For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీకి పాలు పట్టిన తర్వాత బర్పింగి ( త్రేన్పు) రావడానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి

|

మీ నవజాత శిశువు మృదువైన గుండ్రని తలను తరచుగా నిమరడం, వారి చిట్టి చిట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి తరచుగా ఆడుకోవడం తల్లిదండ్రులుగా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంటుంది. క్రమంగా మీ శిశువు సంరక్షణల నిమిత్తం, అనేక మంది పెద్దలు మరియు వైద్యుల సహకారంతో వీరిపట్ల ప్రత్యేక శ్రద్దను కలిగి ఉంటారు. ఏ చిన్న అవాంతరం మీ శిశువుకు తలెత్తకుండా ఉండేలా సంరక్షణా చర్యలను తీసుకుంటూ ఉంటారు. అవునా ?

అదేక్రమంలో భాగంగా మీ బిడ్డ ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత, త్రేన్పులు వచ్చే వరకు భుజం మీద వేసుకుని వెన్ను నిమరడం అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. అంతేకాకుండా నిద్రించే సమయంలో ఆ బిడ్డను భిన్న వైపులకు తరచూ మార్చడం కూడా ఎంతో ముఖ్యంగా చెప్పబడుతుంది. క్రమంగా ఈ చర్యలు మీ నవజాత శిశువు హాయిగా నిద్రపోవడానికి మాత్రమే కాకుండా, వారి మానసిక, శారీరిక ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది అంటే అతిశయోక్తికాదు.

నేడు, మీ బోల్డ్స్కై మీ నవజాత శిశువుకు ఫీడింగ్ చేసిన తరువాత తప్పనిసరిగా త్రేన్పులు తెప్పించడానికి గల ప్రాముఖ్యతను మీతో పంచుకుంటుంది.

వారు తీసుకునే ఆహరం కొంచమే అయినా, ఆ ఆహారంతో పాటుగా వీలైనంత గాలిని నోటి ద్వారా పీల్చుకోవడం జరుగుతుంటుంది. ఈ గాలి జీర్ణకోశ వ్యవస్థలో చిక్కుకుపోతుంది, ఇది వీలైనంత త్వరగా బయటకు విడుదల కావాలి.

ఈ గాలిని తరచుగా విడుదల చేయని పక్షంలో, శిశువు తరచుగా అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంది. మరియు ఇది కడుపులో అనేక సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. క్రమంగా ఉబ్బరం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఈ చిన్న గాలి బుడగలు మీ శిశువు కడుపులో పేరుకొన్నప్పుడు, అవి కడుపును పూర్తిస్థాయిలో నింపిన అనుభూతికి లోను చేస్తాయి, మరియు అసౌకర్యానికి దారితీస్తాయి. అంతేకాకుండా ఒక్కోసారి ఉబ్బరానికి కూడా దారితీయవచ్చునని నిపుణుల అభిప్రాయం. ఈ అసౌకర్యమైన భావన కారణంగా స్వయంచాలకంగా శిశువు ఏడవటం లేదా చిడిపెట్టడం చేస్తుంది.

కావున తల్లిదండ్రులుగా, శిశువు త్రేన్పుల గురించిన కొన్ని విషయాలపట్ల అవగాహనను కలిగి ఉండడం ముఖ్యం. క్రమంగా వారు శిశువులకు త్రేన్పులను తెచ్చే విధానం గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఒక ఫీడ్ తర్వాత మీ చిన్నారికి ఎందుకు ఖచ్చితంగా త్రేన్పులు తెప్పించాలి, అన్న విషయం గురించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

శిశువుకు త్రేన్పులు ఎలా వస్తాయి?

శిశువుకు త్రేన్పులు ఎలా వస్తాయి?

