For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పసిబిడ్డకి మేటి ఫింగర్ ఫుడ్స్

|

మీ బిడ్డకి ఆరునెలల వయస్సు రాగానే మీరు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు, ఇకనుంచి మీరు కేవలం తల్లిపాలనే పట్టక్కర్లేదు. మీ బేబీకి ఇదివరకే ఫార్ములా పాలను ఇస్తున్నట్లయితే, అప్పటివరకులాగా ఇక వాటిమీద మాత్రమే తను ఆధారపడక్కర్లేదు.

డబ్యూహెచ్ ఒ సూచన ప్రకారం, మొదటి ఆరు నెలల తర్వాత, బేబీకి సెమీ ఘనపదార్థాలు లేదా మెత్తని జావలాంటి పదార్థాలను తల్లిపాలతో పాటు ఇవ్వాలి. కొన్నిసార్లు పాపాయి అవి తినడానికి ఇష్టపడకపోవచ్చు, ఆరు నెలల తర్వాత కూడా తల్లిపాల మీదే ఆధారపడవచ్చు; కానీ ఇలాంటివి హఠాత్తుగా ఎదుగుదలలో భాగంగా జరుగుతుంటాయి.

బిడ్డకి మెత్తని జావలాంటి ఆహారం సౌకర్యంగానే ఉన్నా, ఇక మీరు వండిన, ఘన పదార్థాలను పరిచయం చేయవచ్చు. భోజనం సమయంలో పెట్టే భోజనమే కాకుండా, మీరు మీ బిడ్డకి వేలుతో సులువుగా తినగలిగే ఆహారాన్ని పెట్టవచ్చు.

The Best Finger Foods For Your Toddler

ఈ వేలుతో సులువుగా తినగలిగే పదార్థాలు బేబీకి మంచివి ఇంకా వారి జీర్ణవ్యవస్థకి కూడా సరిపోతాయి. ఇవన్నీ బిడ్డ సులువుగా సౌకర్యంగా తినగలిగే రూపంలో ఉంటాయి. మీరు వీటిని 1 ఏడాది వయస్సున్న లేదా అంతకు ఎక్కువ వయస్సు పసిబిడ్డలకి పెట్టవచ్చు.

కొంతమంది పసిపిల్లలు ఈ వేలుతో సులువుగా తినగలిగే ఆహారాన్ని ఇంకా ముందుగానే తినగలుగుతారు, అందుకని మీ బిడ్డ ఎప్పుడు రెడీనో కాదో మీరే నిర్ణయించుకోవాలి.

ఈరోజు, మనం పసిపిల్లలకి ఇవ్వగలిగిన కొన్ని మేటి ఫింగర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా వాటి లాభాలు, వాటిని ఎలా పెట్టాలో కూడా తెలుసుకుందాం.

మీ బేబీ వేలుతో తినగలిగే ఆహారానికి రెడీ అయ్యారని ఎలా తెలుస్తుంది?

• మీ బిడ్డ నిటారుగా, పడిపోకుండా, వంగకుండా కూర్చోగలుగుతున్నాడు.

• మీ బిడ్డ ఆహారవిషయంలో ఆసక్తి కనబరుస్తున్నాడు, తరచూ మీ ప్లేట్లో నుంచి వంటకాలను ముట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

• మీ బిడ్డకి కొరుకుడు, కోరపళ్ళ చిగుళ్ళపై మంచి (ఆహారపదార్థాన్ని పట్టుకునే) పట్టు వచ్చింది.

• మీ బిడ్డకి పళ్ళు వచ్చాక వేలుతో సులభంగా తినిపించగలిగే ఆహారాన్ని పెట్టడంలో మీకు నమ్మకం రావచ్చు కానీ అప్పటివరకు కూడా ఆగక్కర్లేదు. బేబీ తన చిగుళ్ళను వాడి ఆహారాన్ని నమలగలడు.

