For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తినే ఆహారం సరి చూసుకోండి!

తినే ఆహారం సరి చూసుకోండి!

By B N Sharma
|

Food Which Causes Miscarriage
గర్భంలో వున్న బేబీ ఆరోగ్యం తల్లి తినే ఆహారాలపై ఆధారపడివుంటుంది. గర్భవతి తినే ఆహారాలపట్ల జాగ్రత్తగా వుండాలి. సరైన ఆహారంతినకపోతే అది గర్భవిచ్ఛిన్నానికి కారణమవుతుంది. గర్భవిచ్ఛిన్నానికి కారణమయ్యే ఆహారాలు కొన్ని పరిశీలించండి.

1. మీరు చేప అంటే ఇష్టపడేవారైతే, గర్భం ధరించిన తర్వాత చేప ఆహారం వదిలేయండి. చేప ఆహారం మంచిదే. కాని కలుషితమైన నీటిలో వుండే చేపలో వివిధ రకాల బాక్టీరియా కూడా చేరి వుంటుంది.
2. మాంసం, గుడ్లు తినేటపుడు జాగ్రత్త. పచ్చి మాంసం, సీఫుడ్, కోడి ఉత్పత్తులు తినకండి. ఏది తిన్నప్పటికి బాక్టీరియాను తొలగించేందుకు బాగా వండినది మాత్రమే తినండి.
3. లిస్టేరియా అనే బాక్టీరియా గర్భవిచ్ఛిన్నాన్ని కలిగిస్తుంది. ఇది వండని మాంసం, చికెన్, సీఫుడ్, ఛీజ్, పాలు మొదలగు వాటిలో వుంటుంది.
4. దిగుమతి చేసుకొనే మెత్తటి ఛీజ్ తినకండి.
5. నిల్వవుంచిన సీఫుడ్లు, మాంసం మొదలైనవి కూడా హానికరమే. పైన్ ఆపిల్, బొప్పాస కాయ కూడా కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి.
6. గర్భవతిగా వున్నపుడుఆహార పరిశుభ్రత అత్యవసరం. తినే ఆహారంలో ఏ మాత్రం కలుషితం లేక అశుభ్రత వంటివి వుంటే అవి మీ ఆరోగ్యానికి బిడ్డ భధ్రతకు హాని కరంగా వుంటాయి. పండ్లు కూరల వంటివి తినేముందు లేదా వండేముందు బాగా కడిగి శుభ్రం చేయండి.
7. ఏ ఆహార పదార్ధం కొన్నప్పటికి తయారీ తేదీ చూసి తాజా వస్తువులు మాత్రమే కొనండి.

English summary

Food Which Causes Miscarriage | తరచుగా గర్భవిచ్ఛిన్నమా?

Miscarriage during an early stage of pregnancy (first trimester) is very common and can be triggered by these miscarriage-inducing food items.
Desktop Bottom Promotion