పిల్లలు తమ కడుపులో గాలిని చేర్చుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి. ఒకటి జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా, రెండవది ఆహారం వినియోగించే సమయంలో తరచుగా గాలిని మింగడం, మరియు మూడవదిగా ఆహారం సరిపడకపోవడంగా (శిశువు జీవక్రియలు మీరు ఇచ్చే ఆహారాన్ని ఒప్పుకోకపోతే) ఉంటుంది.

శిశువుకు త్రేన్పులు ఎలా తెప్పించవచ్చు ?

శిశువుకు త్రేన్పులు ఎలా తెప్పించవచ్చు ?

మీ శిశువుకు సులభంగా త్రేన్పులు తెప్పించేందుకు, ప్రధానంగా రెండు ఉత్తమ మార్గాలు ఉన్నాయి. మీ శిశువును మీ భుజాల మీద ఉంచుకుని, శిశువు తలను నిటారుగా ఉంచి, వీపు మీద మృదువుగా తరచుగా నొక్కండి. కొన్ని నిమిషాల తర్వాత మీరు వెంటనే ఒక చిన్న త్రేన్పును వింటారు.

త్రేన్పు కోసం కూర్చునే పొజిషన్ :

త్రేన్పు కోసం కూర్చునే పొజిషన్ :

మరొక పొజిషన్ మీ బిడ్డను మీ ఒడిలో కూర్చోబెట్టుకోవడం. క్రమంగా మీ చేతులను ఉపయోగించడం ద్వారా బిడ్డ దేహానికి మరియు తలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మీ మరో చేతితో బిడ్డను వెనక్కి తిప్పి, శిశువుకు త్రేన్పు వచ్చేలా చేయడానికి ప్రయత్నించండి.

బాబును ఎప్పుడెప్పుడు త్రేన్పులు తెప్పించాల్సి ఉంటుంది ?

బాబును ఎప్పుడెప్పుడు త్రేన్పులు తెప్పించాల్సి ఉంటుంది ?

ఫీడ్ చేసిన తరువాత మీ శిశువుకు, ఫీడింగ్ విరామాల మద్య సమయంలో త్రేన్పులు వచ్చేలా చేయడం అవసరంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి పాలను ఇస్తున్న సమయంలో, రొమ్మును మార్చే ముందు శిశువుకు త్రేన్పు వచ్చేలా చేయడం తప్పనిసరి.

ఆ త్రేన్పు సరిపోతుందా ?

ఆ త్రేన్పు సరిపోతుందా ?

త్రేన్పు వచ్చిన తర్వాత కూడా మీ శిశువు అసౌకర్యాన్ని కలిగి ఉంటే, అది కేవలం కడుపులో ఇంకా మిగిలి ఉన్న గ్యాస్ కారణంగానే అని అర్థం. ఈ వాయువును తొలగించడానికి, మీ పెద్దల లేదా వైద్యుల సహకారంతో ఇతర పద్ధతులను కూడా ప్రయత్నించండి; కానీ ఆ పద్దతులన్నీ విఫలమవుతుంటే, మీ శిశువు మేలుకునే వరకు పొట్ట మీదే నిద్రించేలా ప్రయత్నించండి. క్రమంగా మీ శిశువు సౌకర్యవంతంగా ఉన్నట్లు భావించడానికి ఈ పద్దతి సహాయపడుతుంది.

శిశువుకు త్రేన్పులు రాని పక్షంలో ?

శిశువుకు త్రేన్పులు రాని పక్షంలో ?

శిశువుకు తరచుగా త్రేన్పులు రాని పక్షంలో, కడుపులోని వాయువు వారికి భారంగా మారి అసౌకర్యానికి దారితీస్తుంది. క్రమంగా తిన్న ఆహారం తరచుగా బయటకు వచ్చేయడానికి కూడా కారణం అవుతుంది. కావున త్రేన్పులు ఖచ్చితంగా రావాలని గుర్తుంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక మాతృత్వ శిశు సంక్షేమ, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Do You Know The Importance Of 'Baby Burping'

Did you know, that the most important thing to do after breastfeeding your child is allowing them to burp. This is important, we tell you why, take a look.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more