మీ చిన్నారి పాదాలకు బలాన్ని చేకూర్చే కొన్ని ఆహారపదార్థాలు

Subscribe to Boldsky

మీ చిన్నారి ప్రపంచంలోకి రాగానే తన ముద్దు ముద్దు పాదాలలో అలాగే చిన్ని చిన్ని వేళ్ళలో మీకు ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. మీ చిన్నారి యొక్క లేలేత గులాబీ రంగు పాదాలు ఎంతో అందంగా అలాగే ఆకర్షణీయంగా ఉంటూ మిమ్మల్ని అబ్బురపరుస్తాయి .

చిన్నారి జన్మించినప్పటి నుంచి తల్లి తన చిన్నారిని తీర్చిదిద్దే పనిలో నిమగ్నమవుతుంది. చిన్నారి జీవితం యొక్క ప్రయాణం బంగారు బాటలో సాగాలని తల్లి తపిస్తూ అందుకు తగిన విధంగా చిన్నారికి వివిధ శిక్షణలు ఇస్తూ ఉంటుంది. పాదాలనేవి శరీరంలోని ముఖ్యమైనవి.

foods that strengthen baby's feet

చిన్నారి వెల్లకిలా పడుకుని కాళ్ళని ఆడిస్తూ ఉంటుంది. చిన్నారి ప్రాకుతున్నప్పుడు, బుడి బుడి అడుగులు వేస్తున్నప్పుడు కాళ్ళకి అలాగే పాదాలకి బలం చేకూరుతుంది.

వివిధ రకాల అంశాలు పాదాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. వ్యాయామాలు, మసాజులు అలాగే సరైన పాదరక్షకలను ధరించడం వంటివి పాదాల ఆరోగ్యాన్ని సంరక్షించే కొన్ని అంశాలు.

ఆహారం మరియు పోషణ అనేవి పాదాల ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. సరైన పోషక ఆహారం లభించడం ద్వారా ఎముకలు అలాగే కండరాలు దృఢత్వాన్ని పొందుతాయి.

ఈ రోజు, చిన్నారి పాదాలను దృఢపరిచేందుకు సహకరించే కొన్ని ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ని చదివి ఆ వివరాలను తెలుసుకోండి.

డైరీ ప్రాడక్ట్స్

డైరీ ప్రాడక్ట్స్

పాలతో పాటు ఛీజ్, బటర్, యోగర్ట్ వంటి మరికొన్ని పాల ఉత్పత్తులు చిన్నారుల రోజువారి డైట్ లో తప్పనిసరిగా ఉండాలి. కేల్షియం సమృద్ధిగా లభించే డైరీ ప్రాడక్ట్స్ ను చిన్నారికి ఇవ్వడం ద్వారా వారి ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. ఈ పదార్థాలలో తగిన మోతాదులో ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఇది, కండరాల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇందులో లభించే మరికొన్ని విటమిన్ల వలన పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

కూరగాయలు

కూరగాయలు

చిన్నారి పాదాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే కూరగాయలను చిన్నారి డైట్ లో ముఖ్యభాగంగా చేయాలి. కేల్షియంతో పాటు ఫైబర్ అధికంగా ఉండే కూరగాయల్ని చిన్నారి డైట్ లో భాగమయ్యేలా చేయండి. బ్రొకోలీ, స్పినాచ్, స్వీట్ పొటాటోస్, బీన్స్ వంటివి కేల్షియం కంటెంట్ ప్రధానంగా కలిగిన కొన్ని కూరగాయలు. కూరగాయల్ని తినడానికి చిన్నారి నిరాకరిస్తే, కూరగాయల్ని ప్యూరీగా చేసి సూప్స్ తయారుచేసి చిన్నారులకు పూరీ చపాతీలలో కలిపి అందివ్వండి.

ఫోర్టిఫైడ్ సోయ్ మిల్క్

ఫోర్టిఫైడ్ సోయ్ మిల్క్

సోయా బీన్స్ నుంచి తీసుకోబడిన పాలను ఫోర్టిఫైడ్ సోయ్ మిల్క్ అనంటారు. ఈ పాలలో విటమిన్ డి తో పాటు కేల్షియం అనేది అధికంగా ఉంటుంది. ఈ పాలలో ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. తద్వారా, కండరాల ఆరోగ్యం మెరుగవుతుంది. మీ చిన్నారి గనక లాక్టోస్ ఇంటాలరెంట్ అయి ఆవు పాలను తీసుకోలేకపోతే సొయా మిల్క్ అనేది చక్కటి ప్రత్యామ్నాయం.

