For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవ జాత శిశువుల్లో న్యూమోనియా : లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ..

వైద్యులు పిల్లల్లో న్యూమోనియా వ్యాధి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. ముందుగా పిల్లల రూపాన్ని, ముఖ్యమైన సంకేతాలను మరియు శ్వాస విధానాలను డాక్టర్ తనిఖీ చేస్తారు.

|

నవజాత శిశువుల్లో మరణానికి ప్రధాన కారణం న్యూమోనియో. ప్రపంచంలో ప్రతి 39 సెకన్లకు ఒక పసిబిడ్డను ఈ వ్యాధి బలి తీసుకుంటోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయినా ఈ భయంకరమైన న్యూమోనియా వ్యాధిపై చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకే ఈ వ్యాధిపై ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిచేందుకు గాను వరల్డ్ న్యూమోనియా డే ను ప్రతి సంవత్సరం నవంబర్ 12వ తేదీన జరుపుకుంటున్నారు.

Pneumonia In Babies

న్యూమోనియా కలిగించే వైరస్ వల్ల ఊపిరితిత్తుల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి గాలి కలుషితమై నిండిపోతుంది. ఇది శరీరంలో మంటను పుట్టిస్తుంది. అలాగే ఊపిరితిత్తులను ద్రవం మరియు చీముతో నింపుతుంది. దీన్ని ప్రపంచంలో మరణానికి కారణమయ్యే ప్రధాన వ్యాధుల్లో ఎనిమిదో దానిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ వ్యాధి నివారణకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఒకసారి ఇది సోకితే దీనిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సందర్భంగా న్యూమోనియా గురించి మీ పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

శిశువు పొట్ట పెరగడం, తగ్గడం..

శిశువు పొట్ట పెరగడం, తగ్గడం..

న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది చిన్నపిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అందువల్ల ఈ వ్యాధిని ప్రారంభంలో గుర్తిస్తే మనం దీని బారి నుండి పిల్లలను రక్షించవచ్చు. పిల్లలు నిద్రించే సమయంలో వారి పొట్టను బాగా గమనించండి. వారి పొట్ట ఉన్నట్టుండి పెరగడం లేదా ఉన్నట్టుండి తగ్గిపోవడం వంటివి జరిగితే, పిల్లలకు రెండు నెలల కన్నా వయస్సు ఉన్నప్పుడు 60సార్లు కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటుంటే ఆ బిడ్డకు న్యూమోనియా సోకినట్లు గుర్తించాలి. ఉబ్బసం ఉన్న తల్లిదండ్రులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.

పిల్లల్లో న్యూమోనియాకు కారణాలు..

పిల్లల్లో న్యూమోనియాకు కారణాలు..

న్యూమోనియా అనేది పుట్టిన రోగి నుండి వంద సంవత్సరాలలోపు ఎవరికైనా రావచ్చు. అలాగే తల్లి కడుపులో ఉన్న సమయంలో ఆమె గర్భంలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల కూడా న్యూమోనియా రావచ్చు. శిశువులలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులతో పాటు వివిధ రకాలైన సూక్ష్మక్రిములతో ఈ వ్యాధి సంభవిస్తుంది. న్యూమోనియా ఎక్కువగా అడెనోవైరస్, రినోవైరస్, ఇన్ ఫ్లూ ఎంజా వైరస్(ఫ్లూ), రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్(RSV) మరియు పారా ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా 5 సంవత్సరాల వయస్సులోపు పిల్లల్లో రావచ్చు. అలాగే మైకో ప్లాస్మా న్యూమోనియా కారణంగా 5 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్యగల పిల్లల్లో అయితే తరచుగా రావచ్చు.

పసిబిడ్డల్లో న్యూమోనియా లక్షణాలు..

పసిబిడ్డల్లో న్యూమోనియా లక్షణాలు..

పసిబిడ్డల్లో న్యూమోనియా లక్షణాలు మనం నిర్దిష్టంగా గుర్తించలేము. అవి ఛాతీ సంక్రమణ యొక్క స్పష్టమైన సంకేతాలను చూపించకపోవచ్చు. ఇక పిల్లల్లో న్యూమోనియా లక్షణాలను పరిశీలిస్తే

తరచూ జ్వరం రావడం

శక్తి కోల్పోవడం లేదా గట్టిగా శ్వాస తీసుకోవడం

శ్వాసతో వచ్చే సౌండ్ తో తినడంలో ఇబ్బంది ఎదుర్కోవడం.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..

