For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ ఎండాకాలం మీ బేబీని చల్లగా,హాయిగా ఉంచే మార్గాలు

  |

  ఎండాకాలం వచ్చేసింది, దేశంలో అందరూ అప్పుడే చెమటలు కక్కుతూ, ఉక్కపోతకి, వేడికి అల్లాడిపోతున్నారు.

  మనందరికీ ఎండాకాలంలో చాలా సమస్యలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఈ రుతువు తల్లులకి పీడకలలాంటిది, ఎందుకంటే వారి చిట్టిపాపాయిలు ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ బాధపడతారు. బేబీలు ఎక్కువ వేడి, ఉష్ణోగ్రతలను తట్టుకోలేరు, పైగా ఎక్కువ వేడి వలన చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది;

  Ways To Keep Your Baby Cool This Summer ,

  పాపాయిల సున్నితమైన చర్మం వేడి, చెమటను సరిగ్గా భరించలేదు. వారికి ర్యాషెస్, చర్మంపై మంట వచ్చి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వీటివల్ల పాపాయి చిరాకుగా మారి, తల్లులు అనుక్షణం బాధపడుతుంటారు.

  వారిని చల్లగా ఉంచడం మరో పెద్ద పని, ఎందుకంటే చల్ల డ్రింక్స్, రసాలు,పండ్లు ఎంతవరకు పసిపిల్లలకి ఆరోగ్యకరమో మనకి తెలీదు. సరే మరి ఇలాంటి సందర్భాలలో తల్లులు ఏం చేయాలి?

  మీ బేబీని చల్లగా అలాగే సౌకర్యంగా ఉంచటం నిజంగానే సున్నితమైన బ్యాలెన్స్ అవుతుంది. దీన్ని మీరు ఎంత త్వరగా నేర్చుకోగలిగితే మీ బేబీని, మిమ్మల్ని అంత సంతోషంగా ఉంచుకోగలరు. మేమిక్కడ ఎలాగో మీ కోసం సాయంగా ఎప్పుడూ ఉంటాము కాబట్టి,ఈ 'ఎండాకాలం’ సమస్యని కూడా ఎదుర్కోవటానికి మంచి చిట్కాలు మీకు ఇక్కడ దొరుకుతాయి.

  బోల్డ్ స్కైలో మేము ఈరోజు మీ ముద్దుల పాపాయిని సౌకర్యంగా, సంతోషంగా ఉంచటానికి కొన్ని చిట్కాలు అందిస్తున్నాం.

  ఈ భరించలేని ఎండాకాలం రోజుల్లో మీ పాపాయిని చల్లగా ఉంచే కొన్ని పద్ధతులు ఇవిగో.

  1. సరైన బట్టలు వేయండి;

  1. సరైన బట్టలు వేయండి;

  మీ బేబీ సంరక్షణలో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్. వారికి సరిగ్గా వదులైన కాటన్ బట్టలు,పోగులు లేవనివి చూసి వేయండి. మెత్తని గాలాడే బట్టలు చెమటను పీల్చుకుని, ర్యాషెస్ రాకుండా సాయపడతాయి. స్లీవ్ లెస్ బనియన్లు, షార్టులు కూడా చాలా సమయాల్లో బానేఉంటాయి.

  2.రోజుకి కనీసం రెండు సార్లు స్నానం చేయించండి;

  2.రోజుకి కనీసం రెండు సార్లు స్నానం చేయించండి;

  బేబీలు చాలామటుకు ఇంట్లోనే ఉన్నా వారి శరీరంపై మురికి త్వరగా చేరిపోతుంటుంది. రోజుకి కనీసం రెండుసార్లు స్నానం చేయించటం వలన వారి చర్మంపై చెమట, సూక్ష్మజీవులు లేకుండా ఉంటాయి. గోరువెచ్చని నీరే వాడాలని గుర్తుంచుకోండి, అలాగే వారు ఎక్కువసేపు తాజాగా, పొడిగా ఉండటానికి బేబీ పౌడర్ ఉపయోగించండి.

  3.డైపర్లను ఎక్కువగా వాడటం తగ్గించండి;

  3.డైపర్లను ఎక్కువగా వాడటం తగ్గించండి;

  మీ బేబీలను హైడ్రేటడ్ గా ఉంచడం చాలా ముఖ్యమే కానీ డైపర్ ను ఎక్కువ సమయంపాటు వాడకండి. డైపర్లను ప్లాస్టిక్ తో తయారుచేస్తారు, వీటితో గాలాడదు, ఇంకా తొందరగా ర్యాషెస్ కూడా రావచ్చు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు ఇవి బేబీకి చాలా అసౌకర్యంగా ఉండవచ్చు. సమయానికి వారిని బాత్ రూంకి తీసుకెళ్తుండటం, కాటన్ లోదుస్తులు వాడటం చేయండి.

