కవల పిల్లలను సంరక్షించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొత్తగా ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు పుట్టి ఉంటే, బిడ్డను చూసుకోవడం ఎంత కష్టతరం గా ఉంటుంది? ఎంత అలసటగా ఉంటుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి, వాళ్ళే చెబుతారు. అలాంటిది, కవలలు పుట్టిన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఒకే సారి పుడితే ఆనందం రెండింతలు అవుతుంది, అందంతో కూడిన ఆనందం రెండింతలు అవుతుంది మరియు ఆశీర్వాదాలు రెండు రెట్లు అధికమవుతాయి.

కానీ, వీటికి తోడుగా వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా రెండింతలు అవుతాయి. ఒక బిడ్డను సంరక్షించాలంటే ఎంత శ్రద్ద పెట్టాలో అంతకు రెండింతలు శ్రద్ద కవలల సంరక్షణ విషయంలో పెట్టవలసి ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీకు రెండు అవసరమవుతాయి. దీంతో మీ ఖర్చులు కూడా రెండింతలు అవుతాయి మరియు మీ ఆర్ధిక పరిస్థితి పై కూడా కొద్దిగా ప్రభావం చూపుతాయి.

కానీ, మీకు ఒకరు కాకుండా, కవలలతో ఆనందంగా ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదించినట్లైతే, అటువంటి సమయంలో అస్సలు కోపం, చిరాకు తెచ్చుకోకండి. ఎంతో అధిక ఆనందంతో వ్యవహరించండి. ఇద్దరు కవలలను చూసుకోవడం అసాధ్యమైన పని ఏమి కాదు. అందుకోసం మీరు మొదట చేయవలసింది ఒక మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం.

మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరు కలిసి కవల పిల్లలను చూసుకోవచ్చు అని ఎప్పుడు కానీ అనుకోకండి. ఎందుకంటే అలా చేయడం మీకు కష్టతరం అవుతుంది, మీ శక్తి కూడా సరిపోకపోవచ్చు. మీరు గనుక ఉమ్మడి కుటుంబంలో గనుక ఉంటే మీకు ఎంతో మంది సహాయ సహకారాలను అందిస్తారు.

మీది గనుక చిన్న కుటుంబం అయితే, అటువంటి సమయంలో ఒక పని మనిషి సహాయం లేదా మీ తల్లి దండ్రులు లేక అత్త మామల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

కవల పిల్లలను మంచిగా సంరక్షించుకోవడానికి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవి మీకు ఎంత గానో ఉపయోగపడతాయి.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీ యొక్క శారీరిక మరియు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం:

మీ యొక్క శారీరిక మరియు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం:

మీరు గనుక ఆనందంగా మరియు విశ్రాంతంగా ఉండినట్లైతే, మీ పిల్లలు కూడా విశ్రాంతంగా మరియు ఆనందంగా ఉంటారు. కొత్తగా ఇద్దరు కవల పిల్లలు జన్మించినప్పుడు, రాత్రి పూట నిద్ర పట్టడం చాలా కష్టం అవుతుంది. కానీ, అలాంటి సమయం లో మీకు నిద్ర పోవడానికి దొరికే ప్రతి క్షణాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి.

మీరు ఏదైనా ఇంటి పనులు చేస్తున్న సమయంలో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కొద్ది సేపు పిల్లల్ని చూసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మీకు కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది. అంతే కాకుండా మీరు కొద్దిగా ఆహారాన్ని కూడా బాగా తీసుకోండి.

కవల పిల్లలకు తల్లి పాలు పట్టడం:

కవల పిల్లలకు తల్లి పాలు పట్టడం:

కవల పిల్లలకు పాలు పట్టడం అనేది కష్టతరమైన పనే కావొచ్చ కానీ, అసాధ్యమైన పని అయితే కాదు. అవసరమయ్యే మేర పాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం మన శరీరానికి ఉంది. కాబట్టి , పాలు సరిపోతాయా లేదా అని ఎక్కువగా ఆందోళన చెందకండి. ఇద్దరికీ ఒకటే సారి పాలు పడితే పని అయిపోతుంది అని మీరు భావిస్తూ ఉండవచ్చు. కానీ, ఇలా చేయటం కొద్దిగా కష్టతరమైన విషయం. అంతే కాకుండా కవల పిల్లలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విభిన్న అవసరాలు ఉంటాయని గుర్తించండి.