మీ పిల్లవాడి శరీరంలో పైన ఉన్న లక్షణాలను చూపిస్తు ఉంటే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లండి. మీరు ఆలస్యం చేసినా లేదా నిర్లక్ష్యం చేసినా మీ పిల్లవాడు మరింత శక్తిని కోల్పోతాడు. శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది పడతాడు. అలాగే పిల్లవాడికి ఆకలికి సంబంధించి సంబధించి జరిగే మార్పులు చాలా బాధపెడతాయి.

న్యూమోనియా నిర్ధారణ ఇలా..

న్యూమోనియా నిర్ధారణ ఇలా..

వైద్యులు పిల్లల్లో న్యూమోనియా వ్యాధి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. ముందుగా పిల్లల రూపాన్ని, ముఖ్యమైన సంకేతాలను మరియు శ్వాస విధానాలను డాక్టర్ తనిఖీ చేస్తారు. అలాగే వారి ఊపిరితిత్తుల నుండి వచ్చే అసాధారణ శబ్దాలను కూడా తనిఖీ చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో అవసరం అయితే పిల్లల ఛాతీ ఎక్స్ రే లేదా రక్తపరీక్షలను కూడా చేస్తారు. అనంతరం న్యూమోనియా వ్యాధి సోకిందా లేదా అన్నది నిర్ధారిస్తారు.

ఇంటి నుండే చికిత్స చేయొచ్చా..

ఇంటి నుండే చికిత్స చేయొచ్చా..

చాలా సందర్భాలలో న్యూమోనియాకు సంబంధించి ఇంటి నుండే చికిత్స చేయవచ్చు. కానీ శిశువులకు చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో ఇంట్రావీనస్ (ఐవి) యాంటీ బయాటిక్స్ మరియు శ్వాసకోశ చికిత్సలు ఉంటాయి. అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో మరింత తీవ్రమైన కేసులకు చికిత్స చేయవచ్చు. అలాగే పిల్లల్లో నొప్పి మరియు వాపును తగ్గించడానికి వైద్యులు సాధారణంగా కొన్ని యాంటీబయాటిక్‌లను సూచిస్తారు.

న్యూమోనియా నివారణకు..

న్యూమోనియా నివారణకు..

శిశువులలో న్యూమోనియా నివారణకు పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలి. ఇలా ఒక ఆరు నెలల నుండి సంవత్సరం వరకు ఇవ్వాలి. దీని వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మీ ఇంటిని చలికాలంలో వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోండి. జలుబు, ఫ్లూ లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వ్యక్తులకు సాధ్యమైనంత మేర దూరంగా ఉంచాలి.

చివరగా ఇవి చేయండి..

చివరగా ఇవి చేయండి..

మీ బిడ్డకు సరైన విశ్రాంతి లభించేలా జాగ్రత్తలు తీసుకోండి. దీని వల్ల న్యూమోనియా సోకిన శరీరం సంక్రమణతో పోరాడటానికి పని చేస్తుంది.ఒకవేళ మీ పిల్లలకి బ్యాక్టీరియా న్యూమోనియో ఉంటే మరియు డాక్టర్స్ యాంటీ బయాటిక్స్ సూచించినట్లయితే డాక్టర్ నిర్ధేశించినంత కాలం షెడ్యూల్ ప్రకారం మందులు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ బిడ్డ వేగంగా ఈ వ్యాధి కోలుకునేందుకు సహాయపడుతుంది. అలాగే ఈ న్యూమోనియా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. చివరగా మీ బేబీ టెంపరేచర్ (ఉష్ణోగ్రత)ను ప్రతి ఉదయం మరియు ప్రతి సాయంత్రం ఒక్కసారైనా తీసుకోండి. 38 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను పిలవండి.

English summary

Pneumonia In Babies: Causes, Symptoms, Diagnosis And Treatment

World pneumonia day is observed on 12 november every year. Read on to know the pneumonia in babies: Causes, symptoms, diagnosis and treatment
Story first published:Monday, November 11, 2019, 19:00 [IST]
Desktop Bottom Promotion