For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు కావాలనునే లక్షణాలతో.. మగబిడ్డను కనొచ్చు, ఇది సాధ్యమేనా? అందరూ కొడుకును కనడం కష్టమేమీ కాదట!

పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఎదగాలనే అందరూ తల్లిదండ్రులు కోరుకుంటారు. సహజ ఆరోగ్యం కోసం పిల్లల్ని కూడా సహజంగా పుట్టేలా చేస్తేనే మంచిది. మీరు కావాలనునే లక్షణాలతో.. మగబిడ్డను కనొచ్చు.

By Arjun Reddy
|

మీరు కోరుకున్నట్టుగానే అపర మేధావులు మీ కడుపులో పుడతారు. సూపర్ పవర్స్ ఉన్న బిడ్డలను కనడం చాలా సులభం. ఒడ్డూ, పొడుగు, రంగు, తెలివి వంటి మీరు కోరుకున్న ఫీచర్స్ అన్నీ మీ బేబీలో ఉంటాయి. అలాంటి పిల్లల్ని కనేందుకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఆరోగ్య భారతి గర్భవిజ్ఞాన సంస్కార్ పేరుతో ఓ ప్రాజెక్టు మొదలుపెట్టింది. సంగీతం, పంచకర్మ, యోగా, ఆహార నియమాలు వంటి పద్ధతులతో సూపర్‌బేబీలను కనడం సులభమే అంటోంది ఆ సంస్థ.

మగ శిశువు కోసం ఆరాటపడుతున్నారా? ఇకపై మీకా చింత అవసరం లేదు. కొడుకును కనడం కష్టమేమీ కాదు. కోరుకున్నట్టుగా కొడుకు పుట్టడం కోసం ఏం చేయాలో చెప్తూ మహారాష్ట్ర హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఓ కోర్సు ప్రవేశపెట్టింది. ఆ కోర్సు ప్రకారం మగశిశువును మాత్రమే కనేలా ప్లాన్ చేసుకోవచ్చనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మగబిడ్డలే ఎందుకు?

మగబిడ్డలే ఎందుకు?

అవునూ..!? మగబిడ్డలే ఎందుకు? ఇది దేనికి సంకేతం??సూపర్ బేబీలను ఈ దేశం కోసం తయారు చేస్తారా? ఇది యుద్ధోన్మాదమా? లింగోన్మాదమా? మతోన్మాదమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆడది అబల కాదు.. సబల.. ఆకాశంలో సంగం.. అవకాశాల్లో సగం.. అంతటా ఆమె.. అని అంతరిక్షానికి మనతో సమంగా చూస్తున్న కాలంలో లేమా? మగబిడ్డలే కావాలి? ఎందుకు?? ఏమిటి మీ పురుషాధిక్యం?? అనేవి ఇప్పటి కొందరి వాదనలు.

సూపర్ బేబీస్ కోసం ఆరోగ్య భారతి

సూపర్ బేబీస్ కోసం ఆరోగ్య భారతి

మహారాష్ట్ర హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ బీఏఎంఎస్‌లో ప్రవేశపెట్టిన కోర్సు.. సూపర్ బేబీస్ కోసం ఆరోగ్య భారతి పేరుతో ఆరెస్సెస్ చేస్తున్న ప్రచారం.. ఇప్పుడు ఇలాంటి సరికొత్త వాదనలకు తెరతీస్తున్నాయి. మనం కోరుకున్నట్లుగా బిడ్డలను కనడం సాధ్యమా? వారు చెబుతున్నదాంట్లో నిజమెంత? వైద్య శాస్త్రం ఏం చెబుతోంది? సామాజిక కార్యకర్తలు, వైద్యనిపుణులు ఏమంటున్నారు?

