For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని కామన్ మిస్టేక్స్..!!

By Swathi
|

సాధారణంగా ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించినా, పాటించకపోయినా.. పెద్దగా సమస్య ఉండదు. కానీ.. గర్భం పొందిన తర్వాత.. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలి. తీసుకునే ఆహారం నుంచి.. చేసే పనుల వరకు.. ఏదైనా.. వెనకా ముందు ఆలోచించి.. పొట్టలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని తప్పులు చేయకూడదు.

pregnant mistakes

కొన్ని పొరపాట్లు గర్భిణీలకు తీవ్ర హానిచేస్తాయి. కాబట్టి గర్భం పొందిన తర్వాత.. ఈ తప్పులను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. అవన్నీ చాలా చిన్న విషయాలే అయినా.. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.

సరుకుల బ్యాగ్స్ మోయడం

సరుకుల బ్యాగ్స్ మోయడం

పాలు, బ్రెడ్, ఎగ్స్ అయితే ఫర్వాలేదు. కానీ.. 5 నుంచి 6 కేజీల సరుల బ్యాగ్ తీసుకుని.. దాన్ని మోసుకుని నడవకూడదు. ముఖ్యంగా మొదటిమూడు నెలల సమయంలో.. ఇలా హెవీ వెయిట్స్ ని ఏమాత్రం పట్టుకోకూడదు.

బోర్లా పడుకోవడం

బోర్లా పడుకోవడం

కొంతమంది..బోర్లా పడుకుంటూ ఉంటారు. ఇలా పడుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల బేబీకి పోషకాలు, బ్లడ్ సప్లై తక్కువవుతుంది.

పిల్లలను ఎత్తుకోవడం

పిల్లలను ఎత్తుకోవడం

చిన్న పిల్లలే అయినా.. గర్భంతో ఉన్నప్పుడు వాళ్లను ఎత్తుకోకూడదు. దీనివల్ల.. పొట్టలో బేబీపై ఒత్తిడి పెరుగుతుంది.

హీల్స్ వేసుకోవడం

హీల్స్ వేసుకోవడం

ప్రెగ్నన్సీ టైంలో.. ఫ్లాట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకోవడం మంచిది. హై హీల్స్ వేసుకోవడం వల్ల.. పొట్టలో బేబీ పెరిగేకొద్దీ.. మీ వెయిట్ పెరుగుతుంది. దీనివల్ల.. స్లిప్ అయినా, పడిపోయినా.. చాలా డేంజర్.

ఎక్కువగా స్మార్ట్ ఫోన్

ఎక్కువగా స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్స్ లేకుండా మనం ఉండలేం. కానీ.. వీటి ద్వారా వచ్చే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్.. గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. పరిమితిగా ఉపయోగించండి. పడుకునేటప్పుడు.. దూరంగా పెట్టుకోవడం మంచిది.

హర్రర్ మూవీస్

హర్రర్ మూవీస్

హర్రర్ మూవీస్ చూసినా.. ఒకవేళ మీరు భయపడకపోతే.. చూడవచ్చు. కానీ.. తర్వాత మీరు భయపడేలా ఉంటే.. ఒత్తిడికి గురవుతారు. కాబట్టి.. అలాంటి సినిమాలు చూడకపోవడం మంచిది.

కిందకి వంగడం

కిందకి వంగడం

ఇలా కిందకి వంగడం వల్ల.. బెల్లీపై జెర్క్ ఏర్పాడి, పొట్టపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రెగ్నన్సీ టైంలో.. కిందకు వంగకుండా.. జాగ్రత్త తీసుకోవాలి.

ఎక్కువగా నిద్రపోవడం

ఎక్కువగా నిద్రపోవడం

మరీ ఎక్కువగా నిద్రపోకూడదు. రెస్ట్ కావాలి అనుకున్నప్పుడు మరీ ఎక్కువగా నిద్రపోకూడదు. కాబట్టి.. ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు.. నిద్రపోవడం మంచిది.

English summary

Common Mistakes Pregnant Women should Avoid

Common Mistakes Pregnant Women should Avoid. Despite our honest attempts at healthy living and right eating during pregnancy, we do commit some mistakes, unknowingly.
Story first published: Saturday, October 8, 2016, 11:50 [IST]
Desktop Bottom Promotion