For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భదారణకు ముందు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు..

By Swathi
|

ఈ ప్రపంచానికి మరో ప్రాణిని పరిచయం చేసే అద్భుతమైన అనుభూతి గర్భదారణ. ఒక బిడ్డకు జన్మనిచ్చే ఆ సమయం చాలా అందమైనది. తల్లిదండ్రులుగా మారే ఆ క్షణాలు మధురానుభూతులు. అయితే ప్రెగ్నెన్సీ, డెలివరీ, పేరెంటింగ్ అనే అనుభవాలు అంత సులువైనవి కావు.

అయితే బిడ్డకు జన్మనివ్వాలని భార్యాభర్తలు భావించినప్పుడు, కన్సీవ్ అవ్వాలని కోరుకున్నప్పుడు ఏ మాత్రం సమయం వేస్ట్ చేయకుండా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలపై అవగాహన ఉండాలి.

కన్సీవ్ అవడం చాలా తేలికగానే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య రిలేషన్, లైంగిక చర్య ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన గర్భం దాల్చలేరు. కాబట్టి.. కన్సీవ్ అవ్వడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పొల్యూషన్, ఒత్తిడి, అన్ హెల్తీ లైఫ్ స్టైల్, ఇన్ఫెర్టిలిటీ వంటి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. కన్సీవ్ అవడానికి ముందు ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి ? ఎలాంటి పనులను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదో తెలుసుకుందాం..

డ్రింకింగ్

డ్రింకింగ్

చాలా మంది గర్భం దాల్చిన తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదని అనుకుంటారు. కానీ.. గర్బధారణకు ముందుకు కూడా ఆల్కహాల్ సేవించే అలవాటు అస్సలు మంచిది కాదు. కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు.. మగవాళ్లు కూడా.. ఇద్దరూ ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల.. ఇన్ఫెర్టిలిటీకి దారితీసి.. స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కన్సీవ్ అవ్వాలి అనుకునేవాళ్లు ఈ అలవాటుకి దూరంగా ఉండాలి.

వ్యాయామం

వ్యాయామం

హెల్తీగా, ఫిట్ గా ఉండటం ఆడవాళ్లకు మంచిదే. దానికోసం రోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. కానీ.. కొంతమంది చాలా ఎక్కువ సమయం వ్యాయామం చేస్తారు. అయితే ఎక్కువ సమయం వ్యాయామం చేసే ఆడవాళ్లు కన్సీవ్ అవడానికి చాలా సమయం పడుతుందని.. స్టడీస్ చెబుతున్నాయి. దీనివల్ల రుతుక్రమ సమస్యలు, దాని కారణంగా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి

ఒత్తిడి

ఎక్కువగా ఒత్తిడికి లోనవడం, డిప్రెషన్ తో బాధపడటం వల్ల ప్రెగ్నెంట్ అవడం చాలా కష్టమవుతుంది. ఇవి అలసట, సెక్స్ కి దూరంగా ఉండటం వంటి లక్షణాలకు కారణమవుతాయి. ఒత్తిడి మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల.. బ్యాడ్ ఫెర్టిలిటీకి అవకాశం ఉంది.

అన్ హెల్తీ డైట్

అన్ హెల్తీ డైట్

మీరు గర్భం దాల్చాలని.. చాలా ఖచ్చితంగా భావిస్తుంటే.. హెల్తీ డైట్ కి అలవాటు పడాలి. పోషకాహారం తీసుకోవడం ప్రారంభించాలి. వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్, సరైన మోతాదులో నీళ్లు, ఎగ్స్, మిల్క్ వంటివి ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి. శ్యాచురేటెడ్ ఫ్యాట్, ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

అధిక బరువు

అధిక బరువు

కన్సీవ్ అవ్వాలి అనుకునేవాళ్లు అధిక బరువు ఉండకూడదు. అలాగని తక్కువ బరువు కూడా ఉండకూడదు. ఒబేసిటీ అనేది మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపుతుంది. తక్కువ బరువు ఉంటే.. ఆడవాళ్ల ఎగ్ క్వాలిటీపై దుష్ప్రభావం చూపుతుంది. దీనికారణంగా అబార్షన్ కి అవకాశం ఉంది.

స్మోకింగ్

స్మోకింగ్

మీరు గర్భం దాల్చాలని భావిస్తుంటే.. స్మోకింగ్ హ్యాబిట్ మానేయాలి. తాజా అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్స్ పై ప్రభావం చూపుతుంది. దీనికారణంగా జెనెటిక్ అబ్ నార్మాలిటీస్ కి కారణం అవుతుంది.

ల్యాప్ టాప్స్

ల్యాప్ టాప్స్

టెక్నాలజీ లేకుండా.. ప్రస్తుత జనరేషన్ ఏమాత్రం జీవించలేదు. ల్యాప్ టాప్స్, సెల్ ఫోన్స్ వంటివి ఎప్పుడూ చేతిలో ఉండాల్సిందే. ల్యాప్ టాప్స్ ని మగవాళ్లు తొడల భాగంపై, ఆడవాళ్లు గర్భాశయానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల.. రేడియేషన్ కారణంగా వేడి తగిలి.. ఫెర్టిలిటీపై తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

కెఫీన్

కెఫీన్

కాఫీ, కెఫీన్ తో కూడిన ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే.. ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. కానీ.. కన్సీవ్ అవ్వాలి అనుకునేవాళ్లు వీటికి దూరంగా ఉండటం చాలా అవసరం. రోజుకి 200ఎమ్ జీ కంటే తక్కువ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల.. అబార్షన్, ప్రీమెచ్యూర్ బర్త్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి.

Story first published:Tuesday, April 12, 2016, 10:07 [IST]
Desktop Bottom Promotion