  4.బేబీలకి ఎక్కువ ద్రవపదార్థాలను ఇస్తుండండి

  4.బేబీలకి ఎక్కువ ద్రవపదార్థాలను ఇస్తుండండి

  ఎండాకాలంలో మీ పాపాయిలకి రోజంతా కొంచెంకొంచెంగా మంచినీళ్లను పట్టించటం ముఖ్యం. కొబ్బరినీళ్ళు లేదా పండ్ల రసాలు సరిపోయేంత మెల్లగా వారికి ఇస్తూ ఉండటంవలన హైడ్రేటడ్ గా ఉంటారు. ఈ ద్రవపదార్థాలు బేబీ శరీరంలో వేడిని కూడా క్రమబద్ధం చేసి, ఎక్కువ వేడి వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి.

  5. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బేబీలను బయటకి వెళ్ళనివ్వద్దు

  5. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బేబీలను బయటకి వెళ్ళనివ్వద్దు

  బయట చేసే పనులను సాయంత్రాలకే పరిమితం చేయండి, ఎందుకంటే మీ పాపాయి కూడా అన్ని సమయాలలో మీతో పాటే ఉంటుంది. మధ్యాహ్నం గంటల్లో ఎండ చాలా ఎక్కువగా ఉండి మీకూ, మీ కన్నా ఎక్కువ మీ పాపాయికి హాని ఎక్కువ చేస్తుంది. ముఖ్యమైన మీటింగ్ లను, పనులను చల్లబడిన సమయాలలో పెట్టుకోండి. అది కుదరకపోతే ఇంట్లో ఎవరన్నా బేబీని చూసుకోడానికి ఉండేలా ప్రయత్నించండి.

  6. నూనెతో మసాజ్ లకి దూరంగా ఉండండి

  6. నూనెతో మసాజ్ లకి దూరంగా ఉండండి

  ఎండాకాలంలో పాపాయిలకి నూనె మసాజ్ లు పూర్తిగా మానేయండి, ఎందుకంటే అవి చాలా సమస్యలను తెస్తాయి. మొదటగా నూనెను శరీరంపై నుంచి వదిలించటం కష్టమయి, వారి చర్మం అంతా జిడ్డుగా మారిపోతుంది. అక్కడ చెమట చేరి బేబీకి తొందరగా హీట్ ర్యాషెస్ వచ్చేస్తాయి.

  7.మీ బేబీని వేడినుంచి రక్షించండి;

  7.మీ బేబీని వేడినుంచి రక్షించండి;

  ఎండాకాలంలో బయటకి వెళ్ళేముందు, సాయంత్రాలలో కూడా, మీ పాపాయి తలను క్యాప్ లేదా హ్యాట్ తో కప్పి ఉండేలా చూడండి. బేబీ తల వేగంగా వేడెక్కుతుంది, అది మెల్లగా శరీరంలో ఉష్ణోగ్రత పెరగటానికి కూడా కారణం అవుతుంది. మీ బేబీ తల కప్పివుంచటం వలన వారు చల్లగా, సౌకర్యంగా ఉంటారు. లోపలికి వచ్చాక క్యాప్ తీసేయొచ్చు.

  8.మీ బేబీ శరీరంపై ఉష్ణోగ్రత దగ్గరగా పరిశీలిస్తూ ఉండండి;

  8.మీ బేబీ శరీరంపై ఉష్ణోగ్రత దగ్గరగా పరిశీలిస్తూ ఉండండి;

  మీ పాపాయికి నిజంగానే వేడిగా ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? వారి మెడ వెనకాల చెయ్యిపెట్టి చూడండి. ఇది బేబీకి వేడి చేసిందో లేదో తెలియటానికి ఖచ్చితమైన మార్గం. మీ పాపాయి వేడిగా ఉన్నట్లయితే, వారికి వెంటనే ద్రవపదార్థాలు పట్టించి, ఎక్కువగా ఉన్న బట్టలను తీసేయండి.

  బేబీ మీకు తనకి ఎలా ఉందో చెప్పలేకపోవచ్చు. కానీ ఎప్పుడూ ఆగకుండా కొన్ని హింట్లను అయితే ఇస్తుంది. అవేంటో గమనిస్తూ, తగినట్లు పనిచేసి, వారికి,మీకూ ఇద్దరికీ సమ్మర్ అంటే సెలవులు, ఆనందంగా మాత్రమే మార్చుకోండి.

  English summary

  Ways To Keep Your Baby Cool This Summer

  Hot scorching summer is here and your baby may feel very uncomfortable due to the weather conditions. But dressing up with the right clothing can help your baby beat the heat. In a day, make sure to atleast bath your baby twice a day and avoid using diapers. Avoid taking your baby out during the day and keep your house cool.
  Story first published: Tuesday, April 17, 2018, 13:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more