For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు చెప్పకూడని, గర్భిణీలు చేయకూడని 10 విషయాలు..!!

By Swathi
|

మీరు గర్భందాల్చిన తర్వాత మీ చుట్టూ ఉన్నవాళ్లు చాలా కొత్తగా ప్రవర్తిస్తారు. పెరుగున్న మీ పొట్టపై ప్రతి ఒక్కరికీ.. జాలి ఉంటుంది.. గమనిస్తూ ఉంటారు. ఆహారపు అలవాట్లు, మీరు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ఎలా వెళ్తున్నారనే విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.

కొందరు పనికొచ్చే సలహాలు ఇస్తూ ఉంటే.. మరికొందరు చిరాకు తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ప్రవర్తన హ్యాపీగా అనిపిస్తే.. మరికొందరు బిహేవియర్ అసహ్యంగా ఉంటుంది. అయితే.. మైండ్ లెస్ అఫెక్షన్స్, విలువలేని సలహాలు అవసరం లేదని గుర్తుంచుకోండి. కానీ వాళ్లు అక్కడితో ఆగిపోరు. కాబట్టి గర్భిణీ స్త్రీలకు చెప్పకూడని, గర్భిణీలు చేయకూడని కొన్ని పనులున్నాయి. అవేంటో చూద్దాం..

పొట్టను బాగా చూపించడం

పొట్టను బాగా చూపించడం

పెరుగుతున్న పొట్ట అందరికీ ఎక్కువగా కనిపించకుండా జాగ్రత్త పడాలి. కొందరు పొట్టచూసి వదిలేయరు. దాన్ని చూసి.. పొట్ట బాగా పెద్దగా ఉంది.. ట్విన్స్ ఉన్నారా పొట్టలో అని కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి మాటలు పట్టించుకోకుండా వదిలేయడం మంచిది.

కామెంట్స్

కామెంట్స్

బెల్లీపై జోక్స్ వేయడానికి ఇండియన్స్ బాగా ఇష్టపడతారు. కొంతమంది పొట్టను టచ్ చేసి చూసి.. లోపలు ఉన్నది బాబూ లేదా పాప అని చెప్పడం, కొన్ని సార్లు తల్లి సెక్స్ లైఫ్ గురించి కూడా.. కామెంట్ చేస్తూ ఉంటారు. వీటిని జోక్స్ అని ఎలా ఫీలవుతారో ఏమో కూడా అర్థంకాదు.

ప్లాన్డ్ ప్రెగ్నన్సీ

ప్లాన్డ్ ప్రెగ్నన్సీ

మీది ప్లాన్డ్ ప్రెగ్నన్సీనా.. మీ భర్త హ్యాపీనా, అనుకోకుండా కన్సీవ్ అయ్యావా.. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ప్రెగ్నంట్ ఉమెన్ లో చిర్రెత్తిస్తాయి. ఇలాంటప్పుడు వాళ్ల నోటిని ఎలా మూయించడం చాలా అవసరం. ప్రగ్నంట్ అని తెలిశాక కంగ్రాట్స్ చెబితే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అవసరం లేదు.

మళ్లీ వర్క్ లో జాయిన్ అవుతావా ?

మళ్లీ వర్క్ లో జాయిన్ అవుతావా ?

మీ బిల్లులు ఎవరూ పే చేయరు, కానీ ప్రతి ఒక్కరూ.. మీరు ఇంట్లో ఉంటే.. మీ కోసం ఎలా ఖర్చు చేసుకుంటారనే ప్రశ్నిస్తారు. మీరు వాళ్లను ఆర్థికంగా సహాయం అడగకపోతే.. వాళ్లకు పెద్ద ప్రమాదం అన్నట్టు ఫీలవుతారు.

డాక్టర్ బాగానే చూస్తారా ?

డాక్టర్ బాగానే చూస్తారా ?

మీరు ఎలాంటి హాస్పిటల్ ఎంచుకున్నారో అన్న టెన్షన్ ఎదుటివాళ్లకు ఎక్కువై ఉంటుంది. మీరు, మీ భర్త కలిసి.. ఏదో చెత్త హాస్పిటల్ కి వెళ్తున్నారా అన్నట్టు.. డాక్టర్ మంచిదేనా అని అడగటం సరైనది కాదు.

లేబర్ లేదా సిజేరియన్

లేబర్ లేదా సిజేరియన్

ప్రెగ్నెన్సీలో చివరి నిమిషం వరకు తెలియదు, లేబర్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అన్న విషయం. కాబట్టి.. దీని గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అనవసర టెన్షన్ కి గురవుతారు.

ఎలా ఫీలవుతున్నావ్ ?

ఎలా ఫీలవుతున్నావ్ ?

మార్నింగ్ సిక్ నెస్, అలసట ఇలాంటివన్నీ.. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మళ్లీ వాటిని గుర్తు చేయడం మంచిది కాదు.

తినవచ్చని అనుకోవడం లేదు

తినవచ్చని అనుకోవడం లేదు

పిజా, పేస్ట్రీ, పచ్చళ్లు, చైనీస్ ఫుడ్ వంటివి తినవచ్చో లేదా తెలియకపోయినా.. అనవసర సలహాలు ఇస్తుంటారు. ప్రెగ్నన్సీ సమయంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనేది వాళ్లకు ఒక ఐడియా ఉంటుంది.

సిజేరియన్

సిజేరియన్

సిజేరియన్ గురించి నెగటివ్ గా మాట్లాడటం వల్ల గర్భిణీలు మరింత ఆందోళనకు గురవుతారు. కాబట్టి.. సిజేయన్ సమయంలో ఎలా ఉంటుంది అనేదానిపై ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది.

రాత్రంతా బేబీ నిద్రపోరు అని

రాత్రంతా బేబీ నిద్రపోరు అని

రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఎందుకంటే.. తెలిసీ తెలియని కారణాలు చెప్పి.. మిమ్మల్ని మరింత ఆందోళనకు గురిచేస్తారు. కాబట్టి.. ఏ ఫీలింగ్, ఎలాంటి అనారోగ్య సమస్య కలిగినా.. డాక్టర్ కి వివరించడం మంచిది.

English summary

10 things you should never say to a pregnant woman

10 things you should never say to a pregnant woman. Here are 10 things people should absolutely stop doing to a pregnant woman.
Story first published:Thursday, June 30, 2016, 16:20 [IST]
Desktop Bottom Promotion