For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టాలంటే...ముందుగా?

By B N Sharma
|

When To Go For IVF Treatment?
చాలామంది సెలబ్రిటీలు నేటి రోజులలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణలు చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గర్భం ధరించాలనుకునే జంటలకు టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ తేలిక పరిష్కారంగా మీరు భావిస్తూంటారు. కాని, మోసపోకండి. టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనివ్వడం చాలా క్లిష్టమైనది, వ్యవయంతో కూడినది కూడాను. కొన్ని కేసులలో, ఐవిఎఫ్ చికిత్స మాత్రమే మీకు పరిష్కారంగా వుంటుంది. కాని కొన్ని ఐవిఎఫ్ కేంద్రాలు, మీరు గర్భవతి సహజంగా అయ్యే అవకాశాలున్నప్పటికి వారి వ్యాపారం కోసం మిమ్మల్ని టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణలకు ప్రోత్సహిస్తాయి.

మరి ఈ టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ ఎపుడు లేదా ఏ ఏ పరిస్ధితులలో చేయించుకోవాలి?
1. మీరు ఎప్పటినుండి గర్భానికి ప్రయత్నిస్తున్నారు?
కనీసం రెండు సంవత్సరాలనుండైనా మీరు గర్భం కొరకు ప్రయత్నం చేస్తూండాలి. రెండు సంవత్సరాలు కూడా కాకుండా టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణకు వెళ్ళకండి. మీలోని ఫేలోపియన్ ట్యూబులు బ్లాక్ అవటం లేదా, వీర్యకణాలు తక్కువగా వుండటం, వుంటే తప్ప మీరు రెండు సంవత్సరాలు వేచి వుండటం మంచిది. అదృష్టం ఎపుడైనా మిమ్మల్ని వరించవచ్చు. రోజూ కాకపోయినా, ఏదో ఒక రోజు మీకు తప్పక గర్భం సహజంగా రావచ్చు.

2. మీ వయసు ఎంత?
మీరు ఇరవైలలో వుంటే, ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం వున్నట్లే. టెస్ట్ ట్యూబ్ బేబీని ఇరవైలలో పొందాల్సిన అవసరం లేదు. సాధారణంగా ముఫ్ఫై లలో మాత్రమే ఫలదీకరణ సమస్యలు వస్తాయి. కాని అదికూడా ముఫ్ఫైల చివరి భాగంలోనే అనేది గుర్తుంచుకోండి. ముఫ్ఫైల చివరి భాగంలో త్వరపడాల్సిందే. టెస్ట్ ట్యూబ్ బేబీ కొరకు నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఇక మెనోపాజ్ కు దగ్గర పడే అవకాశాలుంటాయి కనుక.

3. మీ ఫేలోపియన్ ట్యూబులు బ్లాక్ అయ్యాయా?
చాలామంది తమ ఫేలోపియన్ ట్యూబులు బ్లాక్ అయితే, టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చే ప్రక్రియకు లోనవుతారు. ఫేలోపియన్ ట్యూబ్ అంటే అది అండాన్ని గర్భ సంచికి కలిపే ట్యూబ్ అన్నమాట. కాని ఇపుడు కూడా ఈనిర్ణయం అవసరం లేదు. ఈ సమస్యకు మరికొన్ని చికిత్సలు వచ్చేశాయి. సర్జరీ, లేదా మైక్రో సర్జరీలు బ్లాకేజీలను తొలగిస్తాయి.

4. మీలోని అండాలు బాగా పాతవి లేదా ముసలివి అయిపోయాయా?
మహిళకు అండాలు ఓవరీలో పుట్టినపుడే వుంటాయి. అవి ఒకటొకటిగా పరిపక్వమై ప్రతినెలా బయటకు వస్తాయి. కనుక, మీరు 40 సంవత్సరాలవారై వుండి అండాలు 40 సంవత్సరాలవైతే, ఇక అవి సంతానం ఇవ్వకపోవచ్చు. లేదా హెమోఫిలియా అనే సమ్య మీలో వుండవచ్చు. అపుడు మీరు తప్పక ఐవిఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ చేయించాలి.

5. కృత్రిమ స్కలనం కూడా ప్రయత్నించండి - కృత్రిమ స్కలనం అంటే, వీర్యాన్ని మీ గర్భ సంచిలోకి తేలికగా, ఐవిఎఫ్ కంటే కూడా తక్కువ వ్యయంతో ప్రవేశ పెట్టి గర్భం పొందడం. కనుక మీ పార్టనర్ కు తక్కువ వీర్య కణాలుంటే తప్ప ఈ ఐవిఎఫ్ చికిత్స అవసరం లేదు. టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ ప్రక్రియ గర్భం పొందటానికి మీరు చేసే చివరి ప్రయత్నంగా వుండాలి. వేరే మార్గాలు ఏవీ లేనపుడే, టెస్ట్ ట్యూబ్ ప్రక్రియలో బేబీకి జన్మనివ్వాలి.

English summary

When To Go For IVF Treatment? | టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ...ఎపుడు? ఎలా?

Have you considered Artificial Insemination? IVF treatment should be the last option for a couple who is trying to conceive. There are several other methods you can try. If you do not succeed then you can always go for IVF.
Story first published:Tuesday, June 12, 2012, 9:56 [IST]
Desktop Bottom Promotion