The Best Finger Foods For Your Toddler

ఈ వేలుతో సులభంగా పెట్టగలిగే ఆహారపదార్థాలు బిడ్డకి సురక్షితమైనవని ఎలా తెలుస్తుంది?

పసిబిడ్డలకి ఫింగర్ ఫుడ్స్

• చిన్న ముక్కలుగా చేయండి

మీరు ఆహారాన్ని తయారుచేస్తున్నప్పుడే, అన్నిటిని చిన్నగా, చిన్నముక్కలుగా చేయండి. బేబీ సులభంగా తనంతట తానే తినగలుగుతాడు.

• మెత్తగా, నమలటానికి సులువుగా ఉన్న పదార్థాలనే ఎంచుకోండి.

చిగుళ్లతో నమలటానికి బేబీ ప్రయత్నించినప్పుడు మెత్తగా ఉన్న పదార్థాలు చక్కగా వాళ్ల నోటిలో కరిగిపోతాయి. ఇలాంటి ఆహారపదార్థాలు బేబీకి అంత హానికరం కూడా కాదు.

• అతుక్కునే ఫింగర్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి.

అతుక్కునే ఆహారపదార్థాలు కారమెల్, పీనట్ బటర్ ఇంకా క్రీమ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి బిడ్డ నోటిలో కరిగిపోవు. పైగా అంగిలికి, నోట్లో ఇతరభాగాలకి అతుక్కుంటాయి. వీటివలన ఊపిరిఆడకపోయే ప్రమాదం కూడా ఉంది.

• తక్కువ చక్కెర, ఉప్పు ఉన్న ఆహారపదార్థం ఎంచుకోండి.

మీ బిడ్డకి పెద్దవాళ్ళు తినే ఆహారపదార్థాలు పెట్టడం వలన వారికి అవసరమైనదానికంటే ఎక్కువ చక్కెర, ఉప్పును జీర్ణం చేసుకోవాల్సి వస్తుంది. మీ బేబీకోసం ఏదైనా వండుతున్నప్పుడు ఉప్పు లేదా చక్కెరను వేయకుండా ఉండటానికి ప్రయత్నించండి.

మీ బేబీకి ఫింగర్ ఫుడ్ ను ఎలా తినిపించాలి?

• విరగని అన్ బ్రేకబుల్ ప్లేటులో ఆహారాన్ని చిన్న ముక్కలుగా కోసి, మీ బిడ్డకి ఆ ప్లేటు అందించండి.

• కూరల్లాంటివి ఎంచుకుని మెత్తగా, సరిగ్గా ఉడికాక వడ్డించండి.

• మీ బేబీకి అవసరం అనిపించినప్పుడు చెంచా, సూదిమొనల్లా లేని ఫోర్క్ లాంటి వస్తువులను వాడనివ్వండి.

• తిన్న ప్రదేశం అంతా మీ బేబీ చెత్త చేస్తారని ముందే అర్థం చేసుకోండి. తనంతట తాను సరిగ్గా తినటం మొదలుపెట్టేదాకా, ఆహారంతో వాళ్ళు బాగా ఆడుకుని తీరతారు.

The Best Finger Foods For Your Toddler

• బేబీ స్వంతంగా తినేటప్పుడు ఎప్పుడూ ఒంటరిగా వదిలేయద్దు.

పసిబిడ్డలకి ఫింగర్ ఫుడ్స్

మీ పసిబిడ్డకి మేటి ఫింగర్ ఫుడ్స్

• ఎండిన మెత్తని ధాన్యాలు

ఆకారం లేని ఎండిన పప్పుధాన్యాలు వేలుతో సులభంగా తినటానికి చాలా పాపులర్ అయ్యాయి. ఇది ఎందుకంటే పసిపిల్లలకి తమ ఎదుగుతున్న చిగుళ్లపై పట్టు సాధించటానికి ఉపయోగపడతాయి. ఈ పప్పులు నోటిలో సులభంగా కరుగుతాయి కూడా.


