For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానలేమికి గురిచేసే గర్భాశయ వ్యాధులు

|

గర్భాశయ వ్యాధులకు పుట్టుకతో వచ్చే లోపాలు, ఫైబ్రాయిడ్స్‌, గర్భాశయం లోపలి గోడలను అతుక్కొని ఉండే ఎండో మెట్రియల్‌ పాలిప్స్‌ వంటి సమస్యలు సంతానలేమికి దారితీస్తాయి. కారణాలేవైనా గర్భాశయ సమస్యలను ఆయుర్వేద వైద్యంలో స్నేహ, స్వేదకర్మలు, తక్రధార, యోని ప్రక్షాళన, ఉత్తరవస్తి లాంటి చికిత్సలతో దూరం చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు.

ఆయుర్వేదంలో గర్భాశయం గురించి, దాని సమస్యల గురించి వివరంగా ఆచార్యులు పేర్కొన్నారు. సీ్త్ర సంతాన యోగ్యత పొందటానికి నాలుగు ప్రధాన అంశాలు ముఖ్యం. ఇవి రుతు, క్షేత్రం, అంబు, బీజం. క్షేత్రం అంటే గర్భాశయం.గర్భం ధరించటానికి గర్భాశయం, గర్భాశయమార్గం, గర్భాశయ సంబంధిత భాగాలు ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ అండాశయం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా అండం విడుదల అయినప్పటికీ వీర్యకణంలో కలిసి ఫలదీకరణ చెందిన తర్వాత గర్భాశయ గోడలను ఆధారంగా చేసుకొని పిండం ఎదగాల్సి ఉంటుంది.

ఫలదీకరణ తర్వాత అండం పిండంగా రూపాంతరం చెందుతుంది. ఇది గర్భాశయంలో ఎండో మెట్రియం లైనింగ్‌ మీద స్థాపితమవుతుంది. గర్భాశయ పిండం పెరుగుదలకు అనుగుణంగా వ్యాకోచిస్తుంది. కానీ గర్భాశయంలో ఏదైనా లోపం ఉన్నపుడు సంతానలేమి లేదా గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉంది. క్షేత్రం ఆరోగ్యంగా లేకపోతే ఎండోమెట్రియోసిస్‌ వంటి గర్భాశయ వ్యాధులు వస్తాయి. ఎండోమెట్రియోసిస్‌ అంటే గర్భాశయంలోని లోపలి పొరలో వచ్చే మార్పులు. ముఖ్యంగా గర్భాశయ వాపు.

Diseases That Cause Infertility

గర్భాశయ వ్యాధులకు ప్రధాన కారణాలు

రుతుచక్రంలో మార్పులు, కొన్ని వ్యాధుల వల్ల అండం సరిగా విడుదల కాకపోవటం, నీటిబుడగలు, అండాశయం చిన్నదిగా ఉండటం, గర్భాశయ నిర్మాణంలో, ఆకృతిలో పుట్టుకతో వచ్చిన లోపాలు, జననాంగం లేకపోవటం, గర్భాశయమార్గంలో కండరాలు పెరగటం, గర్భాశయ ముఖద్వారం దగ్గర ఇన్ఫెక్షన్‌లు రావటం, మార్గం మూసుకొని ఉండటం, చిన్నగా ఉండటం, గర్భాశయంలో కణితలు ఏర్పడటం, ట్యూబులు మూసుకొని పోవటం, ట్యూబ్‌లలో వాపు రావటం. కొంత మందిలో గర్భాశయంలో రెండు గదులు ఉంటాయి.

ఫైబ్రాయిడ్లు : ఫైబ్రోమియామాస్‌, మయోమాస్‌ లేదా నాన్‌ కేన్సర్‌ ట్యూమర్స్‌ అంటారు. ఇది గర్భాశయ గోడకు అంటుకొని ఉంటాయి. చాలాసార్లు వీటివల్ల ఎలాంటి లక్షణాలు కనిపించవు.

హెచ్‌ఎస్‌జి పరీక్ష చేయించుకున్నపుడు ఈ సమస్య ఉన్నట్లు బయటపడుతుంది. ఈ ట్యూమర్స్‌ కేన్సర్‌ కారకాలు కాకపోయినా కూడా ఫలదీకరణం తర్వాత పిండ స్థాపనకు అడ్డంకిగా మారతాయి. గర్భాశయంలో ఎండోమిట్రియం నుంచి ఏర్పడే పాలిప్‌లు ఉన్నపుడు కూడా గర్భధారణకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి పాలిప్‌లు చిన్న పరిమాణంలో ఉన్నప్పటికి గర్భం దాల్చడంలో, పిండస్థాపనలో, పిండం ఎదగటంలో సమస్యగా పరిణమిస్తాయని పరిశోధనల్లో తేలింది. సంతానం కావాలి అనుకున్నపుడు గర్భాశయ గది ఆరోగ్యంగా ఉండాలి.

నిర్ధారణ పరీక్షలు : గర్భాశయ సమస్యలను గుర్తించడానికి నాలుగు రకాల పరీక్షలు చేస్తారు. హెచ్‌ఎస్‌జి, సోనోహిస్టరోగ్రామ్‌, ఆఫీస్‌ హిస్టరోస్కోపి, డిట్రాన్స్‌ వైజైనల్‌ స్కాన్‌ పరీక్షలతో సంతానలేమికి కారణాలను నిర్ధారించవచ్చు.

ఆయుర్వేద చికిత్స
గర్భాశయ సమస్యలకు అవసరాన్ని బట్టి స్నేహ, స్వేద కర్మలు చేస్తారు. హార్మోన్స్‌ సమస్య ఉంటే తక్రధార చికిత్సలు చేస్తారు. గర్భాశయ గోడలపై వ్యాధులు రాకుండా సహజంగా ఉండటానికి యోనిపీచు, యోని ప్రక్షాళన, ఉత్తరవస్తి లాంటి చికిత్స లు అద్భుతంగా పనిచేస్తాయి.

English summary

Diseases That Cause Infertility


 
 Most cases of female infertility are caused by problems with ovulation. Without ovulation, there are no eggs to be fertilized. Some signs that a woman is not ovulating normally include irregular or absent menstrual periods. Ovulation problems are often caused by polycystic ovarian syndrome (PCOS). PCOS is a hormone imbalance problem which can interfere with normal ovulation. PCOS is the most common cause of female infertility. Primary ovarian insufficiency (POI) is another cause of ovulation problems.
Story first published: Saturday, August 2, 2014, 17:15 [IST]
Desktop Bottom Promotion