మీరు గనుక తల్లి పాలను ఒకరి తరువాత ఒకరికి తల్లి పాలు ఇవ్వాలి అని భావించినట్లైతే, అటువంటి సందర్భములో మీకు రోజంతా పాలు ఇచ్చినట్లే ఉంటుంది. మీరు గనుక కచ్చితంగా తల్లి పాలే ఇవ్వాలి అని నిశ్చయించుకున్నట్లైతే, అటువంటి సమయంలో మీరు ఎక్కువ పాలను బయటకు తీసి మరియు అవసరమైన మేర పాలను నిల్వ ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఒక బిడ్డకు స్థనాల ద్వారా, మరొక బిడ్డకు పాల బాటిల్ ద్వారా పాలు ఇవ్వవచ్చు. ఆ తరువాత పాలు ఇచ్చేటప్పుడు వరుస క్రమంలో పిల్లలకు ఒక్కోసారి ఒక్కోలా పాలు ఇచ్చే విధానాన్ని మార్చుకోవచ్చు,.

కవలలు ఉన్నప్పుడు దైనందిక పనులను నిర్వహించడం.

కవలలు ఉన్నప్పుడు దైనందిక పనులను నిర్వహించడం.

ఎప్పుడైతే కవల పిల్లలు పెద్దవారు అవుతారో, అటువంటి సమయంలో మీ పని సులభతరం అవుతుంది. అప్పుడు మీరు పనులు చేసుకుంటూ వారిని ఆడుకోమని చెప్పవచ్చు. ఇద్దరికీ ఒకటేసారి స్నానం చేపించటం వల్ల, ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. వాళ్లు అప్పుడే కొత్తగా జన్మిచినప్పుడు, ఇలా చేయించడం వీలుకాదు.

మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఎంత సమయం పడుతుందో, అందుకు మూడింతలు సమయం వారికోసం కేటాయించవలసి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు బాగా ఆలస్యమవుతుంది. మీరు గుర్తించవలసిన అంశం ఏంటంటే, ఎక్కువ సమయం పాటు మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఒకే చోట ఉండవు.

కవల పిల్లలను చూసుకుంటూ ఉద్యోగాన్ని చేయాలని అనుకోవడం

కవల పిల్లలను చూసుకుంటూ ఉద్యోగాన్ని చేయాలని అనుకోవడం

పిల్లలను చూసుకుంటూ ఉద్యోగం చేసుకోవడం అనేది కొద్దిగా కష్టతరమైన పని. మీకు కవలలు పుట్టారని మీకు ఇచ్చే ప్రసూతి సెలవుల్లో ఎటువంటి మార్పు ఉండదు. మీ పిల్లలను చూసుకోవాలని భావించినట్లైతే, మీ పనిని త్వరగా ముగించుకొని లేదా మీ పనిని కొద్ది సేపు పక్కన పెట్టి వారిని చూసుకోవాల్సి ఉంటుంది.

ఒక మంచి శక్తివంతమైన మద్దత్తు వ్యవస్థ మీ పిల్లలను మరియు ఇంటి పనులను చూసుకోవాలంటే చాలా అవసరం.

మీ పరిస్థితులలో ఉండే మనుష్యులనే వెతకడం

మీ పరిస్థితులలో ఉండే మనుష్యులనే వెతకడం

ఎవరికైతే కవలలు పుట్టారో వారితో మాట్లాడటం వల్ల మీకు అది ఎంతో గొప్పగా సహాయపడుతుంది. మీ చుట్టు పక్కల కవలలను కన్న తల్లి దండ్రులు ఎవరైనా ఉన్నారా అని గమనించండి. అంతే కాకుండా అంతర్జాలంలో కవలల కోసం ప్రత్యేకంగా సహాయం చేయడానికి ఉండే కమ్యూనిటీలను సంప్రదించండి. మీకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

English summary

Taking Care Of Twins

Having twins is like having double the joy, a double dose of cuteness and a double shower of blessings. But with it all comes double the trouble too. Twins require twice the amount of care that a single baby would need.