For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాశయ మధుమేహం – కడుపులో బిడ్డపై చూపే ప్రభావం

గర్భాశయ మధుమేహం – కడుపులో బిడ్డపై చూపే ప్రభావం

|

గర్భధారణ సమయంలో ఈరోజుల్లో ఎక్కువగా వింటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి గర్భశయ మధుమేహం. మీరు గర్భవతి అయినప్పుడు హార్మోన్ స్థాయిలు రక్తంలో చక్కెర నిల్వల పెరుగుదలకు గురిచేయవచ్చు. ఇవి సంక్లిష్టంగామారి, డెలివరీ సమస్యలకు సైతం దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ, గర్భాశయ మధుమేహం రోగనిర్ధారణ చేయబడినా కూడా సానుకూల దృక్పధంతో ఉండాలని సలహా ఇస్తారు. మీరు మంచి వ్యక్తుల మద్యలో, సహాయసహకారాలతో ఉన్న ఎడల, ఈ సమస్య పెద్దగా అనిపించదు కూడా.

గర్భాశయ మధుమేహం అనగా?

గర్భాశయ మధుమేహం అనగా?

గర్భాశయ మధుమేహం, గర్భధారణ సమయంలో మాత్రమే సంభవిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో చక్కెర స్థాయిల అసాధారణ పెరుగుదలను సూచిస్తుంది. మీరు మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మరియు నియంత్రణలో ఉంచడానికి కొన్ని సూచనలు పాటించవలసినదిగా సలహా ఇస్తారు.

గర్భాశయ మధుమేహం మీరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సాధారణంగా అనతికాలంలోనే నయమవుతుంది. కొన్ని సందర్భాలలో మాత్రం టైప్-2 మధుమేహం అభివృద్ధి అవకాశాలను పెంచుతుంది. కానీ, ఇది అత్యంత అరుదైన సంఘటన.

గర్భాశయ మధుమేహానికి గల కారణాలు:

గర్భాశయ మధుమేహానికి గల కారణాలు:

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, మాయ(ప్లెసెంటా)లో గ్లూకోజ్ నిల్వలను నిర్మించగల హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది. నిజానికి, మీ క్లోమగ్రంధి ఈ గ్లూకోజ్ నిల్వలను నిర్వహించడానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో, తగినంత ఉత్పత్తి జరగనప్పుడు, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు గర్భాశయ మధుమేహానికి దారితీస్తుంది. మీరు దిగువ పేర్కొన్న వర్గాలలోకి వస్తే మీరు గర్భాశయ మధుమేహం కలిగి ఉన్నారని అర్ధం:

• ఇదివరకే డయాబెటీస్ చరిత్రను కలిగి ఉండడం.

• మీ పూర్వపు గర్భధారణ సమయాలలో గర్భాశయ మధుమేహం ఉండడం

• గర్భధారణకు ముందు అధిక బరువు ఉండడం

• రక్తంలో అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉండడం(సరిహద్దు వద్ద ఉన్నా)

• ముందు అధిక బరువుగల బిడ్డకు జన్మనివ్వడం.

• లోపాలను కలిగిన బిడ్డకు జన్మనివ్వడం లేదా మృతశిశువుకు జన్మనివ్వడం.

గర్భధారణ డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ:

గర్భధారణ డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ:

ఇది మీ గర్భధారణ సమయంలో 4-5 నెలల కాలంలో సంభవిస్తుంది. దీని లక్షణాలు అతి మూత్ర విసర్జన, సాధారణం కన్నా అధిక దాహం కలిగి ఉండటం, ఆకలితో కూడిన అనుభూతి మరియు అతిగా తినడం మొదలైనవి. ఈ లక్షణాలు గర్భధారణ లక్షణాలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, సాధారణ గర్భధారణ లక్షణాలతో పోలిస్తే, గర్బాశయ మధుమేహం కలిగిన వారిలో లక్షణాల తీవ్రత అధికంగా ఉంటుంది. పరిస్థితిని బట్టి వైద్యుని సంప్రదించి, తగు పరీక్షలు(ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ టెస్ట్స్) చేయించుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఇది టైప్-2 మధుమేహ రకానికి చెందినదిగా ఉంటుంది.

సాధారణంగా 24 నుండి 28 వారాల మధ్య, మీ వైద్యులు గర్భాశయ మధుమేహం గుర్తించే పరీక్షలను చేస్తుంటారు.

గర్భాశయ మధుమేహం శిశువును ఎలా ప్రభావితం చేస్తుంది?

గర్భాశయ మధుమేహం శిశువును ఎలా ప్రభావితం చేస్తుంది?

కడుపులోని శిశువు మీ రక్తం నుండి పోషకాలను పొందుతుండగా, మీరు గర్భాశయ మధుమేహంతో శిశువును కూడా ప్రభావితం చేస్తారు. శిశువు ఈ అదనపు చక్కర నిల్వలను కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది, ఇది వారి అసాధారణ బరువుకు కూడా కారణమవుతుంది. ఈ సందర్భంలో కొన్ని గర్భధారణ సమస్యలు ఉండవచ్చు:

• శిశువు పెరిగిన పరిమాణము వలన కాన్పు సమయంలో శిశువుకి గాయాలు కలుగవచ్చు.

• శిశువు, రక్తoలో తక్కువ చక్కెర నిల్వలు మరియు తక్కువ ఖనిజాల స్థాయిలతో పుట్టవచ్చు

• నెలలు నిండకుండా ముందుగా పుట్టే అవకాశాలు ఉండవచ్చు

• శిశువు కామెర్లతో జన్మించవచ్చు.