మంచి ఆలోచన కాదు

మంచి ఆలోచన కాదు

కేవలం మగపిల్లల్నే పుట్టించడం, అద్భుత శక్తులున్న పిల్లల్ని కనడం అనేది పూర్తిగా సినిమాటిక్. ఇది ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సైంటిఫిక్‌గా రుజువు కాలేదు. జస్ట్ ఫాంటసీ. పిల్లలు కలిగేలా చేస్తాం గొప్పలు చెప్పుకున్న స్వామీజీలు, బాబాలను చాలామందిని చూశాం. మగపిల్లలు, సూపర్ బేబీస్ అనేది మూర్ఖపు ఆలోచన. మగపిల్లల్ని మాత్రమే కనమని చెప్పేది కాలం చెల్లిన భావన. ఇలా అందరూ మగపిల్లల్ని కంటూ పోతే.. ఈ భూమంతా వాళ్లే ఉంటారు. మరి అమ్మలెక్కడ? భార్యలెక్కడ? అక్కాచెళ్లెల్లెక్కడ? అసలు మహిళలెక్కడ? వీరు లేనిది ఈ సృష్టి ఎక్కడ? అయినా.. అసలు మూఢనమ్మకం కాకపోతే గర్భధారణకు ముహుర్తాలు పెట్టడం, ఆ ముహుర్తం ప్రకారం మగబిడ్డ, సూపర్ బేబీస్ పుట్టడం ఏంటి? ఇదెక్కడి ఆచారం.. పిండం ఏర్పడే సమయాన్ని, ముహుర్తాన్ని నిర్ణయించడం ఇంగితం ఉన్న ఆలోచనేనా? ఇదంతా.. కేవలం ఊహ, మూర్ఖపు ఆలోచన మాత్రమే.

మగపిల్లాడు పుట్టేలా చేయడం అసాధ్యం

మగపిల్లాడు పుట్టేలా చేయడం అసాధ్యం

వంశోధ్దారకులు కావాలి అనే మత సంప్రదాయాలతో కూడిన బలమైన కోరిక మగబిడ్డ కావాలనుకోవడం వంటివి తరతరాలుగా వస్తున్నాయి. ఆ కోరికను, బలహీనతను సొమ్ము చేసుకోవడానికి పుట్టుకొస్తున్న సంస్థలు, ప్రచారాలే ఇవి. ఎక్స్ క్రోమోజోమ్ వస్తే అబ్బాయి, వై క్రోమోజోమ్ వస్తే అమ్మాయి పుడుతారు. ఇది సైన్స్‌లో ఉంది. కేవలం ఎక్స్ క్రోమోజోమ్‌నే సృష్టించి మగపిల్లాడు పుట్టేలా చేయడం అసాధ్యం. అది ఎవరూ నిర్ధారించలేరు, నిర్ణయించలేరు. ఇప్పటికే సెక్స్ రేషియో పడిపోయి సమాజం అసమతుల్యంగా ఉంది. దేశవ్యాప్తంగా బాలికల నిష్పత్తి పడిపోతున్నది.

ఆడపిల్లను పుట్టకుండా చేసే కుట్రలు

ఆడపిల్లను పుట్టకుండా చేసే కుట్రలు

ఈ పరిస్థితులు సామాజిక సమస్యలకు కారణమవుతున్నాయి. అమ్మాయిల పట్ల నిర్లక్ష్యం, అసమానత, వివక్ష, వేధింపులకు కారణమవుతున్నది. దీనికి సమాజం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మంచి సమాజం నిర్మాణం జరగాలంటే.. ఆడమగ నిష్పత్తి సమానంగా ఉండాలి. సమాజాన్ని నడపడం, సృష్టిని కొనసాగించడం నిరాటంకంగా, సమర్థవంతంగా జరుగాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉండాలి. కొన్ని సంస్థలు మాసిపోయిన మూఢనమ్మకాలకు మళ్లీ పురుడు పోస్తున్నాయి. ఆడపిల్లను పుట్టకుండా చేసే ఈ కుట్రలు సమర్థనీయం కాదు. ఇలాంటి కార్యక్రమాలకు కారణమైన సంస్థలేవైనా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇదే సమయంలో స్త్రీలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది.

మగశిశువును మాత్రమే కనేలా చేసే పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయా?

మగశిశువును మాత్రమే కనేలా చేసే పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయా?