లెంటిల్స్

లెంటిల్స్

పప్పులు, సొయా బీన్స్, బఠాణి, చిక్ పీస్, అలాగే కిడ్నీ బీన్స్ వంటివి ఆరోగ్యానికి మంచివి. వీటన్నిటిలో కేల్షియం అనేది సమృద్ధిగా లభిస్తుంది. చిన్నారి డైట్ లో వీటిని చేర్చితే ఎంతో మంచిది. వీటిలో ప్రోటీన్ కూడా లభించడం వలన చిన్నారి ఆరోగ్యానికి సరైన పోషకాలు లభిస్తాయి. మీరు శాఖాహారులైతే, వీటిని కచ్చితంగా మీ చిన్నారి డైట్ లో భాగంగా చేయడం ద్వారా పోషకాహార లేమిని తగ్గించుకున్నవారవుతారు.

నారింజలు

నారింజలు

నారింజలో కేల్షియం అధికంగా లభిస్తుంది. కాల్షియమ్ ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ అనేది మార్కెట్ లో విరివిగా లభిస్తుంది. లాక్టోస్ ఇంటాలరెంట్ అవడం చేత ఆవు పాలను తీసుకోవడం నిరాకరించే చిన్నారులు సోయా మిల్క్ ను కూడా ఇష్టపడకపోతే వారికి కాల్షియమ్ ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ని అందిస్తారు. ఈ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. శరీరానికి తగినంత కేల్షియాన్ని అందించేందుకు ఈ విటమిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

సెరెల్స్

సెరెల్స్

మన దేశంలో చాలామంది తృణధాన్యాలను ముఖ్యఅహారంగా తీసుకుంటారు. రాగి అనేది కేల్షియం సమృద్ధిగా లభించే ధాన్యం. నాలుగు నెలల వయసునుంచి శిశువులకు రాగిని ఆహారంలో భాగంగా అందిస్తూ ఉంటారు. అలాగే, బ్రౌన్ రైస్ అనేది కూడా కేల్షియంతో పాటు ఫైబర్ అధికంగా లభించే ఆహారం. ఇవన్నీ, కాళ్ళను ధృడంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

నట్స్

నట్స్

నట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తో పాటు కేల్షియం లభిస్తుంది. ఇవన్నీ కాళ్ళను అలాగే పాదాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అయితే, నట్స్ ని చిన్నారులు సరిగ్గా తినలేకపోవచ్చు. అందువలన, వీటిని పొడిలా చేసుకుని చిన్నారులకు అందించే పాలలో అలాగే సూప్స్ లో కలిపితే వారికి తగినంత పోషణ లభిస్తుంది.

టోఫు

టోఫు

టోఫు అనేది పనీర్ వంటి పదార్థం. పనీర్ కు అలాగే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ కి ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకుంటారు. కేల్షియం అధికంగా కలిగిన సొయా బీన్స్ నుంచి టోఫు అనే పదార్థం తయారవుతుంది. కేల్షియం కంటెంట్ అధికంగా కలిగి ఉండటం వలన టోఫు అనేది చిన్నారుల పాదాలు దృఢంగా అయ్యేందుకు తోడ్పడుతుంది.

నువ్వు గింజలు

నువ్వు గింజలు

ఐరన్ తో పాటు కేల్షియం కంటెంట్ అనేది నువ్వు గింజలలో అధిక మోతాదులో లభిస్తుంది. ఏడాది వయసున్న పిల్లలకు కూడా లడ్డూల రూపంలో అలాగే కొన్ని తీపి పదార్థాల రూపంలో వీటిని అందించవచ్చు. వీటి వలన పాదాలు అలాగే కాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ఫిష్

ఫిష్

కొన్ని రకాల ఫిష్ లలో కేల్షియం, ప్రోటీన్ లతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. మీరు మాంసాహారి అయితే సాల్మన్, మాకెరెల్ తో పాటు అంచోవీస్ వంటి ఫిష్ లను చిన్నారి ఆహారంలో భాగంగా చేయడం మరచిపోకండి. వీటిని చిన్నారికి అందించడం వలన చిన్నారి కాళ్ళు అలాగే పాదాలు దృఢంగా మారతాయి.

గుడ్లు

గుడ్లు

చిన్నారి డైట్ లో జతచేయవలసిన సూపర్ ఫుడ్ అనేది ఎగ్. ఇందులో చిన్నారి ఎదుగుదలకు అత్యవసరమైన ప్రోటీన్లతో పాటు కేల్షియం కూడా కలదు. అందుకే, దీనిని చిన్నారి ఆహారంలో భాగంగా చేయడం వలన చిన్నారి కాళ్ళు అలాగే పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    foods that strengthen baby's feet | best foods to strengthen baby's feet

    Desk-bound jobs which require people to work in front of the computer for hours have many health hazards. And your eating habits at work can have a major impact on your health. So are a few tips to help you eat healthy at work.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more