసిన అవసరం లేదు. పొట్టలో ఫీడింగ్ సమయంలో అదనపు ఎయిర్ ట్రాప్ అయితే కూడా ఎక్కిళ్లు వస్తాయి.

పిల్లల ముసిముసి నవ్వులు కూడా ఎక్కిళ్ళకు కారణమే. ఇది కాస్తంత చికాకు పరిచే విషయమే. పాపాయి కూడా ఎక్కిళ్ల వలన అసౌకర్యానికి గురవుతుంది. అందువలన, ఈ సమస్యను మనం సాల్వ్ చేసే విషయంలో ఆలోచన చేయాలి. పాపాయి ఎక్కిళ్ల వలన అసౌకర్యానికి గురికాకుండా మనం చూసుకోవాలి.

అవును, పిల్లలకు ఎక్కిళ్ళు అనేవి కాస్త కొత్తగా అనిపించి వారు ఆశ్చర్యానికి గురి కావచ్చు. పిల్లలను ఈ విషయంలో సాంత్వనకు గురిచేసేందుకు మన ప్రయత్నాలు మనం చేయాలి. వివిధ పద్దతులను అనుసరించి పిల్లలకు అసౌకర్యాన్ని తగ్గించాలి. పిల్లలకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కంగారును గురి కాకుండా మీరు చేయవలసిన విషయంపై మీకు అవగాహన ఉండాలి.

Can You Feed A Baby When He Has Hiccups?

ఫీడింగ్ సమయంలో ఎక్కిళ్ళు వస్తే పాపాయికి తేనుపు వచ్చేలా చూడండి. తద్వారా, అదనపు గాలి పాపాయి పొట్టలోంచి బయటకు వస్తుంది. ఆ విధంగా ఫీడింగ్ నుంచి బ్రేక్ ఇచ్చి పాపాయికి తేనుపు వచ్చేలా చూడండి. ఇలా చేస్తే పాపాయి కుదుటపడుతుంది.

అమెరికన్ అకాడెమీ ఆఫ్ పిడియాట్రిక్స్ సూచనల ప్రకారం బాటిల్ ఫెడ్ బేబీ ప్రతి రెండు లేదా మూడు ఔన్స్ ల పాలు తాగగానే పాపాయికి తేనుపు వచ్చేలా చూడాలి. ఫీడింగ్ కి ముందు ఫీడింగ్ తరువాత పాపాయికి తేనుపు వచ్చేలా చూడాలి.

బ్రెస్ట్ ఫెడ్ బేబీకి మీరు బ్రెస్ట్స్ ని స్విచ్ చేసే మధ్యలో తేనుపు తేవాలి. ఫీడింగ్ మధ్యలో పాపాయికి ఎక్కిళ్ళు వస్తే ఫీడింగ్ ను ఆపి పాపాయి వీపును మెల్లిగా తట్టాలి. గట్టిగా తట్టకూడదని గుర్తుంచుకోండి.

ఈ తేనుపు టెక్నీక్స్ తో అన్నిరకాల ఎక్కిళ్ళను ఆపలేము. ఎక్కిళ్ళు అలాగే కంటిన్యూ ఐతే ఫీడింగ్ రొటీన్ ని మార్చుకోండి. పాపాయికి పొట్టనిండా ఫీడింగ్ ఇచ్చే బదులు తక్కువ మోతాదులో ఫీడింగ్స్ ను ఇవ్వండి. ఫీడింగ్స్ కి మధ్యలో బ్రేక్స్ ఇవ్వండి. ఒకేసారి ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వకండి. ఇలా చేయడం వలన పాపాయి గాలి ఎక్కువగా పీల్చుకోదు. ః

Can You Feed A Baby When He Has Hiccups?

ఫీడింగ్ మధ్యలో ఎక్కిళ్ళు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు

బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఎక్కిళ్ళను ఆపగలిగే తల్లులు కూడా ఉన్నారు. ఎక్కిళ్ళు వస్తే మనం నీళ్లు ఎలా తీసుకుంటామో అదే విధంగా పాపాయికి ఎక్కిళ్ళు వస్తే వారికి బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఎక్కిళ్ళను తగ్గించవచ్చని వారు నమ్ముతారు.

మీకు తెలిసిన వారికి పిల్లలకు ఫీడింగ్ మధ్యలో ఎక్కిళ్లు గురించి సలహా అడిగితే వారి నుంచి ఫీడింగ్ ని కంటిన్యూ చేయమన్న సలహా మీకు అందవచ్చు. పిల్లల ఎపిగ్లాటిస్ అనేది ఎక్కిళ్ళు స్టార్ట్ అయినప్పుడు లంగ్స్ లోని పాల ఎంట్రీని కవర్ చేయడం వలన పాలు లంగ్స్ లోకి పూర్తిగా వెళ్లవు. అందువలన, పాపాయి, మిల్క్ ను తీసుకోలేదు.

పాపాయికి తీవ్రమైన అసౌకర్యం కలగనంత వరకు ఈ ఎక్కిళ్ల గురించి మీరు చింతించనవసరం లేదు. అయినా ఎక్కిళ్ల నుంచి మీ పాపాయికి ఉపశమనం అందించాలంటే మీ పాపాయికి తాగడానికి ఏదైనా ఇవ్వండి. బ్రెస్ట్ మిల్క్ అయినా కానివ్వండి నీళ్లు కానివ్వండి ఏదైనా తాగడానికి ఇస్తే పాపాయి కుదుటపడింది. అయితే, ఈ సమస్యకి ఇదే పరిష్కారం అన్నివేళలా పనిచేయదు. ఒకవేళ పనిచేస్తే ఫీడింగ్ సమయంలో పాపాయికి ఎక్కిళ్ళు రావు.

ఎక్కిళ్ళను ఆపడానికి మరో మార్గం ఏంటంటే ఎక్కిళ్ళను అడ్డుకోకపోవడం. వాటంతటవే కొద్దిసేపటికి తగ్గిపోతాయి.

అందువలన, ఎక్కిళ్లు విషయంలో ఎక్కువ చింత పెట్టుకొనవసరం లేదు. రిలాక్స్ అయి పాపాయిని గమనించండి.

English summary

Can You Feed A Baby When He Has Hiccups?

Can You Feed A Baby When He Has Hiccups? ,A baby is the like the working model of every fully grown human being. The little one would have all our mannerisms and gestures - only more cuter. Whenever a baby hiccups, it's the mother who gets more restless, not the baby. For every tiny baby movement, the people around th
Story first published: Saturday, March 24, 2018, 13:00 [IST]