చిన్నారులలో గ్యాస్ ప్రాబ్లెమ్ ని నివారించడం ఎలా?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

గ్యాస్ ప్రాబ్లెమ్ అనేది కేవలం పెద్దలకే పరిమితం కాదు. చిన్నారులు కూడా ఈ సమస్యకు గురవుతారు. రాత్రివేళలో ఈ సమస్య తీవ్రమవుతుంది. అందువలన, చిన్నారుల నిద్రకు భంగం ఏర్పడుతుంది.

అప్పుడే పుట్టిన శిశువులలో డైజెస్టివ్ కెపాసిటీ అనేది వృద్ధి చెందేందుకు సమయం పడుతుంది. ఈ దశలో, వాంతులు అలాగే గ్యాస్ సమస్యల వంటివి తలెత్తుతాయి.

breastfed baby gas relief

శిశువు ఎదిగే కొద్దీ, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. అందువలన, జీర్ణ సమస్యలు తక్కువవుతాయి. ఆ విధంగా, సహజంగానే గ్యాస్ ట్రబుల్స్ అనేవి తగ్గిపోతాయి.

శిశువుకి పాలను ఒకేసారి ఎక్కువగా పట్టడం వలన గ్యాస్ ప్రాబ్లెమ్స్ తో పాటు శ్వాస ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.

ఈ ఆర్టికల్ లో చిన్నారులలో గ్యాస్ ట్రబుల్స్ కి సంబంధించిన కొన్ని విషయాలను వాటి నివారణ పద్దతులను వివరించాము.

గ్యాస్ ప్రాబ్లెమ్ ఎందుకు తలెత్తుతుంది?

గ్యాస్ ప్రాబ్లెమ్ ఎందుకు తలెత్తుతుంది?

మొదటగా, పెద్ద ప్రేగుపై అధిక ఒత్తిడి ఏర్పడడం వలన గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని మనం గ్రహించాలి. పెద్ద ప్రేగు అతిగా పనిచేసినప్పుడు గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అయితే, శిశువులు పాలు తాగే సమయంలో గాలిని మింగటం వలన కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

ఈ సమస్యకు తల్లి తీసుకునే ఆహారపదార్థాలు కారణమవుతాయా?

ఈ సమస్యకు తల్లి తీసుకునే ఆహారపదార్థాలు కారణమవుతాయా?

కొన్ని సార్లు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం ద్వారా కూడా శిశువులలో గ్యాస్ ప్రాబ్లెమ్స్ తలెత్తుతాయి. తల్లిపాలపైనే శిశువు ఆధారపడుతున్నప్పుడు తల్లులు కూడా తాము తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఆహారపుటలవాట్లని మార్చుకున్నా కూడా మీ శిశువు గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడుతూ ఉంటే తప్పక వైద్యున్ని సంప్రదించాలి.

పిల్లలు ఏడిస్తే గ్యాస్ ప్రాబ్లెమ్ కు గురవుతారా?

పిల్లలు ఏడిస్తే గ్యాస్ ప్రాబ్లెమ్ కు గురవుతారా?

ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. పిల్లలు ఏడిస్తే వారిలో గ్యాస్ ప్రాబ్లెమ్ తలెత్తే అవకాశాలు పుష్కలం. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఎంతో కొంత గాలి లోపలి వెళుతుంది. అలా గాలిని మింగడం వలన చిన్నారులలో గ్యాస్ ప్రాబ్లెమ్ తలెత్తే ప్రమాదం కలదు.

మలబద్దకం?

మలబద్దకం?

మలబద్దకం సమస్యతో బాధపడే వారిలో కూడా గ్యాస్ ప్రాబ్లెమ్ తలెత్తుతుంది. కాబట్టి, మలబద్దకం కూడా గ్యాస్ సమస్యకు కారణమయ్యే ఒక ఆరోగ్యస్థితి. కాబట్టి, చిన్నారులులో మలబద్దకం సమస్యని నివారించడం ద్వారా గ్యాస్ ట్రబుల్ ని అరికట్టవచ్చు.

చిట్కా # 1

చిట్కా # 1

శిశువులో గ్యాస్ ట్రబుల్ ని నివారించే సులభమైన చిట్కా ఇది. శిశువు కాళ్ళను మడిచి సున్నితంగా పొట్టని శిశువు కాళ్లతో ప్రెస్ చేయాలి. ఈ పద్దతి ద్వారా గ్యాస్ ట్రబుల్ ని అరికట్టవచ్చు. అయితే, ఈ పద్దతిని పాటించేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి. పాపాయి శరీరం బహుసున్నితమని గమనించి వ్యవహరించండి. ఈ ప్రోసిజర్ ని సరిగ్గా పాటించగలుగుతారన్న నమ్మకం లేకపోతే వైద్యున్ని సంప్రదించండి.

చిట్కా # 2

చిట్కా # 2

పాపాయి పొట్టని సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా గ్యాస్ ట్రబుల్ నుంచి పాపాయికి ఉపశమనాన్ని అందించవచ్చు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మీ చేతులతో పాపాయి పొట్టపై తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తూ గుండ్రంగా మసాజ్ చేయండి.

చిట్కా # 3

చిట్కా # 3

పాపాయిని మంచంపై పడుకోబెట్టి సైక్లింగ్ చేస్తున్నట్టుగా పాపాయి కాళ్ళని కదిలించండి. ఈ పద్దతి ద్వారా ఇటు గ్యాస్ ప్రాబ్లెమ్ ని అటు మలబద్దకాన్ని నివారించవచ్చు.

భంగిమ

భంగిమ

సాధారణంగా, చిన్నారులు రోజు మొత్తంలో కనీసం పది నుంచి ఇరవై సార్లు గ్యాస్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. చిన్నారులు పాలను సరైన భంగిమలో తాగేలా జాగ్రత్తలు తీసుకోండి. పాపాయి పాలు తాగేటప్పుడు పాపాయి పొట్ట కంటే తల అనేది పైకి ఉండాలి.

గాలి బుడగలు

గాలి బుడగలు

మీరు పాపాయికందించే పాలసీసాలోని పాలలో గాలిబుడగలు లేకుండా చూసుకోవాలి. పాల ద్వారా ఇవి పొట్టలో చేరి పాపాయికి గ్యాస్ ప్రాబ్లెమ్ ని కలిగిస్తాయి. అలాగే, పాలు తాగిన తరువాత ఖాళీ సీసాని పాపాయి చప్పరించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైద్యున్ని సంప్రదించండి

వైద్యున్ని సంప్రదించండి

పైన చెప్పిన చిట్కాలేవీ పనిచేయకపోతే మీరు వైద్యున్ని సంప్రదించడానికి ఏ మాత్రం సంకోచించకండి. సాధారణంగా, గ్యాస్ ట్రబుల్ బారిన పడిన శిశువులు అసౌకర్యానికి గురవుతారు. మీరు, ఆలస్యం చేసిన కొద్దీ వారి అసౌకర్యం తీవ్రత మరింత ఎక్కువవుతుంది.

English summary

How To Relieve Gas In Babies

When babies suffer gas problems, they tend to become sleepless and cranky. When a baby doesn't sleep, even a parent will lose sleep. Do you know when the gas problems become worse? During the night! That is why you and your baby may lose sleep if there is gas problem. Read this!
Story first published: Saturday, January 13, 2018, 12:30 [IST]