• తాత్కాలిక శ్వాస సమస్యలు ఉండవచ్చు

జన్మించిన శిశువు తన జీవితంలోని తరువాతి దశలలో ఊబకాయం మరియు మధుమేహం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఆరంభము నుండే ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి, అటువంటి పిల్లలు ప్రోత్సహించబడాలి.

గర్భాశయ మధుమేహం ప్రమాదాల గురించిన వివరాలు :

గర్భాశయ మధుమేహం ప్రమాదాల గురించిన వివరాలు :

• అకాల డెలివరీ:

రక్తంలోని అధిక చక్కెర స్థాయిలు ముందస్తు డెలివరీ ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భందాల్చిన 24వ వారానికి ముందుగా తల్లి, గర్భాశయ మధుమేహం అభివృద్ధికి గురయితే, నెలలు నిండకుండానే అకాల డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనేక పరిశోధనలు చూపించాయి. సాధారణంగా గర్భధారణలో ఇటువంటి మధుమేహానికి గురైనా కూడా, 24 వారాల తర్వాత సమయం గడిచిన ఎడల, అకాల జననం ప్రమాదం తగ్గిపోతుంది. కానీ, కొన్ని సందర్భాలలో మాత్రం 24 వారాలు దాటినా కూడా, నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు ఉన్నాయి. అటువంటి కేసులలో వైద్యుల పర్యవేక్షణ ఎంతో అవసరంగా ఉంటుంది.

సిజేరియన్ డెలివరీ పెరిగే అవకాశాలు :

సిజేరియన్ డెలివరీ పెరిగే అవకాశాలు :

సాధారణంగా అధిక కేసులలో, గర్భాశయ మధుమేహం కారణంగా శిశువులు అధిక బరువుతో పుట్టే అవకాశాలు ఉన్నాయి. గర్భాశయ మధుమేహంతో ఉన్న మహిళలకు సి-సెక్షన్ నుండే వారి ఆరోగ్య సంరక్షణ సూచించబడుతుంది, సాధారణంగా శిశువు అధిక బరువుతో పుట్టడం మరియు డెలివరీ కష్టమవడం జరుగుతుంది. ఒక్కోసారి ఎక్కువకాలం వేచి చూడవలసి వస్తే, కొన్ని అరుదైన సందర్భాలలో మృతశిశువుకి జన్మనిచ్చే అవకాశాలు లేకపోలేదు. గర్భధారణ 42 వారాలకు మించి ఉంటే మాత్రం ప్రమాద అవకాశాలు మరింత పెరుగుతాయి. కావున అటువంటి సందర్భాలలో సిజేరియన్ ఎల్లప్పుడూ మంచిదిగా సూచించబడుతుంది. శిశువు పరిమాణం ఎక్కువగా ఉన్నా, లేదా పొజిషన్ సరిగ్గా లేకపోయినా కూడా సిజేరియన్ అవసరమవుతుంది.

గర్భాశయ మధుమేహాన్ని ఎలా నిర్వహించాలి?

గర్భాశయ మధుమేహాన్ని ఎలా నిర్వహించాలి?

మీరు గర్భాశయ మధుమేహంతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణ అవసరం. మీరు తరచుగా వైద్యుని సంప్రదించవలసినదిగా సూచించబడుతారు. మరియు మీరు ఈ క్రింది వాటిని కూడా అనుసరించవలసి ఉంటుంది: • మీ రక్తంలో చక్కెర స్థాయిలను రోజులో కనీసం నాలుగు సార్లు తనిఖీ చేయండి. ఇంట్లో ఆటో-డిజిటల్ బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ యంత్రం అందుబాటులో ఉంచండి. • కీటోన్ల ఉనికిని తనిఖీ చేయడానికి తరచూ మూత్రం పరీక్ష చేయించుకోండి. డయాబెటిస్ నియంత్రణలో ఉందో, లేదో తెలుసుకొనుటకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. • క్రమం తప్పకుండా వ్యాయామం: మీరు గర్భధారణ సమయంలో మీ వ్యాయామ శిక్షకులు సూచించిన వ్యాయామాలు అనుసరించడం మంచిది. • ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అవసరం, కావున సరైన ప్రణాళికకోసం మీ వైద్యుని సంప్రదించడం లేదా డైటీషియన్స్ సిఫార్సును తీసుకోవలసి ఉంటుంది. క్రమంగా ఆహారం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచకుండా నియంత్రించవచ్చు. వైద్యుని సంప్రదించిన ప్రతిసారీ, మీ బరువు జాగ్రత్తగా పర్యవేక్షించబడుతుంది. మీ వైద్యులు సూచించిన బరువును కలిగి ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలి. వైద్యుని సూచన మేరకు ఇన్సులిన్ అవసరమైతే తీసుకోవలసి ఉంటుంది. సానుకూల దృక్పధంతో ఉండటం మరియు మీ వైద్యుని సలహాలు సూచనలు పాటిస్తూ, ఖచ్చితమైన ఆరోగ్య, వ్యాయామ ప్రణాళికలను అనుసరిస్తూ, క్రమం తప్పని పరీక్షలు చేయిస్తూ, అవసరాన్నిబట్టి వైద్యులు సూచించిన ఔషధాలను వినియోగిస్తూ ఆరోగ్యకర జీవనశైలికి అలవాటు పడితే, ఎటువంటి సమస్యలులేని ఆరోగ్యకర నవజాత శిశువుకు జన్మనివ్వగలరు. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.


English summary

How can gestational diabetes affect your baby?

Gestational diabetes occurs during pregnancy and is an indication of high levels of sugar during pregnancy which was otherwise normal before conceiving. During pregnancy the placenta produces hormones that can create a build-up of glucose in your blood. The pancreas produces enough insulin to handle at times,
Story first published:Thursday, August 23, 2018, 10:56 [IST]
Desktop Bottom Promotion