For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు.. నివారణ

|

Why are babies born with Disability...?
మద్యపానం-పొగాకు వాడకం: మద్యపానం చేస్తే గర్భవతులకు మానసిక, శారీరక పెరుగదల లోపాలతో పిల్లలు పుట్టవచ్చు. పొగాకు వాడే గర్భవతులకు బరువు తక్కువ పిల్లలు పుట్టవచ్చు.

ఎక్స్‌రేలు: గర్భవతులకు ఎక్స్‌రేలు తీస్తే అంగవైకల్యంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది.

బి-కాంప్లెక్స్‌లోపం: గర్భవతిలో బి-కాంప్లెక్స్‌ విటమిన్‌ లోపం ఉంటే మెదడు, వెన్నుపూస లోపాలతో పిల్లలు జన్మించే అవకాశముంది.

అయోడిన్‌ లోపం: ఇప్పుడు అయోడిన్‌ గురించి అవగాహన పెరిగింది. తల్లిలో అయోడిన్‌లోపం ఉంటే బుద్ధిమాంద్యం, పుట్టుకతో చెవుడు, శారీరక, మానసిక పెరుగుదల లోపాలు సంభవించొచ్చు.

గర్భధారణ వయసు: స్త్రీలలో గర్భధారణ 20 సంవత్సరాలపైన, 30 సంవత్సరాలలోపల అనువైన సమయం. చిన్న వయసులో, బాగా పెద్దవారయిన తర్వాత గర్భధారణ పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు.

మేనరికపు వివాహాలు: మేనరికపు వివాహాల్లో అంగవైకల్యపు పిల్లల జననాలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనివేదికలు చెబుతున్నాయి.

అంగవైకల్యపు లక్షణాలను ఎలా నివారించాలంటే?

1. సరైన సమయంలో వివాహం చేసుకుని, సరైన వయసులో గర్భందాల్చడం మంచిది. 20 నుంచి 30 ఏళ్ల వయసు దీనికి సరైన సమయం.
2. మేనరికపు వివాహాలను నిరుత్సాహపరచండి.
3. స్వంత వైద్యం, అనవసరపు వైద్యం, అశాస్త్రీయ వైద్యం మానుకోండి.
4. మత్తు కలిగించే మందులు, వాంతులు తగ్గించే మందులు ఎలాంటి పరిస్థితిలో వాడకండి.
5. ఎడాపెడా ప్రతి చిన్న సమస్యకు ఎక్స్‌రేలు తీయించుకోకండి.
6. మద్యపానం చేయకండి. పొగాకు ఏ రూపంలో కూడా వాడకండి.
7. 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఎంఎంఆర్‌ టీకా వేయిస్తే రూబెల్లా వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
8. కాయగూరలు, ఆకుకూరలు బాగా తినాలి. పాలు పండ్లు బలవర్ధకమైన ఆహారం.
9. అన్ని అవసరాలకు అయోడిన్‌ కలిపిన ఉప్పును వాడండి.
10. గర్భవతులు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.

పిల్లలు అంగవైకల్య లక్షణాలతో పుట్టడం శాపం కాదు. ఈ లక్షణాలకు తల్లులే కారణం అని సమాజంలో చాలా మంది భావించడం దురదృష్టకరం. తల్లిలో, తండ్రిలో ఎవరైనా ఈ లక్షణాలతో పిట్టే పిల్లలకు కారణం కావొచ్చు. వీటి గురించి మహిళలను హింసించే ప్రవృత్తి పోవాలి. ఆలోచించాల్సిన ప్రధానాంశం చిన్నారుల భవిష్యత్తు గురించి. అంగవైకల్యపు చిన్నారులు సమాజంలో తాము ఒక భాగం అనే భావం కలిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

English summary

Why are babies born with Disability...? | అంగవైకల్యంతో బిడ్డపుట్టకుండా తగు జాగ్రత్తలు...

The first thing that needs to be said is that if you are reading this because it is a very urgent issue in your life, these words are written in the hope that you will find them sensitive and sympathetic. To have given birth to a disabled baby can, in the first instance, seem like a tragedy.
Story first published:Thursday, August 23, 2012, 9:40 [IST]
Desktop Bottom Promotion