For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో మానేయకూడని 10 అలవాట్లు

ప్రెగ్నెన్సీ సమయంలో మానేయకూడని 10 అలవాట్లు

By Swathi
|

ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కొక్కరి హెల్త్ ఒక్కోలా ఉంటుంది. వాళ్ల వాళ్ల శరీర తత్వాన్నిబట్టి.. వాళ్ల స్టామినా బట్టి ప్రెగ్నెన్సీ ఉంటుంది. కాబట్టి.. స్వంత నిర్ణయాలు తీసుకోకూడదు. డాక్టర్ సలహా ప్రకారం అన్నింటినీ ప్లాన్ చేసుకోవాలి. ఏ విషయాన్నీ ప్రెగ్నెన్సీ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రెగ్నెన్సీ టైంలో మొదట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. ఏ సమస్యనైనా అర్థం చేసుకోవడానికి, పరిష్కారం చెప్పడానికి డాక్టర్ సలహా తీసుకోవడం అత్యుత్తమం. కాబట్టి ఏదీ స్వంతంగా నిర్ణయాలు తీసుకోకండి.

ప్రెగ్నెన్సీ సమయంలో మసాజ్ చేయించుకోవడం చాలా ముఖ్యమైనదని, అది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి చాలా అవసరమని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎప్పుడైతే.. శరీరానికి మసాజ్ చేస్తామో అప్పుడు రక్తప్రసరణ బాగా జరిగి.. బ్లడ్ క్లాటింగ్ సమస్యను నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇలాంటి 10 మంచి అలవాట్లు.. ప్రెగ్నెన్సీ సమయంలో విడిచిపెట్టకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో వదిలిపెట్టకూడని.. 10 విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాఫీ

కాఫీ

కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది కడుపులోని బిడ్డకు చాలా అవసరం. అయితే ఎక్కువ మోతాదులో కాకుండా.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. కొంచెం తీసుకుంటే.. పొట్టలోని బిడ్డకు హానికారకం కాకుండా ఉంటుంది.

సెక్స్

సెక్స్

ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చాలా ఆరోగ్యకరమైనది. అంతేకాదు ఇది అబార్షన్ కి కారణం కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనల్ లెవెల్స్ పెరగడం గర్బిణీలకు చాలా అవసరం.

వ్యాయామం

వ్యాయామం

ప్రెగ్నెన్సీకి ముందు ఎలాంటి వ్యాయామం చేస్తుంటే.. దాన్ని ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫాలో అవ్వాలి. దీనివల్ల శరీరం ఫిట్ గా, బేబీ స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

ట్రావెలింగ్

ట్రావెలింగ్

ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ట్రావెలింగ్ చాలా మంచిదే. కానీ ఎక్కువసేపు కూర్చోకూడదు. కాబట్టి మధ్యలో కాస్త విరామం తీసుకుని.. కాసేపు నడవడం మంచిది. జర్నీ చాలా కంఫర్ట్ గా ఉండాలి.

మాంసం

మాంసం

ప్రెగ్నెన్సీ సమయంలో మాంసం చాలా ఆరోగ్యకరం. ఇందులో ఉండే ఐరన్ గర్భిణీలకు చాలా అవసరం. అయితే కోల్డ్ మీట్ మంచిది కాదు. కాబట్టి.. వేడిచేసి తీసుకోవాలి. లేదంటే.. అందులో ఉండే బ్యాక్టీరియా కడుపులో పెరిగే బిడ్డకు మంచిది కాదు.

పడుకునే విధానం

పడుకునే విధానం

వెల్లకిలా పడుకోకూడదని.. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుందని గర్భిణీ స్త్రీలకు చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది మహిళలు వెల్లకిలా పడుకోవడానికి ఇష్టపడే గర్భిణీలకు శుభవార్త. ఎందుకంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వెల్లకిలా పడుకోవచ్చు. అయితే మరీ ఎక్కువసేపు కాకుండా.. కాసేపు పడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

లాంగ్ బాత్స్

లాంగ్ బాత్స్

అలసిపోయిన గర్భిణీ స్త్రీలు ఎక్కువ సేపు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. మీ శరీరాన్ని 98.6 డిగ్రీల ఫారన్ హీట్ లో టెంపరేచర్ ఉంచుకోవడం చాలా మంచిది.

హెయిర్ కలర్స్

హెయిర్ కలర్స్

మొదటి ట్రైమ్ స్టర్ తర్వాత జుట్టుకి రంగువేసుకోవడం సురక్షితం. అయితే మొదటి మూడునెలల్లో వేసుకోకూడదు. ఇందులో ఉండే కెమికల్స్ గర్భిణీలకు సురక్షితం కాదు.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

పాస్టరైజ్డ్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం మంచిది. కానీ పాస్టరైజ్ చేయని డైరీ ప్రొడక్ట్స్ ని మాత్రం గర్భిణీలు తీసుకోకూడదు.

మసాజ్

మసాజ్

ట్రైన్డ్ ప్రినాటల్ థెరపిస్ట్ దగ్గర మసాజ్ చేయించుకోవడం వల్ల గర్భిణీలకు చాలా ఉపశమనం కలుగుతుంది. కనీసం నెలకు ఒకసారైనా గర్భిణీలు మసాజ్ చేయించుకోవడం మంచిది.

English summary

10 Things Not To Give Up During Pregnancy

10 Things Not To Give Up During Pregnancy. Every pregnancy is different, so it is important not to take decisions on your own, without consulting the doctor first.
Desktop Bottom Promotion