అసలు విషయానికొస్తే.. సూపర్ బేబీస్‌ను సృష్టించడం సాధ్యమేనా? మగశిశువును మాత్రమే కనేలా చేసే పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయా? అయినా ప్రకృతికి సహజత్వానికి విరుద్ధంగా ఇది అవసరమా ఇప్పుడు చర్చనీయాంశం.గర్భవిజ్ఞాన సంస్కార్ పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ ఆరోగ్య భారతి, సమర్థ భారత్ కోసం సూపర్ బేబీలను తయారు చేస్తాం అంటున్నది. ఇంకో మూడేళ్లలో వేలాది సూపర్ బేబీలను తయారుచేస్తాం. భారత్‌కి అందిస్తాం. ఉత్తమ సంతానం ద్వారానే బలమైన భారతదేశం నిర్మిస్తామంటూ ప్రకటనలు కూడా చేసింది. అసలు ఈ గర్భవిజ్ఞాన సంస్కార్ ప్రాజెక్ట్ పేరుతో, తెలివైన, బలమైన, అందమైన శిశువులు పుట్టేలా చేయడం సాధ్యమేనా? ఈ ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్నది.

ఒక శిబిరాన్ని కూడా ప్రారంభించారు

ఒక శిబిరాన్ని కూడా ప్రారంభించారు

మంచి సంతానం కోసం ప్రాచీన భారతీయులు ఎన్నో చిట్కాలు కనిపెట్టారు. వాటిని అనుసరిస్తే ఉత్తమ సంతానం సాధ్యమే అంటున్నది ఆరోగ్య భారతి సంస్థ. గర్భసంస్కార్ ప్రాజెక్ట్ జాతీయ కన్వీనర్ కరిష్మా మోహన్‌దాస్ నార్వణి ఆ మధ్య కోల్‌కతాలో ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక శిబిరాన్ని కూడా ప్రారంభించారు. జంట దగ్గర కొంత ఫీజు వసూలు చేస్తూ.. ఉత్తమ సంతానాన్ని పొందే ప్రయోగాలు, చిట్కాలు బోధించడం మొదలుపెట్టారు. మంచి సంగీతం, ఆయుర్వేద మూలికలు, ప్రత్యేక పంచకర్మ, యోగా, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తే సూపర్‌బేబీస్ జన్మించడం సాధ్యమేనని చెబుతున్నారు. కాకపోతే ఈ నియమాలు పాటిస్తున్న సమయంలోనే డాక్టర్లు ప్రయోగశాలలో గర్భిణుల మీద ప్రయోగాలు చేసి అండంలో మార్పులు తెస్తారట.

గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రాలు

గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రాలు

ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే వందల మంది సూపర్ బేబీస్ కూడా పుట్టారట. ఈ పద్ధతులు దేశవ్యాప్తం చేసేందుకు 2020 కల్లా ప్రతి రాష్ట్రంలో గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న హితేష్ జానీ అనే వైద్యుడు ఇవన్నీ.. కొత్తగా మేం సృష్టించినవేం కాదు. పురాతన హిందూశాస్ర్తాల్లో చెప్పినవే. రుజువు చేసినవే. ఈ పద్ధతులను పూర్వకాలంలో ఎంతోమంది తల్లులు ఉత్తమ సంతానాన్ని, మేధావులను, వీరులను పొందారు అని చెబుతున్నాడు. ఈ ప్రాజెక్టు ద్వారా సూపర్ బేబీని పొందాలనుకునే దంపతులు మూడు నెలల పాటు కఠినమైన నియమాలు పాటించాలి.