• బ్రెడ్, బిస్కెట్

బ్రెడ్, బిస్కట్లు రెండూ రుచికరంగా, పౌష్టికంగా ఉండి అదే సమయంలో పళ్ళు వచ్చే సమయంలో పిల్లల చిగుళ్ళకి నొప్పి తెలీకుండా ఉపశమనాన్ని ఇస్తాయి. బేబీ ఎదుగుతున్నప్పుడు మీరు అవకాడోలు, నట్ బటర్ లేదా అరటిపళ్లను పెట్టవచ్చు.

• గుడ్లు

గుడ్లు ఫింగర్ ఫుడ్స్ గా బావున్నా, వాటిని పెట్టేముందు బాగా ఉడికేలా చూడండి. గట్టిస్థితిలో ఉండేలా ఉడికించి, ముక్కలుగా కోసి వారికి పెట్టండి, ఉప్పును వేయవద్దు.

• పండ్లు

పండ్లు సాధారణంగా మెత్తగా, రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కారణాల వల్లనే పళ్లని మొదట వేలుతో తినగలిగే మేటి ఆహారపదార్థాలుగా పరిగణిస్తారు. పుచ్చకాయలు, రేగుపళ్ళు, అరటిపళ్ళు మంచి భోజనంగా పిల్లలకి బావుంటాయి.

• అవకాడో

ఇది మెత్తగా, జిడ్డులేకుండా ఉండటంతో పిల్లలకి చాలా ఇష్టం. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మెదడు ఎదుగుదలకి ముఖ్యం. బేబీకి నమలటానికి పళ్ళు లేనప్పుడు కూడా దీన్ని తినవచ్చు.

• పాస్తా

పాస్తాను సరిగ్గా వండితే పిల్లలకి మంచి ఆహారమవుతుంది. మొదట్లో మీ పిల్లలకి పాస్తాను సాదాగా వండి పెట్టవచ్చు;కానీ వారు ఎదుగుతున్నప్పుడు కొంచెం వెన్న, టమాటా సాస్ లేదా ఆలివ్ నూనెను జతచేయవచ్చు.

• టోఫూ

సోయా పన్నీర్ అయిన టోఫూలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మీ బేబీ మొదటి ఫింగర్ ఫుడ్ గా కొంచెం గట్టి టోఫూను ఎంచుకోండి. దీన్ని వండి లేదా వండకుండా ఎలా అయినా తినిపించవచ్చు.

• కాయగూరలు

మెత్తగా వండే కాయగూరలు మీ బిడ్డకి మంచివి. మీ బేబీకి మీరు ఇప్పటికే కాయగూరల రసం ఇస్తుండవచ్చు. అందుకని, వాళ్లకి ఈ రుచి ఇప్పటికే తెలిసే ఉంటుంది. కాయగూరలను రోస్ట్, బేక్ లేదా ఆవిరిలో ఉడికించటం వలన పోషకాలు పోకుండా ఉంటాయి. చిలకడదుంప,క్యారట్లు, కాలిఫ్లవర్లు, బ్రోకోలి, బీట్ రూట్లు కూడా మీ బిడ్డకి మంచివి.

• జున్ను

మీ బేబీకి పాల ఉత్పత్తులకి, జున్నుకి అలర్జీ లేకపోతే వాటిని కూడా మీ బిడ్డ డైట్లో చేర్చవచ్చు. మెత్తని, పాశ్చరైజ్డ్ జున్నును ఎంచుకోండి. అతుక్కునే, వాసనవచ్చే రకాలను బేబీకి ఇవ్వకూడదు.

English summary

The Best Finger Foods For Your Toddler

If your baby is turning more than six months, then it's time to feed your baby with finger foods. If your baby can sit on his own, if he has a pincer grasp, etc., you will know that you can start feeding your baby with finger foods. Also, make sure the food for your baby is not sticky.After the baby is comfortable with soft and puree-like foods
Desktop Bottom Promotion