పిల్లలు సహజంగా పుడితేనే ఆరోగ్యంగా ఉంటారు

పిల్లలు సహజంగా పుడితేనే ఆరోగ్యంగా ఉంటారు

కేటాయించిన వైద్యులు, సలహాల మేరకే వారు నడుచుకోవాలి. నిర్దేశించిన సమయంలో, గ్రహసంచారం అనుకూలంగా ఉన్న సమయంలోనే సంభోగం చేయాలట. నిపుణులు నిర్దేశించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలట. చాలా ప్రాంతాల్లో ఈ సూపర్‌బేబీస్ తయారీకేంద్రాలు వెలిశాయి. చిన్న చిన్న చిట్కాలు, యాక్టివిటీస్, సంగీతం వంటి పద్ధతుల ద్వారా కడుపులో బిడ్డ తెలివి, పెరుగుదలపై ప్రభావితం చేయొచ్చు అని ప్రచారం చేస్తున్నారు. అయితే.. పిల్లలు సహజంగా పుడితేనే ఆరోగ్యంగా ఉంటారు. తల్లిగర్భ సహజ వాతావరణానికి అలవాటు పడి, సహజంగా బాగుంటుంది.. అని వాదిస్తున్నారు ఆరోగ్య, సామాజిక నిపుణులు

ఇది సాధ్యం కాదు!

ఇది సాధ్యం కాదు!

ప్రకృతికి విరుద్ధంగా ఏదైనా చేయాలనుకోవడం మానవాళికి శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఆ పనిలో ప్రకృతిని డిస్టర్బ్ చేసి విజయం సాధించినా అది మన వినాశానానికి దారితీస్తుంది. కడుపులో ఉన్న పిండంలో మార్పులు చేయడం అనేది క్టు కాదు. పైగా చట్టవ్యతిరేకం కూడా. ల్యాబ్‌లో చేసిన పరీక్షలు, ప్రయోగాలు సత్ఫలితాలిచ్చి ఉండొచ్చు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. ఒక జన్యువును ల్యాబ్‌లో ఎడిట్ చేసి ఊహించుకున్నట్టుగా దాని పరిణామం మార్చేందుకు అవకాశం ఉంది. కానీ.. ప్రాక్టికల్‌గా ఇది సాధ్యపడదు. ఒకవేళ సాధ్యపడినా.. అది పూర్తి సత్ఫలితాలివ్వదు. ప్రస్తుత మనిషి 70 ఏళ్ల ఆయుఃప్రమాణంలో పూర్తికాలం దాని సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా బతకగలడా? అనేదిప్రశ్నార్థకమే. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేసేటప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు కొన్ని మంచి కణాలు కూడా చనిపోతాయని కొందరి వాదన.

మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉంది

మిస్ యూజ్ అయ్యే ప్రమాదం ఉంది

పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఎదగాలనే అందరూ తల్లిదండ్రులు కోరుకుంటారు. సహజ ఆరోగ్యం కోసం పిల్లల్ని కూడా సహజంగా పుట్టేలా చేస్తేనే మంచిది. కడుపులో పెరుగుతున్న అండం మీద ప్రయోగాలు చేసి, అవి విఫలమైతే పుట్టబోయే బిడ్డకు మంచిది కాదు. గర్భంలో ఉన్న పిండాన్ని కృత్రిమంగా అభివృద్ధి చేసి, తెలివితేటలు పెంచడం, మంచి రంగుతో పుట్టేలా చేయడం అనేది అసాధ్యం. ఒకవేళ సాధ్యమైనప్పటికీ అది ఎక్కువకాలం ఉండడం సాధ్యపడదు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా జీవించడం మాత్రం సహజంగా ఉండాలనే కోరుకుంటాం. అలాగే.. పుట్టుక కూడా సహజంగా ఉంటేనే మంచిది. కచ్చితంగా మగశిశువు మాత్రమే పుట్టేలా చేయడం కూడా జరగని పని. పురాతన శాస్త్రాల్లో కథల్లో ఉందేమో కానీ, ఎక్కడా నిజమైనట్టు ఆధారాలు లేవు. పైగా అలాంటివి నిజమైతే సమాజం ప్రమాదంలో పడ్డట్టే. మిస్ యూజ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇది మానవాళి మనుగడకే ప్రమాదం ఉందని కొందరి వాదన.

Read more about: బేబీ baby pregnancy
English summary

RSS Backed Aarogya Bharati Shares Tips For Women To Deliver Customised Super-Babies To Make A 'Samarth Bharat'

RSS Backed Aarogya Bharati Shares Tips For Women To Deliver Customised Super-Babies To Make A 'Samarth Bharat'
Desktop Bottom Promotion